Meghasandesam Serial Today May 16th: ‘మేఘసందేశం’ సీరియల్: ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామన్న గగన్ - దూరం నుంచి అంతా గమనించిన శరత్ చంద్ర
Meghasandesam Today Episode: భూమితో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని గగన్ ప్లాన్ చేయడం శరత్‌చంద్రకు తెలిసిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : అపూర్వ దగ్గరకు కోపంగా వస్తుంది భూమి. ఇద్దరూ ఒకరినొకరు గుర్రుగా చూసుకుంటుంటారు. మీకు పవర్స్ ఉంటే ఇద్దరు ఇక్కడే బూడిదై పోయేవారు అంటుంది సుజాత. దీంతో అపూర్వ తనకు పవర్ లేకపోయినా ఏదో ఒక రోజే ఈ భూమి నా చేతిలో కాలి బూడిదై పోతుంది అనగానే భూమి కోపంగా చూస్తుంది.
భూమి: అంత లేదులే అపూర్వ నీలాగే నేను ఆలోచిస్తే నిన్ను బూడిద చేయడానికి నాకు ఎంతో టైం పట్టదు. చెప్పు ఇవన్నీ నువ్వు కావాలనే చేశావు కదా.? కావాలనే గగన్ గారిని ఇరికించడానికి న్యూస్ గురించి చెప్పి మా నాన్ను రెచ్చగొట్టావు కదా..?
అపూర్వ: అవునే కావాలనే ప్లాన్ చేశాను. కాకపోతే కేపీ ఇదంతా చేశాడని నాకు తెలియదు. అది మాత్రం విన్న వెంటనే చాలా సర్‌ప్రైజ్ అనిపించింది.
భూమి: ఇవన్నీ చేసి ఏం సాధించాలనుకున్నావు..?
అపూర్వ: నిన్ను ఆ గగన్ గాడిని దూరం చేయాలని
భూమి: ఏడిశావు ఈ జన్మలో కాదు కదా నువ్వు ఏడు జన్మలు ఎత్తినా నీకు అయ్యే పని కాదు. నేను గగన్ బావ ఏడు ఏడు జన్మలు కలిసే ఉంటాము..
సుజాత: ఏడు ఏళ్లు నలభై తొమ్మిది అంటే అన్ని జన్మలు కలిసే ఉంటారా అమ్మా.. ?
అపూర్వ: కలలు కంటుంది పిన్ని..
భూమి: మేము కలవకూడదు అనుకున్న నీ కల కన్నీరు అయినప్పుడు తెలుస్తుంది అపూర్వ. మేము ప్రతి జన్మలోనూ ఒకరి కోసం ఒకరం పుడతామని.. మా సంగతి పక్కన పెట్టు అపూర్వ.. మా అమ్మ శోభాచంద్రను నువ్వే చంపావని నాన్నకు తెలిస్తే నీ పరిస్తితి ఏంటి..? ఆలోచించు.
అపూర్వ: ఎలా తెలుస్తుంది. చూశావుగా నా బావ నన్ను ఎంత గుడ్డిగా నమ్ముతున్నాడో.. నిజంగా అలాంటి సందర్భం వస్తే.. అది నువ్వే కల్పించావని కొట్టిపారేస్తాను.
భూమి: నా ప్రమేయం లేకుండా నేనేం చేయకుండా నాన్నకు మర్డర్ అటెంప్ట్ జరిగిన ఆ నైట్ గుర్తుకు వస్తే అప్పుడెలా తప్పించుకుంటావు.
అపూర్వ: ఏయ్ ఏం మాట్లాడుతున్నావే.. ఆ మర్డర్ అటెంప్ట్‌కు నాకు సంబంధం ఏంటి..?
భూమి: నువ్వు ఇలా తడబడుతుంటే.. నువ్వే మా నాన్ను మర్డర్ అటెంప్ట్ చేశావేమోనని నాకు అనుమానం.
అపూర్వ: నీ బోడి అనుమానంతో నాకేం పనే.?
భూమి: అంటే దొరకనంటావు..?
అపూర్వ: ఏయ్ అసలేం మాట్లాడుతున్నావే ఆ మర్డర్ అటెంప్ట్ కు నాకు సంబందం లేదు అని చెప్తున్నాను కదా..?
భూమి: చూశావా..? నన్ను బావను కలవనివ్వను అని చాలెంజ్ చేసిన ఒక్క నిమిషంలోనే నిన్ను షెల్ప్ డిఫెన్స్ లో పడేశాను. అయినా పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడే ఆ కిల్లర్ నోరు తెరిస్తే ఆ పేరు నీది కావొచ్చు కాస్త జాగ్రత్తగా ఉండు
అంటూ వార్నింగ్ ఇచ్చి భూమి వెళ్లిపోతుంది. తర్వాత కేపీతో బిందు ఏడుస్తుంది. పదే పదే నిన్ను మామయ్య కొట్టడం చూడలేకపోతున్నాను అంటూ బాధపడుతుంది. బిందును కేపీ ఓదారుస్తుంటాడు. ఇంతలో మీరా వచ్చి కేపీని తిడుతుంది. మీడియాలో ఈ ఇంటి పరువు తీస్తారా..? భూమికి చెర్రికి పెళ్లి చేస్తే నా మేనకోడలు మన ఇంట్లోనే ఉండేది అంటుంది. దీంతో కేపీ మీరాను కొట్టి వెళ్లిపోతాడు. తర్వాత భూమి గగన్ దగ్గరకు వెళ్తుంటే గగనే ఎదురొస్తాడు. భూమి తనకు భయం వేస్తుందని అపూర్వ పెళ్లి జరగకుండా చేస్తుందేమోనని భయపడుతుంది. దీంతో ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని గగన్ చెప్తాడు. అదంతా దూరం నుంచి శరత్ చంద్ర చూస్తుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















