Meghasandesam Serial Today May 12th: ‘మేఘసందేశం’ సీరియల్: శరత్ చంద్రను చంపబోయిన అపూర్వ – అడ్డుకున్న భూమి
Meghasandesam Today Episode: శరత్ చంద్రను రహస్యంగా బయటకు తీసుకెళ్లి అపూర్వ చంపాలనుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : ఎవ్వరూ లేని టైం చూసుకుని అపూర్వ, శరత్ చంద్ర రూంలోకి వెళ్లి శరత్ చంద్రను చంపాలనుకుంటుంది. శరత్ చంద్రకు ఉన్న ఆక్సిజన్ తీసేయాలని ప్రయత్నించి ఆగిపోతుంది. ఏడుస్తూ శరత్‌చంద్ర పక్కనే కూర్చుని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. ఏడుస్తూ.. నిన్ను నా చేతులతో చంపలేను బావ.. నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను. అలాగే భూమి, గగన్ ల పెళ్లి కూడా ఆపే తీరుతాను అనుకుంటుంది. మరోవైపు భూమిని తన రూంలోకి తీసుకెళ్తాడు గగన్.
గగన్: మన పెళ్లి అని ఫిక్స్ అయ్యాక.. నువ్వు నాకు కొత్తగా కనబడటం మొదలుపెట్టావు. నువ్వేంటి నీతో గడుపుతున్న ప్రతిక్షణం, నీతో గడుపుతున్న ప్రతి స్థలం అన్ని నాకు కొత్తగానే కనిపిస్తున్నాయి. ఈ రూంలో మన మధ్య ఎన్నో జ్ఞాపకాలు. అవన్నీ నాకు కొత్తగా గుర్తుకు వస్తున్నాయి. నీకు గుర్తుకు వస్తున్నాయా..? భూమి..
భూమి: ఆ చెప్పండి..
గగన్: ఏం చెప్పండి.. ఇప్పటి దాకా నేను చెప్తూనే ఉన్నాను కదా..? నువ్వేమీ వినలేదా..?
భూమి: అదేం లేదు వింటున్నాను. అదే ఈ రూంలో మన మధ్య జ్ఞాపకాల గురించి మాట్లాడుతున్నారు.
గగన్: లేదు నువ్వేంటో ఆలోచిస్తున్నావు. అదేంటో నాకు చెప్పు..
భూమి: ఏమీ లేదండి..
గగన్: ప్రేమించుకుంటున్నాం.. పెళ్లి కూడా చేసుకోబోతున్నాం.. మనసులో ఏమున్నా..మన మధ్య సీక్రెట్స్ ఉండకూడదు. షేర్ చేసుకోవాలి. పర్వాలేదు చెప్పు
భూమి: వద్దండి చెప్తే మీరు బాధపడతారు.
గగన్: ఏంటి ఈ దాగుడు మూతలు.. ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా బాధపడతాను.
భూమి: అంటే.. నేను ఈ ఊరొచ్చిందే.. నాన్నను వెతుక్కుంటూ.. చూశారా..? మీకు కోపం వస్తుంది. మీకు బాధో కోపమో ఏదో ఒకటి వస్తుంది. అందుకే మీకు చెప్పడానికి సంకోచించాను.
గగన్: నో ఏం లేదు.. చెప్పు.. అవును నువ్వు మీ నాన్నను వెతుక్కుంటూ వచ్చావు. మన కలయిక అనుకోకుండా ప్రేమగా మారింది చెప్పు.
భూమి: ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లి అవుతుంది. అదే ఇప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది గగన్ గారు. ఏ నాన్ను వెతుక్కుంటూ వచ్చామో ఆ నాన్న ఇప్పుడు ఆచేతనంగా పడి ఉన్నారు. మనమేదో దొంగచాటుగా పెళ్లి చేసుకుంటున్నట్టు ఉంది.
గగన్: ఫైనల్‌గా నీ ఉద్దేశ్యం ఏంటి భూమి.
భూమి: అంటే నాన్న అంగీకారంతో నాన్న సమక్షంలో.. నాన్న ఆశీర్వాదంతో మన పెళ్లి జరిగితే బాగుంటుంది.
గగన్: ఏమైంది భూమి నీకు.. నువ్వు సొంత కూతురివి అని తెలియక ముందే మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఇప్పుడు సొంత కూతురివి అని తెలిశాక ఎలా ఒప్పుకుంటారు.
భూమి: సొంత కూతురు అనుకున్న తర్వాత దాని మీద మరింత ప్రేమ కుదురుతుంది. అవునండి ఎవరూ బాధపెట్టలేరండి. అలాగే నాన్నగారు కూడా నన్ను బాధపెట్టాలనుకోరు. మన ప్రేమను అంగీకరిస్తారు. మన పెళ్లిని ఆశీర్వదిస్తారు.
గగన్: అంటే మీ నాన్న కోమాలోంచి బయటకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అంటావా..?
భూమి: వెయిట్ చేద్దాం అండి..
అంటూ భూమి చెప్పగానే.. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం తర్వాత ఎలాగైనా ఆయన్ని ఒప్పించే బాధ్యత నాది అంటాడు గగన్. దీంతో భూమి ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు సుజాత దగ్గరకు వెళ్లిన అపూర్వ ఏడుస్తూ శరత్ చంద్రను చంపే అవకాశం వచ్చినా చంపలేకపోయాను అంటుంది. కానీ మళ్లీ చంపాలని ప్లాన్ చేస్తుంది. రాత్రి పూట ఎవ్వరూ లేని టైంలో శరత్ చంద్రను బయటకు తీసుకెళ్లి చంపాలనుకుంటుంది. అనుకున్నట్టు గానే శరత్ చంద్రను తీసుకెళ్తుంటే.. అప్పుడే అక్కడికి భూమి వస్తుంది. అపూర్వ, భూమిని పక్కకు నెట్టేయబోతుంది. ఇంతలో అపూర్వ తీసుకొచ్చిన రౌడీ శరత్ చంద్రను చంపబోతుంటే.. భూమి వచ్చి చేతితో కత్తి పట్టుకుంటుంది. భూమి చేయి కట్ అయి రక్తం శరత్ చంద్ర మీద పడుతుంది. దీంతో శరత్ చంద్ర కోమాలొంచి బయటకు వస్తాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















