Meghasandesam Serial Today December 7th: ‘మేఘసందేశం’ సీరియల్: గుడిలో భూమికి ఐలవ్యూ చెప్పిన గగన్ – గగన్ ఐలవ్యూ చెప్పడం చూసిన శరత్ చంద్ర
Meghasandesam Today Episode: గుడిలో భూమికి గగన్ ఐలవ్యూ చెప్పడం శరత్ చంద్ర చూస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: పక్కకు తిరిగితే చెప్పానని గగన్ అనడంతో నేను తిరగనని మీరేం చెప్పినా ముఖం మీదే చెప్తారు. నాకు అలా చెప్పడమే ఇష్టం అంటుంది భూమి. దీంతో గగన్ కళ్లు మూసుకుని చెప్తాను అంటాడు. మీరు కళ్లు మూసుకుంటే నేను మీకు కనబడను.. మీరు చెప్పేది నాకు వినబడదు అలాగయితే నేను వెళ్లిపోతాను అంటుంది భూమి. అయితే నిన్ను చూస్తూ చెప్పాలి అంతే కదా..? అంటూ ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టి నన్ను సేవ్ చేశావు. ఆ మేలుకు జీవితాంతం రుణపడిపోతానన్న ఫీలింగ్ మొదలైంది. కానీ అది కేవలం ఇష్టం మాత్రమే.. అమ్మ చెల్లితో వాళ్లు ఏమైపోతారోనని నన్ను సేవ్ చేశానని అన్నావు కదా..? అప్పుడు ఆ ఫీల్ కలిగింది. ఆ ఫీలింగ్ పేరు ఇష్టం కాదు ప్రేమ అని గగన్ చెప్పగానే భూమి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో గగన ఐలవ్యూ చెప్తాడు. భూమి పక్కకు తిరిగి సంతోషపడుతుంది. గగన్ గట్టిగా భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పడంతో అప్పుడే అక్కడకు వచ్చిన శరత్ చంద్ర గగన్‌ను కొడతాడు.
శరత్: నా బిడ్డకు ఐ లవ్యూ చెప్పడానికి ఎంత ధైర్యంరా నీకు..
భూమి: అంకుల్ తొందర పడొద్దు..
శరత్: నువ్వు ఆగమ్మా.. నా బిడ్డను ప్రేమించడానికి నీకు ఏం అర్హత ఉందిరా..?
గగన్: భూమి వీడి గురించి వదిలేయ్.. వీడు కొడితే నేను లేచాను. నేను కొడితే వీడు ఏకంగా సమాధిలోకి వెళ్తాడు. ఇక్కడ టాపిక్ వీడు కాదు. మన ప్రేమ భూమి. నువ్వు చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని ఒక్కమాట చెప్పు.
భూమి: ఫ్లీజ్ అండి అంకుల్ ను వదిలేయండి.
గగన్: వదిలేశాను. వీడి మీద జాలితో కాదు. నీ మీద ప్రేమతో వదిలేశాను. నువ్వు ప్రేమిస్తున్నానని ఒక్కమాట చెప్పు వీడు కాదు కదా..? పాతిక మంది వచ్చినా నిన్ను పట్టుకెళ్తాను.
శరత్: ఓరేయ్ ఏమని చెప్తుందిరా.. నాలుగు రోజులు షెల్టర్ ఇచ్చావని ప్రేమించమని దబాయించి అడుగుతాన్నావా…? నువ్వు షెల్టర్ మాత్రమే ఇచ్చావు. నేను నా ఇంట్లో స్థానం ఇచ్చాను. తండ్రిగా నేను చెప్తున్నాను భూమి నిన్ను ప్రేమించడం లేదు.
గగన్: భూమి నువ్వు చెప్పు ఒక్కమాట.
అంటూ అడగ్గానే శరత్ చంద్ర నీకు ఏం అర్హత ఉందో చెప్పు నీ ఫ్యామిలీకి ఏం అర్హత ఉందో చెప్పు. అంటూ తిడతాడు. నువ్వు ఎన్ని సార్లు అడిగినా సమాధానం చెప్పడం లేదంటే దానర్థం ప్రేమించడం లేదని చెప్తూ భూమిని తీసుకుని వెళ్లిపోతాడు. గగన్ బాధపడుతుంటాడు. తర్వాత శరత్ చంద్ర భూమిని ఇంటికి తీసుకురావడం చూసిన అపూర్వ షాక్ అవుతుంది. భూమిని లోపలికి తీసుకెళ్లిన శరత్ చంద్ర భూమిని తిడుతుంటాడు.
శరత్: అసలు నువ్వే చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..? నేను ఎప్పుడూ నా కూతురు అనుకుంటుంటే.. నువ్వు మాత్రం నన్ను పరాయివాడిగానే చూస్తున్నావు.
సుజాత: ఇదేంటి అమ్మాయి ఆడియో వినిపించడం లేదు.. వీడియో కనిపించడం లేదు.
శరత్: వాడలా చెప్తున్నా నువ్వు సైలెంట్ గా ఉన్నావు.. అంటే నువ్వు కూడా వాణ్ని ప్రేమిస్తున్నావా..? అందుకే అక్కడికి వెళ్లావా..? నీ సమాధానం అవును అయితే ధైర్యంగా చెప్పొచ్చు.. నీ స్థానంలో నా కన్నకూతురు ఉంటే ఆ క్షణమే చంపేసి ఉండేవాణ్ని. ఏదో ఒక సమాధానం చెప్పాలి కదమ్మా.. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నువ్వు ఎక్కడున్నా నీ అభిమానం అలాగే ఉంటుంది. నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా మా ఇద్దరి మధ్య శత్రుత్వం అలాగే ఉంటుంది.
భూమి: నాన్నా..
శరత్: ఈ పిలుపు చాలా సంతోషంగా ఉందమ్మా..? ఆ ఇంటికి వెళ్లాక ఇంకెప్పుడు ఇలా పిలవకు
అని శరత్ చంద్ర చెప్పగానే భూమి ఏడుస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!