అన్వేషించండి

Meghasandesam Serial Today December 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఉంగరాల కోసం పోటీ పడ్డ భూమి, గగన్‌ - ఆసక్తిగా చూసిన చెర్రి  

Meghasandesam serial today episode December 17th: బంగారు ఉంగరం కోసం భూమి, గగన్‌ పోటీ పడతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode:  భూమి, గగన్‌లను శరత్చంద్ర, అపూర్వ, కేపీ, నక్షత్ర ఎత్తుకోవడంతో ఒకరినొకరు దండలు మార్చుకుంటారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటుంటారు. ఇంతలో వాళ్లను కిందకు దించేస్తారు. అప్పుడే చెర్రి దగ్గరకు వెళ్తాడు.

చెర్రి: వెయిట్‌ వెయిట్‌ అప్పుడే అయిపోలేదు. నెక్ట్స్‌ ఐటమ్‌ వర్షంలో తడసిన ఒక ఫీలింగ్‌.. వసంతోత్సవం..

అని చెప్పగానే.. అందరూ బయటకు వెళ్తారు. అక్కడ పసుపు నీళ్లు కలిపి రెడీగా ఉంటాయి. గగన్‌, భూమి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.

చెర్రి: ఒకే ఒకే ఇక  మీరు చూసుకున్నది చాలులే కానీ కానివ్వండి..

అని చెప్పగానే.. గగన్‌, భూమి తలో చెంబుతో పసుపు నీళ్లు తీసుకుని ఒకరి మీద ఒకరు పోసుకుంటారు. ఆ నీళ్లతో తడిసిపోతూ.. ఎగ్జైట్‌గా ఫీలవుతుంటారు. వాళ్లను చూసిన కేపీ, చెర్రి హ్యాపీగా ఫీలవుతుంటారు. భూమి, గగన్‌ ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ నీళ్లు పోసుకుంటుంటారు. వాళ్లను చూసిన కేపీ ఎమోషనల్‌ అవుతాడు. చెర్రి శారదకు వీడియో కాల్‌ చేసి చూపిస్తాడు. గగన్‌, భూమిలను వీడియో కాల్ లో చూసిన శారద సంతోషపడుతుంది. ఇంతలో బిందు శివకు ఫోన్‌ చేస్తుంది.

 శివ: హలో చెప్పు బిందు..

బిందు: మా మామయ్య పిలిస్తేనే మా అన్నయ్య గగన్‌, భూమి ఇంటికి వచ్చారు శివ.

శివ: తెలుసు బిందు వాళ్లు బయలుదేరేటప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను.

బిందు: ఏదో ఒకటి చెప్పి నువ్వు కూడా వాళ్లతో రావాల్సింది శివ. పెళ్లి తర్వాత జరిగే ఆచారాలు ఎంత బాగుంటాయో నువ్వు కూడా చూసుండేవాడివి.

శివ: అవును వాటితో పాటు నిన్ను కూడా చూసే వాడిని..

బిందు: అవును ఒకరిని ఒకరం చూసుకుంటూ.. రాబోయే కాలంలో మన పెళ్లి అయ్యాక భూమి ప్లేసులో నన్ను.. అన్నయ్య ప్లేస్‌లో నిన్ను ఊహించుకుని మురిసిపోయేవాళ్లం కదా..?

శివ: చాలా దూరం వెళ్లిపోతున్నావు బిందు. ముందు మన చదువులు పూర్తి అవ్వాలి. తర్వాత మన ప్రేమను మీ ఇంట్లో ఒప్పుకోవాలి. ముఖ్యంగా మా భూమి అక్క ఒప్పుకోవాలి. చాలా తతంగమే ఉంటుంది.

బిందు: మా ఇంట్లో ఒప్పుకోవాలి అన్నావు అంత వరకు ఓకే మధ్యలో భూమి అక్క ఒప్పుకోవాలి అంటావేంటి..?

అని బిందు అడగ్గానే.. శివ షాక్‌ అవుతాడు. వెంటనే అంటే ఇప్పుడు భూమి అక్క నాకు సొంత అక్క లాగా కదా అందుకే అలా అన్నాను అంటూ తప్పించుకుంటాడు శివ. మరోవైపు బయటి నుంచి ఇంట్లోకి వెళ్తారు గగన్‌, భూమి. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. ఇద్దరి ముందు బిందె ఉంటుంది.

చెర్రి: ఈ బిందెలో ఉంగురాలు తీసే ఆట ఎందుకు ఆడిస్తారో తెలుసా..? అన్నయ్య..

గగన్‌: ఎందుకు..?  

బిందు: ఈ బంగారపు ఉంగరం ఎవ్వరికి దొరుకుతుందో..? వాళ్లు జీవితాంతం వెండి ఉంగరం దొరికిన వాళ్లను డామినేషన్‌ చేస్తారన్నమాట

అంటూ చెర్రి చెప్పి బిందెలో ఉంగరాలు వేస్తాడు. వాటిని తీసుకోవడానికి గగన్‌, భూమి పోటీ పడుతుంటారు. పక్కనున్న వాళ్లు వాళ్లను కమాన్‌ అంటూ ప్రోత్సహిస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కొబ్బరి బొండాల్లో విషం! పిల్లలకు పట్టేసిన మహా..! అంబిక సక్సెస్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కొబ్బరి బొండాల్లో విషం! పిల్లలకు పట్టేసిన మహా..! అంబిక సక్సెస్!
Godavari Serial Today November 16th: 'గోదావరి' సీరియల్: ఆకర్ష్ ఇచ్చిన చీరలో నందు.. దిష్టి తీసిన మురళీ! జానుకి సారీ చెప్పడానికి సంజయ్‌కి సాయం చేసిన చిట్టి మరదలు!
'గోదావరి' సీరియల్: ఆకర్ష్ ఇచ్చిన చీరలో నందు.. దిష్టి తీసిన మురళీ! జానుకి సారీ చెప్పడానికి సంజయ్‌కి సాయం చేసిన చిట్టి మరదలు!
Nindu Manasulu Serial Today November 16th: నిండు మనసులు: ప్రేరణని సిద్ధూ అర్థం చేసుకోడా? జర్నలిస్ట్‌కి బుద్ధి చెప్పిన సిద్ధూ!
నిండు మనసులు: ప్రేరణని సిద్ధూ అర్థం చేసుకోడా? జర్నలిస్ట్‌కి బుద్ధి చెప్పిన సిద్ధూ!
Brahmamudi Serial Today November 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  ఐశ్వర్య ప్లాన్‌ సక్సెస్‌ - అయోమయంలో పడిపోయిన ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్:  ఐశ్వర్య ప్లాన్‌ సక్సెస్‌ - అయోమయంలో పడిపోయిన ఇందు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget