Meghasandesam Serial Today August 30th: ‘మేఘసందేశం’ సీరియల్: వెంటనే బొమ్మ కొట్టేస్తానన్న రత్నం - అదే బొమ్మ కోసం బయలుదేరిన భూమి
Meghasandesam serial today episode August 30th: గగన్ రూంలో బొమ్మను కొట్టేసి తీసుకొస్తానని రత్నం ఫోన్ చేసి అపూర్వకు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: కేపీ, శారదను ఎత్తుకుని గుడిలోకి వెళ్తున్నప్పుడు సుజాత చూసి అపూర్వకు చెప్తుంది. అపూర్వ వెంటనే శరత్ చంద్రకు చెప్పడంతో శరత్ చంద్ర కోపంగా గన్ తీసుకుని గుడి దగ్గరకు బయలుదేరతాడు. అదంతా విన్న చెర్రి వెంటనే భూమికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. భూమి అకాడమీ నుంచి గుడికి వెళ్తుంది. అలాగే మీరాను తీసుకుని గుడి దగ్గరకు రమ్మని చెప్తుంది. భూమి చెప్పినట్టుగానే శరత్ చంద్ర కన్నా ముందే మీరాను గుడి దగ్గరకు తీసుకెళ్తాడు. మీరా పైకి వెల్లేలోపే కేపీ తలకు గాయంతో కనిపిస్తాడు. మీరా కంగారు పడుతుంది.
మీరా: ఏవండి ఏమైందండి… అయ్యో..
కేపీ: అది చెర్రికీ నక్షత్రకు పెళ్లి జరిగింది కదా వాళ్లిద్దరూ సంతోషంగా ఉండాలని ఇలా మొక్కు తీర్చుకున్నాను.
మీరా: ఏవండి మీకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో నిజంగా మీలాంటి భర్త దొరకడం నాకు ఎతం అదృష్టమో
అంటూ ఏడుస్తుంది. ఇదంతా భూమి, శారదకు చెప్తుంది. దీంతో శారద భయపడుతుంది.
శారద: మేము కలిసి ఒక్కసారి గుడికి వస్తేనే మీ నాన్న ఆలోచించకుండా గన్ పట్టుకుని గుడికి వచ్చేశారు. అదే మేము శాశ్వతంగా కలిస్తే ఊరుకుంటాడా..? మమ్మల్ని ప్రాణాలతో ఉంచుతాడా..? మేము విడిపోయి దూరంగా ఉన్నాము ఎక్కడో ఒకచోట ఆయన ప్రాణాలతో ఉన్నారు. అది చాలు.
భూమి: చాలదు అత్తయ్యా మీరు ఒంటరిగా ఉండకూడదు. సమాజంలో కృష్ణప్రసాద్ గారి భార్యగా మీకు గుర్తింపు రావాలి. ఇన్నాళ్లు మీరు మనసులో పడిన బాధకు ఒక పరిష్కారం కావాలి. అదే మామయ్య మీ దగ్గరకు రావడమే
శారద: కలవని దారులను కలపాలని చూస్తున్నావు అది వృథా ప్రయత్నం
భూమి: లేదు అత్తయ్యా అలా ఎన్నటికీ జరగదు. మిమ్మల్ని కలపడానికి ఆ దైవమే దారి చూపిస్తుంది.
అంటూ చెప్తూ.. ఎమోషనల్ అవుతుంది భూమి. తర్వాత గగన్ ఇంట్లో బొమ్మ కొట్టేయడానికి పనిమనిషిలా చేరిన రత్నం, అపూర్వకు ఫోన్ చేసి ఆ ఇంట్లో బొమ్మ లేదని చెప్తుంది.
అపూర్వ: అలా అనకే రత్నం కచ్చితంగా బొమ్మ ఆ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు సరిగ్గా వెతుకు
అని చెప్పగానే సరే వెతుకుతాను అని చెప్తుంది. తర్వాత గగన్ కోసం పాలు తీసుకుని వెళ్లిన రత్నానికి గగన్ రూంలో బొమ్మ కనిపిస్తుంది. దీంతో రత్నం షాక్ అవుతుంది. వెంటనే అపూర్వకు ఫోన్ చేస్తుంది.
అపూర్వ: చెప్పవే రత్నం బొమ్మ దొరికిందా..?
రత్నం: దొరకలేదు కానీ బొమ్మ ఇక్కడే ఉంది. ఇక్కడే గగన్ రూంలోనే ఉంది. టైం చూసి కొట్టేసుకుని వస్తాను
అపూర్వ: త్వరగా తీసుకురావే.. ఈ అపూర్వ చేతికి ఆ బొమ్మ దొరకాలి.. ఆ తర్వాత ఆడిస్తాను ఆట
అనుకుంటూ కాల్ కట్ చేస్తుంది. మరోవైపు భూమి డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి ఎస్సై మర్డర్ కేసు విషయం గురించి అడుగుతుంది. ఆ రోజు స్టేషన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని డీఎస్పీతో కలిసి స్టేషన్ కు వెళ్తుంది. అక్కడి సీసీ టీవీ పుటేజీ చెక్ చేస్తుంది. అందులో శిశ చేతుల్లో ఉన్న బొమ్మను ఎస్సై తీసుకోవడం ఆ బొమ్మలో ఉన్న కెమెరాను చూసి ఓపెన్ చేయడం అందులో వస్తున్న వీడియో చూస్తూ ఎస్సై షాక్ అవ్వడం అంతా ఓకేసారి జరిగిపోతాయి. దీంతో ఆ బొమ్మలో ఏదో ఉంది అది చూసే ఎస్సై గారు నిర్దారించుకుంటారు. ఇప్పుడా బొమ్మ గగన్ బావ ఇంట్లో ఉది. ఎలాగైనా సరే ఆ బొమ్మను తీసుకోవాలి అనుకుని గగన్ ఇంటికి బయలుదేరుతుంది భూమి. మరోవైపు రత్నం బొమ్మ కొట్టేసి తీసుకొస్తుందని అపూర్వ ఎదురుచూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















