Meghasandesam Serial Today August 29th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని తిట్టిన గగన్ - వీడియో చూసి షాకైన భూమి
Meghasandesam serial today episode August 29th: అకాడమీకి వచ్చిన నక్షత్ర తాను తీసిన భూమి వీడియో గగన్‌కు చూపించి భూమిని తిట్టిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: భూమి ఫోన్ చేయడంతో శారద అకాడమీ నుంచి వెళ్లిపోతుంది. బయటకు వెళ్లిన శారదను ఒప్పించి కేపీతో పంపిస్తుంది భూమి. ఇద్దరూ కలిసి స్కూటర్ మీద గుడికి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక భూమి లోపలికి వస్తుంది. లోపల అకాడమీలో ఉన్న పిల్లలను గగన్ పిలుస్తాడు. పిల్లలందరూ ఏంటన్నయ్యా అనుకుంటూ గగన్ దగ్గరకు వస్తారు.
గగన్: పిల్లలు అమ్మ బర్తుడే సందర్భంగా మనం అన్ని తిన్నాం. కానీ స్వీట్లు మిగిలిపోయాయి. కానీ మీకు ఇవన్నీ సరిపోతాయి. కానీ ఒక కాంపిటీషన్ దీంట్లో డిఫరెంట్ స్వీట్లు ఉన్నాయి. మీ అందరూ వరుసగా కళ్లు మూసుకుని లైన్ లో నిల్చుంటే మీకు ఒక్కోక్క స్వీట్ నోట్లో పెడతాను. అప్పుడు మీరు టేస్ట్ చూసి ఆ స్వీట్ పేరు మీరు నాకు చెప్పాలి. కాంపిటీషన్‌కు రెడీనా..?
పిల్లలు: ఓకే అన్నయ్యా.. మేము రెడీ..
గగన్: రెడీనా… వినిపచడం లేదు..
పిల్లలు: మేము రెడీ అన్నయ్యా.. ( అని గట్టిగా అరుస్తారు)
గగన్: ఓకే అందరూ లైన్ నిలవండి..
అనగానే పిల్లుల కళ్లు మూసుకుని లైన్‌గా వస్తుంటారు. గగన్ ఒక్కోక్కరికి ఒక స్వీటు పెడుతూ స్వీటు పేరు అడుగుతాడు. కరెక్టు చెప్పగానే వెరీ గుడ్ అంటూ మెచ్చుకుంటూ పంపిస్తాడు. అంతా దూరం నుంచి గమనించిన భూమి కూడా దగ్గరకు వచ్చి లైన్‌లో నిలబడుతుంది. భూమి దగ్గరకు వెళ్లి కళ్లు మూసుకుని నోరు తెరవగానే.. గగన్ చూసి మెల్లగా అక్కడే ఉన్న పచ్చిమిరపకాయ తీసి భూమి నోట్లో పెడతాడు. పచ్చి మిరపకాయ నమిలిన భూమి కారంతో ఆరుస్తూ..
భూమి: స్వీటు పెట్టమంటే ఇలా పచ్చి మిరపకాయ పెడతావా..?
గగన్: ఆ స్వీట్లు అనేవి పిల్లలకు పెడతారు. పిశాచాలకు పెట్టరు..
అంటూ కోపంగా గగన్ ఆఫీసు చాంబర్‌లోకి వెళ్తాడు. పక్కనే ఉన్న వాటర్ తాగి నోటిలో కారం పోగోటుకుంటుంది భూమి. తర్వాత
గగన్ ఆఫీసులో ఆలోచిస్తూ కూర్చుని ఉంటే భూమి వెళ్తుంది.
భూమి: నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు బావ
గగన్: పరాయి మనుషుల గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను.
భూమి: అంటే నేను నీకు ఏమీ కానా..? మన మధ్య ఏ బంధం లేదా..?
గగన్: ఈ డాన్స్ అకాడమీలో పార్టనర్ షిప్ అనే రిలేషన్ ఉంది. అంతే..
భూమి: నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంతేనా..?
గగన్: తెలుసు.. బాగా తెలుసు.. ఇష్టపడ్డ మనిషిని మర్చిపోవడం.. మీ నాన్న తెచ్చిన వ్యక్తితో పెళ్లికి సిద్దం అవడం ఇవన్నీ తెలుసు.
అంటూ భూమి ఇంట్లో అపూర్వ మీద ఒట్టేసి తాను గగన్‌ను ప్రేమించడం లేదు అని చెప్పిన వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి భూమి మౌనంగా ఉంటుంది.
గగన్: ఇప్పుడేం అంటావు భూమి.. దీనికి నీ సమాధానం ఏంటి..? నన్ను ప్రేమిస్తున్నట్టు నటించావు. పోయి పోయి నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది.
అంటూ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూమి ఏడుస్తూ ఉంటుంది. అక్కడే పక్క నుంచి అంతా చూసిన నక్షత్ర మాత్రం నవ్వుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















