Meghasandesam Serial Today August 23rd: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ముందే భూమిని కిస్ చేసిన ఉదయ్ - పర్సనల్ ఇంట్లో పెట్టుకోండని వార్నింగ్ ఇచ్చిన గగన్
Meghasandesam serial today episode August 23rd: ఆఫీసు చాంబర్‌లో భూమిని కిస్ చేస్తాడు ఉదయ్. అప్పుడే చాంబర్‌లోకి వచ్చిన గగన్ చూడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: అకాడమీలో భూమి పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ గగన్‌ను చూస్తుంటుంది. గగన్ కూడా ఓరచూపుతో భూమిని చూస్తుంటాడు. ఇంతలో అక్కడకు ఉదయ్ వస్తాడు. భూమికి గుడ్ మార్నింగ్ చెప్తాడు. కొద్దిసేపు వెయిట్ చేయండి అంటే ఉదయ్ వినడు. దీంతో పిల్లలను ప్రాక్టీస్ చేయమని చెప్పి భూమి ఉదయ్ దగ్గరకు వస్తుంది.
ఉదయ్: గగన్ నిన్ను దొంగచూపులు చూస్తున్నాడు తెలుసా..?
భూమి: తెలుసు..
ఉదయ్: నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం అయినట్టు లేదు. గగన్ నిన్ను ఇంకా ప్రేమిస్తున్నట్టు ఉన్నాడు.
భూమి: నిజమా..?
అంటూ వాటర్ తాగుతుంది. ఉదయ్ కోపంగా చూస్తుంటాడు. తర్వాత భూమి రూంలోకి వెళ్లిన నక్షత్ర కోపంగా భూమిని తిడుతుంది.
నక్షత్ర: చెర్రి గాడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసినా వాడితో పెళ్లి తప్పించుకున్నావు. నీ జానతనం అంతా చూపించి ఈ తాళి చూపించి ఈ తాళి నా మెడలో పడేలా చేశావు. ఒక్క జాన తనమే కాదులో ఇంకా ఏదో మాయ చేసి ఉంటావు.
అనగానే భూమి కోపంగా నక్షత్రను కొడుతుంది.
నక్షత్ర: ఏంటి మాటకు మాట కరువై చెయ్యే సమాధానం అయిందా..?
భూమి: కాదు నువ్వు అంటున్న మాటలకు మనసు బరువెక్కి చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది. తోడబుట్టిన దానివి కనుక చేయి చేసుకున్నాను. ఇంకో దాన్ని అయితే చంపేసేదాన్ని. జానతనాలు నెరజానతనాలు నాకు తెలియదు. అవి ఎలా ఉంటాయో మీ అమ్మను అడుగు తనే చెప్తుంది.
నక్షత్ర: చేసిన వాళ్లు ఎప్పటికీ నేరం నెత్తిన వేసుకోరు. నీ మాటలు అలాగే ఉన్నాయి. నువ్వు రానంత వరకు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. నువ్వు వచ్చాకే గోల గొడవ అశాంతి అన్ని పెరిగిపోయాయి.
భూమి: చూడు ఇష్టం లేని పెళ్లి జరిగింది కదా అని నా మీద నిందలు వేయకు.. ఆ రోజు చెర్రి నీ మెడలో తాళి కడతాడని తెలసి ఉంటే.. అసలు ఆ పెళ్లి పీటల మీద కూర్చునే దాన్నే కాదు. ఎక్కడికో పారిపోయేదాన్ని. మళ్లీ నా వ్యక్తిత్వాన్ని కించపరిచావో చంపేస్తాను
అంటూ భూమి వార్నింగ్ ఇవ్వడంతో నక్షత్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత అకాడమీకి వెల్లిపోతుంది భూమి. అకాడమీకి వచ్చిన గగన్ మీ టీచర్ ఎక్కడ అని అడుగుతాడు అక్కడి పిల్లలను. వాళ్లు ఉదయ్ సార్‌తో మాట్లాడటానికి రూంలోకి వెళ్లారు అని చెప్తారు. దీంతో గగన్ చాంబర్‌లోకి వెళ్తుంటాడు. అక్కడికి వెళ్లిన భూమి ఉదయ్‌తో మాట్లాడుతుంది.
భూమి: చెప్పండి ఉదయ్ గారు ఏదో పర్సనల్ గా మాట్లాడాలి అన్నారంట.
అని అడగ్గానే.. ఉదయ్‌కు అపూర్వ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.
అపూర్వ: భూమి ఆ గగన్‌ను మర్చిపోయేలా.. నిన్ను ప్రేమించేలా..? నువ్వే చేసుకోవాలి.
అంటూ చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటాడు ఉదయ్. బయటకు చూస్తే గగన్ రూంలోకి వస్తుంటాడు. వెంటనే టేబుల్ మీద ఉన్న పేపర్స్ కిందపడేలా చేస్తాడు. దీంతో భూమి, ఉదయ్ ఇద్దరూ కలసి టేబుల్ కిందకు కూర్చుని పేపర్స్ తీస్తుంటారు. అప్పుడే గగన్ రూం డోర్ ఓపెన్ చేస్తాడు. వెంటనే ఉదయ్ పైకి లేచి పెదవి తుడచుకుంటాడు. గగన్ చూడగానే భూమి తనకు లిఫ్ కిస్ ఇచ్చిందని అనుకునేలా చేస్తాడు. గగన్ చూసి బయటకు వెళ్లబోతుంటే..ఉదయ్ దగ్గరకు వెళ్తాడు.
ఉదయ్: మానర్స్ ఉండాలి కదా గగన్.. లోపలికి వచ్చే ముందు తలుపు తట్టి రావాలని తెలియదా..?
అంటూ ఉదయ్ వెళ్లిపోతాడు. అప్పుడే పేపర్స్ అన్ని తీసుకుని భూమి పైకి లేస్తుంది.
గగన్: పర్సనల్స్ ఏమైనా ఉంటే ఇంటి దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాలి అని చెప్పి గగన్ వెళ్ళిపోతాడు.
గగన్ మాటలు అర్థం కాక భూమి ప్రశ్నార్థకంగా చూస్తుంటుంది. ఇప్పుడు తానేం చేశానని గగన్ ఆ పర్సనల్ అంటున్నారు అనుకున్నట్టుగా చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















