Meghasandesam Serial Today August 21st: ‘మేఘసందేశం’ సీరియల్: అవమానం భరించలేక సూసైడ్ చేసుకోబోయిన అపూర్వ – అపూర్వను అడ్డుకున్న శరత్ చంద్ర
Meghasandesam serial today episode August 21st: గగన్ అవమానించి వెళ్లడంతో అపూర్వ రూంలోకి వెళ్లి సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన గగన్‌ను కాల్చేయాలని చూస్తాడు శరత్ చంద్ర. అయన చేతిలో గన్ లాక్కున్ని శరత్ చంద్రను స్థంభానికి కట్టేసి అపూర్వను ఎయిమ్ చేస్తాడు గగన్.
కేపీ: గగన్ నీకేమైనా పిచ్చి పట్టిందా..? ఏం చేస్తున్నావు..?
గగన్: నువ్వు చెప్తున్నావా..? మిస్టర్ కృష్ణ ప్రసాద్ ఆరోజు మా అమ్మకు జరిగిన అవమానాన్ని కళ్లు అప్పగించి చూసిన నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు.. ఈరోజు వీళ్లను చంపేస్తాను.
చెర్రి: అన్నయ్యా ఏంటి ఇది అర్థం లేని ఆవేశం
గగన్: నన్ను ఆపకు చెర్రి..నా ఆవేశానికి అర్థం చేకూరాలంటే ఈరోజు మీ అత్తయ్య మామయ్య చచ్చిపోవాల్సిందే..?
చెర్రి: అన్నయ్యా ఫ్లీజ్ అన్నయ్యా.. ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా నీకు.. వాళ్లను చంపేస్తావన్న భయంతో నేను నిన్ను అడ్డుకోవడం లేదు అన్నయ్య.. చంపేశాక జీవితాంతం నువ్వు జైళ్లో ఉండిపోతే అప్పుడు నీ జీవితానికి అర్థం ఉండదు అన్నయ్య.
శరత్: కాల్చరా.. కాల్చి అడుగు బయట ఎలా పెడతావో నేను చూస్తాను..
చెర్రి: మామయ్య ఏంటి మామయ్య ఇది నువ్వు ఆగు అన్నయ్య.. నేను గొడవను ఆపాలని చూస్తున్నాను.. మీరు రాజేయకండి. ఇంకా అన్నయ్యలో మనిషి మిగిలి ఉన్నాడు కనకే అత్తయ్య ప్రాణం పోలేదు. తనలోని రాక్షసుణ్ని నిద్ర లేపకండి మామయ్య మీరు చచ్చిపోతారు. అన్నయ్య ఆరోజు పెద్దమ్మకు అవమానం జరిగిన రోజు నేను ఉన్నాను. పెద్దమ్మకు అంత అన్యాయం జరుగుతున్నా కూడా నేను చూస్తూ ఉండిపోయాను. ఏమీ చేయలేకపోయాను. అంటే దీంట్లో నా తప్పు కూడా ఉంది కదా నన్ను కూడా చంపాలి కదా..? నన్ను కాల్చు..
గగన్: రేయ్ మీ అత్తయ్య మామయ్యలను బతికించుకోవడం కోసం నువ్వు కూడా సమిధిలా మారిపోకు.. జరుగు.. ఈ దుర్మార్గులను చంపి నా జీవితాన్ని ఓ అర్థం లేని ఆధ్యాయంలా మార్చుకోవద్దని నువ్వు చెప్పిన ఒకే ఒకమాట. నన్ను ఇప్పుడు ఆలోచనలో పడేసింది.
అంటూ గగన్ శారద, పూరిలను అక్కడికి పిలిస్తాడు. అపూర్వను తన బోట్టు తానే తుడుచుకోమ్మని, గాజులు పగులగొట్టుకోమని చెప్తాడు. భయంలో అపూర్వ, గగన్ చెప్పినట్టుచేస్తుంది. తర్వాత శారద కాళ్ల మీద పడి క్షమాపణ అడగమంటాడు. అపూర్వ భయంతో శారద కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతుంది. ఇక గగన్ అవమానించి వెళ్లడంతో అపూర్వ రూంలో కూర్చుని ఏడుస్తుంది. పదే పదే తాను శారద కాళ్లు పట్టుకుని తనను క్షమించు అన్న విషయం గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇంతలో శరత్ చంద్ర రూంలోకి వెళ్తాడు.
శరత్: ఊరుకో అపూర్వ..
అపూర్వ: ఎలా ఊరుకోమంటావు బావ. ఈరోజు నేను శిక్ష అనుభవించాను బావ..
శరత్: సారీ అపూర్వ ఐయామ్ సారీ..
అపూర్వ: నువ్వు చెప్తున్న సారీతో నేను ఏం చేసుకోవాలి బావ. గగన్ గాడిని చంపినప్పుడే నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీరినట్టు.. చంపేయ్ బావ ఆ గగన్ గాడిని..
శరత్: వాణ్ని చంపేస్తే ఎలా అపూర్వ ఇప్పుడు మనం ఎలా క్రుంగి కృషిస్తున్నామో..? వాడు కూడా అలాగే కృంగి పోవాలి. ఆ పెళ్లి అయిపోని అపూర్వ వాడు కచ్చితంగా అవమానంతో కుంగిపోతాడు. నేలకు ఒరిగే చెట్టులాగా అప్పుడు మనం వాడిని నరుకుదాం.
అంటూ శరత్ చంద్ర కోపంతో చెప్తుంటే.. అపూర్వ శాంతిస్తుంది. అంతా బయటి నుంచి గమనిస్తున్న భూమి మాత్రం ఏడుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















