అన్వేషించండి

Krishna mukunda Murari Serial Today January 29th: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్‌ : ముకుందను పూర్తిగా నమ్మిన ఆదర్శ్ - కృష్ణ పిచ్చిది అనుకున్న భవాని

Krishna mukunda Murari Today Episode: ముకుంద గురించి భవాని ఆలోచిస్తుంది. కృష్ణ పిచ్చిదని ముంకుందను నమ్మటం మంచిది కాదేమోననుకుంటుంద భవాని దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.

Krishna mukunda Murari  Serial Today Episode: భవానీ.. ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన ప్రవర్తన చూస్తుంటే.. అసలు నమ్మకం కలగడం లేదు. తన అన్న చేసిన పనులు తనకి తెలియకుండా ఉంటాయా? ముకుంద సపోర్ట్ లేకుండా తన అన్న అంతకి తెగిస్తాడా? అప్పుడే ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకున్నా కానీ ఈ కృష్ణ అడ్డుపడింది. ఈ కృష్ణ తన అతి మంచితనంతో తన గురించి ఆలోచించడం మానేసింది. తను మారిపోయిందని గుడ్డిగా నమ్మి ఆదర్శ్ ని తీసుకొచ్చింది. అసలు ఏం చెప్పి ఆదర్శ్ ని తీసుకొచ్చింది. ఒక పక్క బిడ్డ వచ్చాడని సంతోషంగా ఉన్న మరోపక్క ఎక్కడ తన మనసు చంపేస్తుందోనని భయంగా ఉంది. అసలు ముకుంద మనసులో ఏముందో క్లియర్ గా తెలియడం లేదని ఆలోచిస్తూ ఉండగా రేవతి వచ్చి...

రేవతి: అక్కా వేరే పంతుల్ని పిలిపిద్దామా?  ఫోన్లో రెండు మూడు రోజుల్లో ముహూర్తాలు ఉన్నాయన్న పంతులు ఇప్పుడు పది రోజుల వరకు లేవని అంటున్నారు. సరిగా చూశారో లేదో వేరే పంతుల్ని పిలిచి అడుగుదామనిపిస్తుంది.

భవాని: ఎందుకంత తొందర రేవతి. అయినా పది రోజులే కదా ఇన్నాళ్ళూ ఆగిన వాళ్ళం పది రోజులు ఆగలేమా?

రేవతి: అంటే ఆగుతాము కానీ నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. ఆదర్శ్ వచ్చినప్పుడు మీ మొహంలో సంతోషం చూశాను. కానీ పంతులు ఎప్పుడైతే ముహూర్తాలు లేవని చెప్పాడో అప్పుడు మీ మొహంలో సంతోషం తగ్గింది అది నేను గమనించాను అక్కా.

 అని రేవతి అనగానే పంతులికి ముహూర్తాలు లేవని చెప్పమని చెప్పింది నేనే. అది నా సంతోషాన్ని ప్రభావితం చేస్తుంది. ఆదర్శ్ ని తీసుకొస్తానని అంటే ముకుంద ఎందుకు ఒప్పుకుందో తెలియదు. తన మనసులో ఏముందో తెలియదు. అవన్నీ బయట పడాలంటే కొంచెం టైమ్ అవసరమని భవానీ మనసులో అనుకుంటుంది.

రేవతి: ముకుంద మారిపోయింది ఆదర్శ్ తిరిగి వచ్చాడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే కృష్ణ వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారక్కా

కృష్ణ, మురారి ఆదర్శ్ ని తీసుకురావడం కరెక్టే అంటావా అని భవానీ, రేవతిని అడుగుతుంది.  దీంతో ముకుంద మారినట్టు అక్క నమ్మడం లేదని మళ్ళీ ఏం జరుగుతుందోనని అక్క భయపడుతున్నట్టు ఉందని రేవతి మనసులో అనుకుంటుంది.

భవాని: నిజంగా నాకు భయమేస్తుంది రేవతి. పొరపాటున ముకుంద ఆదర్శ్ ని అంగీకరించకపోతే నా బిడ్డ ఏమైపోతాడా అని భయంగా ఉంది.

అంటూ రేవతితో అంటుంది  భవానీ ఏవేవో భయాలు చెప్తుంది. దీంతో రేవతి ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు ఆదర్శ్ ఒంటరిగా ఉండటం చూసి మధు అసలు ముకుంద బ్రోని అంగీకరించిందా? ఇందాక బ్రో కూడా ముకుంద మాట చెప్పాడు కదా ఇప్పుడు తనతో ఎలాగైనా నిజం చెప్పించాలి. మందు వేస్తే ఎలాగైనా నిజం బయటకి వచ్చేస్తుందని మధు ప్లాన్ చేస్తాడు. మందు బాటిల్ తీసుకొచ్చి సిట్టింగ్ వేద్దామని ఆదర్శ్ ని బలవంతంగా తీసుకుని వెళతాడు. సుమలత వచ్చి పొద్దున్నే మందు తాగుతావా అని నాలుగు తగిలిస్తుంది.

ముకుంద నన్ను మర్చిపోయి ఆదర్శ్ ని అంగీకరించింది. ఆదర్శ్ చాలా హ్యాపీగా ఉన్నాడు అందుకే కలిసి మందు తాగుదాం రమ్మని పిలిచాడు. దీనికి కారణం కృష్ణ తన సంతోషం కంటే వాళ్ళ సంతోషం కోసం ఆరాటపడింది ఇక తను ఏం చెప్తే అదే చేస్తానని మనసులో అనుకుంటాడు. మురారి తిక్కతిక్కగా మాట్లాడుతుంటే ఆదర్శ్ మందుకి పిలిచాడు కదా అని కృష్ణ అనేసరికి మురారి బిత్తరపోతాడు.

అమ్మో ఇది తింగరిది కాదు మహా తెలివైనదని అనుకుంటాడు. మనసులో విషయం కనిపెట్టేశావ్ కదా ప్లీజ్ వెళ్లనివ్వమని బతిమలాడుకుంటాడు. సరేనని ఎక్కువ  తాగొద్దని చెప్తుంది. సంతోషంగా కృష్ణకి ముద్దు పెట్టేసి వెళతాడు. మురారి, ఆదర్శ్ కూర్చుని మందు కొడుతూ ఉంటారు. మధు వచ్చి ఇక్కడ సిట్టింగ్ వేసిన విషయం కృష్ణకి తెలుసా అని అడుగుతాడు. తెలిస్తే ఏమవుతుందని మురారి అంటాడు. మురారిని పంపించి ఆదర్శ్ ని తొండ గురించి అడగాలని మధు అనుకుంటాడు. ప్రసాద్ కూడా వచ్చి సిట్టింగ్ లో కూర్చుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: హీరోయిన్‌ని పెళ్లాడిన టాలీవుడ్‌ విలన్‌ - ఫొటోలు వైరల్‌

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget