Govind Padmasoorya Wedding: హీరోయిన్‌ని పెళ్లాడిన టాలీవుడ్ విలన్ - ఫొటోలు వైరల్
Actor Govind Padmasoorya: టాలీవుడ్ ప్రముఖ విలన్ తాజాగా పెళ్లి పీటలు ఎక్కాడు. ఆదివారం ఉదయం బుల్లితెర హీరోయిన్‌తో ఏడడుగులు వేశాడు.
Actor Govind Padmasoorya Wedding: టాలీవుడ్ ప్రముఖ విలన్ తాజాగా పెళ్లి పీటలు ఎక్కాడు. ఆదివారం ఉదయం బుల్లితెర హీరోయిన్‌తో ఏడడుగులు వేశాడు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ కొత్త జంటకు తోటి నటీనటులు, ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకి ఆ విలన్ ఎవరూ.. నటి ఎవరో చూద్దాం. అల్లు అర్జున్ - త్రివిక్రమ్‌ల బ్లాక్‌బస్టర్ హిట్ 'అల వైకుంఠపురంలో' సినిమాలో విలన్‌గా నటించి తెలుగు వారికి దగ్గరయ్యాడు నటుడు గోవింద్ పద్మసూర్య. నిజానికి అతడు మలయాళీ హీరో.
గుడిలో నటితో పెళ్లి
తెలుగులో పలు చిత్రాల్లో విలన్‌గా నటించి మంచి గుర్తింపు పొందాడు. మరోవైపు మలయాళీ చిత్రాల్లో హీరోగా నటించిన అతడు అదే ఇండస్ట్రీకి చెందిన సీరియల్ నటి గోపిక అనిల్‌ను తాజాగా పెళ్లాడాడు. వీరిది పెద్దలు కుదర్చిన పెళ్లి. జనవరి 28న కేరళలోని వడక్కునాథన్ ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను గోవింద్ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. దీంతో అతడి పెళ్లి ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ప్రముఖులుకు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
View this post on Instagram
Also Read: భార్య బిగ్‌బాస్ హౌజ్‌లో - ఇంట్లో అమ్మాయిలతో భర్త పార్టీ - అంకిత లోఖండే రియాక్షన్
కాగా గోవింద్ సూర్య మాలయాళీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు పొందాడు. డాడి కూల్, ఐజీ, కాలేజీ డేస్, 72 మోడల్, ప్రేతమ్, ప్రేతమ్ 2, వంటి చిత్రాల్లో కథానాయకుడిగా చేశాడు. సొంత ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్న అతడు తెలుగులో అల వైకుంఠపురంలో చిత్రంలో విలన్‌గా పరిచయం అయ్యాడు. విలన్‌గా మంచి మార్కులు కొట్టేసిన గోవింద్ సూర్య బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్‌లోనూ నటించాడు. రీసెంట్‌గా 'మిస్టర్ క్యూట్' సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం మళయాళంలో పలు టీవీ షోలకు హోస్టింగ్ చేస్తున్నాడు పద్మ సూర్య. మరోవైపు గోపిక అనిల్ పలు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ పోషిస్తుంది. ఈ క్రమంలో గతేడాది వీరిద్దరికి పెళ్లి కుదర్చగా అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగింది. తాజాగా నేడు కేరళలోని గుడిలో వివాహం జరిగింది.
View this post on Instagram