అన్వేషించండి

Bigg Boss 17: భార్య బిగ్‌బాస్‌ హౌజ్‌లో - ఇంట్లో అమ్మాయిలతో భర్త పార్టీ - అంకిత లోఖండే రియాక్షన్‌  

Ankita Lokhande: బిగ్‌బాస్‌ అనుమతి తీసుకుని డైరెక్టర్ రోహిత్ శెట్టి అంకితకు షాకింగ్ ట్విస్ట్‌ ఇచ్చాడు. 'ఎలిమినేట్‌ అయ్యాక నీ భర్త ముగ్గురు అమ్మాయిలతో పార్టీ చేసుకున్నాడు అని అసలు విషయం చెప్పాడు.

Bigg Boss 17: హిందీ బిగ్‌బాస్‌ 17 సిజన్‌కు ఈ రోజుతో ఎండ్‌ కార్డ్‌ పడనుంది. జనవరి 28న సాయంత్రం గ్రాండ్‌ ఫినాలే జరపుకోనుంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్‌ మరింత పాపులర్‌ అయ్యింది. దానికి కారణం ఈసారి వచ్చిన కపుల్‌ కంటెస్టెంట్స్‌ అంకిత లోఖండే, వికాస్‌ జైన్‌. బిగ్‌బాస్‌ ముందు వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట హౌజ్‌లో అడుగుపెట్టాకా దానికి భిన్నంగా కనిపించారు. మొదటి నుంచి వారి మధ్య గొడవలు, వాదనలు, అపార్థాలే కనిపించాయి. అది చూసి ఆడియన్స్, ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అయ్యారు. హౌజ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అంకిత, విక్కీ మధ్య గొడవలు తప్ప ప్రేమ, అప్యాయత కనిపించలేదు. ఎప్పుడూ కొట్టుకూనే కనిపించిన వారి గొడవలోకి కుటుంబ సభ్యులు కూడా కల్పించుకున్నారు.

 హౌజ్‌లోకి డైరెక్టర్ ఎంట్రీ

ఈ క్రమంలో విక్కీ తల్లి, అంకిత తల్లి మాట్లాడుకున్న మాటలు వైరల్‌గా మారాయి. నా కొడుకుకు ఎంతో ఆస్తి ఉంది.. కానీ ఫేం కోసమే అంకితను పెళ్లి చేసుకున్నాడని చెప్పడం సంచలనం అయ్యాయి. దీంతో వారి కుటుంబంలోని మనస్పర్థలు బట్టబయలయ్యాయి. అయితే ఎంత గొడవ పడ్డ దాన్ని ఓ కామెడీగానే చిత్రీకరించేవాడు విక్కీ.. మరోవైపు భర్తను తిడుతూనే.. అతడే నా రియల్‌ హీరో అంటూ ఉంటుంది అంకిత. ఇక ఫినాలేకు కొద్ది రోజులు ఉందనగా మిడ్‌వీక్‌ ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌లో విక్కీ హౌజ్‌ నుంచి బయటకు రాగా.. అంకిత ఫైనల్‌కు చేరుకుంది. నేడు ఫినాలే సందర్భంగా నిన్న శనివారం ఎపిసోడ్లో డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్‌ కంటెస్టెంట్స్‌కి శుభాకాంక్షలు చెప్పాడు. అనంతరం వారితో సరదగా కాసేపు ముచ్చటించి .. కంటెస్టెంట్స్‌ పాజిటివ్‌, నెగిటివ్స్‌పై చర్చించాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Purva Rana (@purva_rana)

అయినా అతడే నా హీరో

ఈ సందర్భంగా అంకితతో మాట్లాడిన రోహిత్‌ ఆమె భర్త గురించి ఓ షాకింగ్‌ విషయం చెప్పాడు‌. విక్కీ నిన్ను పట్టించుకోవడం లేదని.. నువ్వు బాధపడుతున్న లెక్క చేయడం లేదని ఫీలయ్యావు కదా.. అసలు విక్కీ లేకపోతే నీ ఆట ఎలా ఉండేది? అని ప్రశ్నించాడు. అందుకు అంకిత.. తను లేకపోతే ఇంకా బాగా ఆడేదాన్ని అని , సరైన నిర్ణయాలు తీసుకునేదాన్ని అని సమాధానం ఇచ్చింది. దానికి వెంటనే రోహిత్‌.. ఎలిమినేట్‌ అయ్యాక విక్కీ కూడా అదే చెప్పాడని అంటాడు. ఆ తర్వాత అంకిత మాట్లాడుతూ.. నేనేమి అతడి ఆటకు అడ్డుపడలేదు కదా.. నా జర్నీ కూడా చూశాను.. విక్కీ నేను చాలాసార్తు గొడపడ్డాం.. అయినా సరే అతడుఎప్పటికీ నా హీరోనే అని చెప్పింది.

'ఇంట్లో ముగ్గురు అమ్మాయిలతో నీ భర్త పార్టీ'

అది విన్న రోహిత్‌ శెట్టి అంకితకు అసలు విషయం చెప్పి తనని టెస్ట్‌ చేయాలని చూశాడు. దానికి బిగ్‌బాస్‌ అనుమతి తీసుకుని రోహిత్ శెట్టి ఆమెకు ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. 'ఎలిమినేట్‌ అయ్యాక విక్కీ బయట అమ్మాయిలతో పార్టీ చేసుకున్నాడు. వెళ్లిపోయిన ఈ మూడు రోజుల్లోనే రెండుసార్లు పార్టీ చేసుకున్నాడు. ఓ పార్టీలో సనా, అయేషా, ఈషాతో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. ఆమె ఎవరో నాకు తెలీదు. కానీ, ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు మూడోసారి పార్టీ చేసుకుంటున్నాడు. అదీ కూడా మీ ఇంట్లోనే' అని చెప్పాడు. దీనికి అంకిత నవ్వుతూనే 'బయటకు వచ్చాక విక్కీ గట్టిగానే దెబ్బలు పడతాయి' అని సమాధానం ఇచ్చింది. కాగా విక్కీ పార్టీలో ఉన్న సనా అయేషా మరెవరో కాదు బిగ్‌బాస్‌ 17 సీజన్‌ కంటెస్టెంట్సే. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jai shree krishna ♥️🙌 (@heenaxdits)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
Hyderabad News: ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
Mithun Reddy in AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్Tim David 50* vs PBKS IPL 2025 | పీకల్లోతు కష్టాల్లో నుంచి RCB ని బయటపడేసిన టిమ్ డేవిడ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
Hyderabad News: ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
ఆమెతో మాట్లడాలంటే భయపడేవాళ్లం.. ఆరోజు పిల్లలను చంపేందుకే స్కూల్ మాన్పించింది- ABP దేశంతో పనిమనిషి
Mithun Reddy in AP Liquor Scam: లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
ఏపీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
Trisha Krishnan: 'పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంటి?' - నటి త్రిష ఏం చెప్పారో తెలుసా?
'పెళ్లిపై మీ ఒపీనియన్ ఏంటి?' - నటి త్రిష ఏం చెప్పారో తెలుసా?
Urvashi Rautela: తనకు గుడి కట్టాలన్న నటి ఊర్వశీ రౌతేలా - ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన టీం.. ఏం చెప్పారంటే?
తనకు గుడి కట్టాలన్న నటి ఊర్వశీ రౌతేలా - ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన టీం.. ఏం చెప్పారంటే?
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Embed widget