News
News
X

Karthika Deepam Serial ఆగస్టు 20 ఎపిసోడ్: డాక్టర్ బాబు-దీప ఎవరంటూ షాక్ ఇచ్చిన కార్తీక్, ఇప్పుడు వంటలక్క ఏం చేయబోతోంది!

Karthika Deepam August 20 Episode 1436: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మరో మలుపు తిరుగుతోంది. కారు ప్రమాదంలో చనిపోయారు అనుకున్న వంటలక్క, డాక్టర్ బాబు బతికే ఉన్నారు...

FOLLOW US: 

కార్తీకదీపం ఆగస్టు 20 శనివారం ఎపిసోడ్ (Karthika Deepam August 20 Episode 1436)

సౌందర్య కుటుంబం అమెరికా చేరుకుంటారు. హిమ మాత్రం ఇక్కడ నచ్చలేదు తిరిగి ఇండియా వెళ్లిపోదాం అని గొడవ మొదలెడుతుంది. అక్కడ శౌర్య ఉంటుంది అందుకే ఇండియా ఇష్టం అని హిమ అనడంతో..అక్కడ శౌర్యని వెతికేందుకు మనుషులను పెట్టాను దొరుకుతుందిలే అంటుంది సౌందర్య. 
హిమ: వాళ్ళకు దొరకకపోతే, తాను తానుగానే మన దగ్గరికి రావాలనుకుని మనం అక్కడ లేమని తెలిసి బాధపడి తిరిగి వెనక్కి వెళ్ళిపోతే?. అప్పుడు ఎలాగ నానమ్మ అందుకే మనం ఇండియాలోనే ఉందాం
సౌందర్య: ఆ ఇల్లు అచ్చిరాలేదు..
హిమ: ఇల్లు నచ్చకపోతే ఇల్లు వదిలేస్తే చాలు..దేశాన్నే విడిచి రావాలా..
సౌందర్య: ఇలా మాట్లాడుతోందేంటి..
ఆనందరావు: అక్కడుంటే జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని ఇక్కడకు వచ్చాం
హిమ: అమ్మానాన్న శౌర్యని వదిలేసి వెళ్లడానికి..మనం శౌర్యని వదిలేసి వచ్చేయడానికి తేడా ఏంటి..

Also Read: డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత, మళ్లీ వంటలక్కకు కష్టాలు మొదలు

దీపకు మళ్లీ నిరాశే
యాక్సిడెంట్ అయిన వ్యక్తిని పక్కఊరి ఆసుపత్రిలో చేర్పించారన్న విషయం డాక్టర్ ద్వారా తెలుసుకున్న దీప..ఆ హాస్పిటల్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తుంది. నిన్నే అతని భార్య తనని తీసుకువెళ్లిపోయింది..ఆయన పూర్తిగా కోరుకున్నారని చెబుతుంది. ఇంతలో ఓ నర్స్ వచ్చి వారి పర్స్ ఇది,వదిలేశారు అని చేతికిస్తుంది. అప్పుడు దీప గతంలో కార్తీక్ కి పుట్టినరోజు నాడు బహుమతి ఇచ్చిన సంగతి గుర్తు తెచ్చుకుంటుంది. అంత విలువైన గిఫ్ట్ కాకపోయినా ఏదో నా స్థాయికి తగ్గట్టు చిన్న బహుమతి కొన్నాను డాక్టర్ బాబు అని దీప అంటుంది. అప్పుడు కార్తీక్ నేను చచ్చేంత వరకు ఈ పర్స్ నాతోనే ఉంచుకుంటాను అన్న మాటలు తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. 

జ్వాలగా మారిన శౌర్య
శౌర్య వాళ్ళ పిన్ని బాబాయిలు దత్తత కార్యక్రమం జరిపించి శౌర్యని వాళ్ళ కూతురుగా దత్తకు తీసుకుంటారు. మా కూతురికి  జ్వాల అని పేరు పెట్టుకున్నాం. తను ఇప్పుడు లేదు తన జ్ఞాపకంగా నీకు అదే పేరు పెట్టుకున్నామమ్మా...నువ్వే తనలా తిరిగి వచ్చావ్ అనుకుంటున్నాం అంటారు. దత్తత కార్యక్రమం పూర్తయ్యాక జ్వాల వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. 

దీప ఆ డాక్టర్ ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు, తను ఎవరో తీసుకెళ్ళిపోతే నర్స్ తన వైఫ్ అనుకుని ఉంటారులే నువ్వేం బాధపడొద్దు  ఆచూకీ తెలుస్తుంది. ఇంతవరకు వచ్చాం కదా ఎలాగైనా కనబడతారులే అని చెప్పిన డాక్టర్ తల్లి..నాకు గుత్తి వంకాయ కూర చేయి అని అంటుంది. అప్పుడు దీప నేను కూరగాయలు తెస్తాను. అలాగే డాక్టర్ బాబు కోసం కూడా వెతకవచ్చు కదా అని అనుకుంటుంది. 

Also Read: రిషి కోసం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించే పనిలో పడిన వసు, తల్లిపై ద్వేషం తగ్గించుకున్న రిషి

ఆ తర్వాత దీప రోడ్ మీద అందరికీ కార్తీక్ ఫోటో చూపించి తన గురించి తెలుసా అని అడుగుతుంది. మరోవైపు డాక్టర్ బాబు కార్లోంచి కిందకు దిగుతాడు. ఇక్కడ ఆపావేంటి గణపతి అని కార్తీక్ అంటే..నా పేరు శివ సార్ అంటాడు. మేడం కాల్ చేశారు సార్.. మీరు ఇప్పుడు జ్యూస్ తాగాలంటాడు. నాకు నచ్చినప్పుడు తింటాను ఏంటిదంతా అని మండిపడతాడు. ఇదంతా మేడంకి మీపై ఉన్న ప్రేమ సార్ అంటాడు. ప్రేమతో కూడా ప్రాణాలు తీయొచ్చని మీ మేడంని చూస్తే అర్థమవుతోందన్న కార్తీక్.. నేను జ్యూస్ తాగానని అబద్దం చెప్పేయ్ అంటాడు. కుదరదు సార్ మీరు జ్యూస్ తాగుతుండగా ఫొటో తీసి మేడంకి పెట్టాలని పంపిస్తాడు. కార్తీక్ అటు వెళ్లగానే..దీప వచ్చి శివకి ఫొటో చూపించి ఈయన తెలుసా అని అడుగుతుంది. 
ఎపిసోడ్ ముగిసింది...

సోమవారం ఎపిసోడ్ లో
ఎగ్జిబిషన్ జరుగుతుండగా..దీప,శౌర్య, కార్తీక్ అందరూ ఒకే దగ్గర ఉంటారు... కార్తీక్ ని చూసిన దీప..డాక్టర్ బాబూ అని దగ్గరకు వెళుతుంది... నేను డాక్టర్ బాబు ఏంటి..దీప ఎవరు అని క్వశ్చన్ చేస్తాడు..వంటలక్క షాక్ లో ఉండిపోతుంది..

Published at : 20 Aug 2022 08:55 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam August 20 Episode 1436

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మంట పెట్టిన బీబీ ఛాట్ బండార్ - వరస్ట్ పానీపూరి ఎవరికి వచ్చింది?

Guppedantha Manasu October 1 Update: ప్రేమకు మొండితనానికి మధ్య ఊగిసలాడుతున్న రిషిధార,దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర!

Guppedantha Manasu October 1 Update: ప్రేమకు మొండితనానికి మధ్య ఊగిసలాడుతున్న రిషిధార,దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర!

Gruhalakshmi October 1st Update: పోలీస్ స్టేషన్‌లో ప్రేమ్, సామ్రాట్ సాయం- తులసిని ఇరికించేందుకు లాస్య స్కెచ్

Gruhalakshmi October 1st  Update: పోలీస్ స్టేషన్‌లో ప్రేమ్, సామ్రాట్ సాయం- తులసిని ఇరికించేందుకు లాస్య స్కెచ్

టాప్ స్టోరీస్

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !

KCR On Fire : వినతి పత్రాన్ని విసిరికొట్టారు - కేసీఆర్ ఉగ్రరూపాన్ని చూసిన వీఆర్ఏలు !