అన్వేషించండి

Karthika Deepam Serial ఆగస్టు 19 ఎపిసోడ్: డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత, మళ్లీ వంటలక్కకు కష్టాలు మొదలు

Karthika Deepam August 19 Episode 1435: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మరో మలుపు తిరుగుతోంది. కారు ప్రమాదంలో చనిపోయారు అనుకున్న వంటలక్క, డాక్టర్ బాబు బతికే ఉన్నారు...

కార్తీకదీపం ఆగస్టు 19 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam August 19 Episode 1435)

ఒకే బస్సులో హైదరాబాద్ చేరుకుంటారు దీప, శౌర్య.ఇద్దరూ ఒకర్నొకరు చూసుకోరు. శౌర్యకి నచ్చజెప్పి తిరిగి వాళ్లింటికి పంపించేందుకు ఒప్పిస్తారు ఇంద్రుడు, చంద్రమ్మ. నువ్వా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతారు. నేను ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్లనని చెప్పేస్తుంది. మాకు ఇంక పిల్లలు పుట్టారని తెలిసి బాధపడుతున్న సమయంలో నువ్వు మాకు కనిపించావు. మాతోనే ఉండిపోతావు అనుకున్నాము కానీ ఇప్పుడు నువ్వు కోపంగా ఉన్నావని మాతో ఉంచుకుంటే అది మా స్వార్థం అవుతుంది నీ బంగారు భవిష్యత్తుకి ఆనకట్టు కట్టినట్టు అవుతుంది. పోనీ ఒక పని చేద్దాము నువ్వు మీ నానమ్మ,తాతయ్యని చూసిన తర్వాత కూడా నీకు ఇదే కోపం ఉంటే అప్పుడు మళ్ళీ తిరిగి తీసుకువెళ్లిపోతామంటారు.

మరోవైపు దీప ఆటోలో ఇంటికెళుతూ..అత్తయ్య,మావయ్య ఎలా ఉన్నరో..మేం బతికే ఉన్నామని చెబితే ఎంత సంతోషిస్తారో , పిల్లల్ని దగ్గరకు తీసుకోవాలి, అత్తయ్య-మావయ్యతో రాత్రంతా కబుర్లు చెప్పాలని ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత సీన్లో శౌర్య వాళ్ళు సౌందర్య ఇంటికి వస్తారు కానీ అక్కడున్న వాచ్ మెన్ వాళ్లు అమెరికా వెళ్లిపోయారని చెబుతాడు. పిల్లని ఇక్కడ వదిలేసి వాళ్ళ అమెరికా ఎలా వెళ్ళిపోతారని శౌర్య వాళ్ళ పిన్ని బాబాయ్ అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు శౌర్య తో మనం తిరిగి మన ఇంటికి వెళ్లి పోదాం అని ఆటో ఎక్కుతారు.

Also Read: శౌర్యకి వాటర్ బాటిల్ కొనిచ్చిన దీప, ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు -మోనిత కోసం వెయిటింగ్
 
దీపకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, వాళ్ళ అమ్మ హాల్లో కూర్చుని ఉండగా ఒక అతను వస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ నేను చెప్పిన పని గురించి ఏమైంది అని అడగడంతో ఆ వ్యక్తి ఏం చెబుతాడంటే..దీప లోయలో పడిపోయిన మన ఆసుపత్రికి వచ్చిన రోజే పక్క ఊర్లో కూడా అదే లోయలో పడిపోయిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేర్పించారని ఆయన పూర్తిగా కోలుకున్నారని చెబుతాడు. ఇంకో రెండు మూడు రోజులు డిశ్చార్జ్ కూడా అవుతారంటాడు. ఆయనే దీప భర్త అయిఉంటాడంటుంది డాక్టర్ గారి తల్లి. 

శౌర్యవాళ్లు వెళ్లిపోగానే సౌందర్య ఇంటికి దీప వస్తుంది. వాళ్లు అమెరికా వెళ్లిపోయారని వాచ్ మెన్ చెప్పడంతో దీప వెనుతిరుగుతుంది. తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కి కాల్ చేసి జరిగినదంతా చెప్పేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత దీపగుడిలో దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఎందుకు ఇలా చేశావు స్వామి, మా పిల్లలకి అమ్మానాన్న ప్రేమ దక్కకూడదు అనా లేకపోతే నాకు నా భర్త ప్రేమ దక్కకూడదనా? ఎందుకు ఇలా చేస్తున్నావు జీవితమంతా కష్టాలతోనే నెగ్గుకుంటూ వస్తున్నాను. దయచేసి ఎలాగైనా డాక్టర్ బాబుని బతికించిన కనిపించేలా చెయ్యి స్వామి నేను బతికున్నాను అంటే డాక్టర్ బాబు కూడా బ్రతికే ఉండాలి కదా దయచేసి డాక్టర్ బాబుని నాకు కనిపించేలా చేయ స్వామి. అప్పుడు మేము ఇద్దరం అమెరికా వెళ్లి పిల్లల్ని తెచ్చుకుంటాం అంటుంది. ఈ లోగా కార్తీక్ అక్కడికి వచ్చి దీపా అని అంటాడు.దీప వెంటనే కన్నీళ్లుతో పరిగెత్తుకొని కార్తీక్ ని వెళ్లి హత్తుకుంటుంది. 

Also Read: వసుకి క్యారియర్ పంపించి జగతికి అన్నం తినిపించిన రిషి, దేవయానిలో మొదలైన భయం

దీప:డాక్టర్ బాబు మీరు బతికే ఉంటారని నాకు తెలుసు నేను బతికున్నాను అంటే మీరు బతుకుతారు. పెళ్ళైన కొన్నాళ్లకికి దూరం అయిపోయాం మళ్ళీ దగ్గరయ్యాం అనుకుంటే ఇలా అయిపోయింది. ఈ జన్మకి ఎడబాటు చాలు ఇకనైనా కలిసి బతుకుదాం. అయినా మీరు నా కళ్ళ ముందుకు వచ్చారంటే నమ్మలేకపోతున్నాను. రండి మనం వెళ్లి పిల్లల్ని తెచ్చుకుందాం అనేలోగా కార్తీక్ మాయమైపోతాడు. ఇదంతా నా భ్రమా..ఎందికిలా చేస్తున్నావ్ స్వామీ...అంటే డాక్టర్ బాబు బతికే ఉన్నారని నాకు ముందే చెబుతున్నావా..అంతా మంచే జరగాలని చూడు స్వామి అని దీప దేవుడికి దండం పెట్టుకుంటుంది. 
ఎపిసోడ్ ముగిసింది...

Also Read:  ఒకే బస్సులో దీప-శౌర్య ప్రయాణం, డాక్టర్ బాబు పిలుపువిని పరవశించిన వంటలక్క

రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
దీప పరుగున హాస్పిటల్ కి వెళ్లి కార్తీక్ ఆచూకి కోసం హాస్పిటల్లో ఎంక్వరీ చేస్తుంది. నిన్ననే వాళ్లావిడ వచ్చి తీసుకెళ్లిపోయారు మేడం అని చెబుతారు..దీప షాక్ అవుతుంది. పర్స్ ఇక్కడే మర్చిపోయారంటూ కార్తీక్ పర్స్ దీప చేతిలో పెడతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Raja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
IPL 2024: ఇద్దరిదీ ఒకే కథ, పైచేయి సాధించేదెవరు ?
ఇద్దరిదీ ఒకే కథ, పైచేయి సాధించేదెవరు ?
Vishal : రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్
రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్
Embed widget