Karthika Deepam September 14th Update: మన బాబు దొరికాడంటూ కార్తీక్ ని కట్టిపడేసిన మోనిత, వంటలక్కని మళ్లీ అనుమానించిన డాక్టర్ బాబు
Karthika Deepam September 14th Update: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...
Karthika Deepam September 14th Episode 1457 (కార్తీకదీపం సెప్టెంబరు 14 ఎపిసోడ్)
కార్తీక్ కి దగ్గరయ్యేందుకు మోనిత జ్వరం నాటకం ఆడుతుంది. డాక్టర్ ని తీసుకొచ్చేందుకు కార్తీక్ వెళ్లడంతో దీప-డాక్టర్ అన్నయ్య ఇంట్లోకి వస్తుంటారు. మా అన్నయ్య డాక్టరే అని చెప్పి దీప..తన అన్నయ్యని పంపిస్తాడు. నేనేదో కార్తీక్ కి దగ్గరవ్వాలని డ్రామా ఆడితే నిజంగా డాక్టర్ ని తీసుకొచ్చాడనుకుంటుంది మోనిత. మీరిద్దరూ డాక్టరే కదా అని షాకిస్తాడు. జ్వరం, ఒళ్లు నొప్పులు ఇంకా చాలా ఉన్నాయంటూ మందులు రాసిస్తాడు. ఆ మందులు చూడగానే మోనిత షాక్ అవుతుంది. డాక్టర్ కాలర్ పట్టుకుంటుంది.
మోనిత: ఆ వంటలక్క దగ్గర్నుంచి తీసుకొచ్చావ్ కదా వీడిని అని ఊగిపోతుంది. వీడు ఆ వంటలక్క మనిషే.. ఏరా మీరిద్దరూ కలసి నాటకం ఆడుతున్నారా
కార్తీక్: అవును వంటలక్క దగ్గర్నుంచే తీసుకొచ్చాను..ఈయన వాళ్ల అన్నయ్య..డాక్టర్ అని చెబితే తీసుకొచ్చాను...
డాక్టర్ అన్నయ్య: నేను దీపా వాళ్ల అన్నయ్యనే..మీకు కావాల్సింది డాక్టరే కదా
మోనిత: నాకేమైనా పిచ్చి పట్టిందనుకున్నావా..ఈయన వచ్చింది ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాదు వంటలక్కని మనింట్లో వంటమనిషిగా చేర్చేందుకు. నాకు ఏదో తలనొప్పివస్తే లేనిజబ్బు అంటగట్టి వంటలక్కని మనింట్లో చేర్చేందుకే..
డాక్టర్ అన్నయ్య: ఎక్కువ ఆవేశపడకండి మీ ఆరోగ్యం అంత బాగాలేదు
మోనిత: కార్తీక్ ముందు ఆయన్ని పంపించెయ్..ఇక్కడుంటే ఏం చేస్తానో నాకే తెలియదు
డాక్టర్ అన్నయ్య బయటకు వస్తాడు..దీప కన్నీళ్లు పెట్టుకుంటుంటే పదమ్మా ఇక్కడి నుంచి అంటాడు...
వాళ్లు వెళ్లిపోగానే కార్తీక్ మోనితపై ఫైర్ అవుతాడు..వంటలక్క ఎందుకలా చేస్తుందని అడుగుతాడు....
రకరకాలుగా నీకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది..ఎందుకు నువ్వు నా మాట నమ్మడం లేదంటూ.. వంటలక్కా నా దగ్గరే నీ తెలివితేటలా ఐ పోయావ్ అని నవ్వుకుంటుంది మోనిత...
Also Read: దీప కోసం డాక్టర్ అన్నయ్య ప్రయత్నం సక్సెస్, మోనిత చీటర్ అని కార్తీక్ తెలుసుకోనున్నాడా!
హిమ..శౌర్య గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ నడుస్తుంటుంది. ఇంతలో సరోజ( గతంలో బస్తీలో దీపతో పాటూ ఉన్నామె).. ఎదురుపడుతుంది. ఎలా ఉన్నారమ్మా అని అడుగుతుంది.. ఆ తర్వాత మోనిత కొడుకు..తన చెల్లెలు దగ్గర వదిలేసి వెళ్లిందని చెబుతుంది. తమ్ముడిని చూస్తానని హిమ అడిగితే సరే పద అంటుంది..
మరోవైపు మోనిత..దీపని కార్తీక్ నుంచి ఎలా దూరంగా పెట్టాలా అని ఆలోచిస్తుంది.దీపని ఇక్కడి నుంచి తరిమేయలేను కాబట్టి కార్తీక్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలనే ఆలోచనలో పడుతుంది. ఏం ఆలోచిస్తున్నావ్ మోనితా..తప్పిపోయిన మన బాబు గురించేనా అని అడుగుతాడు. వంటలక్క పేరు తర్వాత కార్తీక్ గుర్తుంచుకున్నది బాబు గురించి మాత్రమే అని ఆలోచించిన మోనిత...వెంటనే బాబుని తీసుకొస్తే కార్తీక్ నావాడవుతాడు అనుకుంటుంది. బాబు ఆచూకీ తెలిసిందా అని కార్తీక్ అడిగితే తెలిసింది కార్తీక్ అంటుంది మోనిత. బాబు చెన్నైలో ఉన్నాడని చెప్పగానే..పద వెళదాం అంటాడు. నువ్వొద్దు నేను తీసుకొస్తానని చెబుతుంది మోనిత.
మోనిత కొడుకు దగ్గరకు హిమని తీసుకెళుతుంది సరోజ. బాబుతో కలసి ఆడుకుంటుంది. హిమ-బాబుని చూసి సరోజ, లక్ష్మణ్ వాళ్లు మురిసిపోతారు. ఆనంద్ ని నాతో పంపించండి అని అడుగుతుంది హిమ. లక్ష్మణ్ మాత్రం బాబుని పంపించను అని చెబుతాడు. మోనితమ్మ బాబుని చూసుకోమని మాకు అప్పగించింది, బాబుని ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పిందని అందుకే బాబుని ఇవ్వం అని చెబుతారు. మోనితమ్మ వచ్చి అడిగితే వాళ్లుమాత్రం ఏం చెబుతారులేమ్మా అని సర్ది చెబుతుందిసరోజ... నానమ్మ-తాతయ్య అడిగితే వాళ్లే ఇస్తారని ఆలోచనలో పడుతుంది హిమ...
మరోవైపు దీప-డాక్టర్ అన్నయ్య..మోనిత గురించి డిస్కషన్ స్టార్ట్ చేస్తారు.
అన్నయ్య: నువ్వు చెబితే ఏమో అనుకున్నాను కానీ చూశాక అర్థమైంది..ఆమె ఎంత ప్రమాదకరమో అని
దీప: నువ్వు జ్వరానికి బదులు వేరే మందులు రాసేసరికి ఎలా కనిపెట్టేసిందో..
అన్నయ్య: నేను కావాలనే రాశాను...
దీప: నేను ఆ ఇంట్లోకి చేరేందుకే కావాలని నిన్ను తీసుకెళ్లానని అనుకుంటారు డాక్టర్ బాబు...
అన్నయ్య: గతం మర్చిపోయిన వాళ్ల మనసు చాలా సున్నితంగా ఉంటుంది..వాళ్లకి ఏదీ ఎక్కువ సేపు గుర్తుండదు కదా..నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. ఏడవద్దమ్మా ...ధైర్యంగా ఉండు
దీప: అప్పుడే పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టుంటాయి..అంతలోనే పరిస్థితులు మారిపోతాయ్..
అన్నయ్య: అధైర్య పడొద్దమ్మా..డాక్టర్ బాబు నీ దగ్గరకు వస్తారు. నీ ప్రయత్నం చేయి..
దీప: నా డాక్టర్ బాబుని తెచ్చుకునేవరకూ వదలను..వెళ్లొస్తాను అన్నయ్యా...
అన్నయ్య: ఆ రాక్షసి నుంచి డాక్టర్ బాబుని విడిపించి తీసుకుని రా...
రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
కార్తీక్ వంటలక్కా అని అరుస్తూ వస్తాడు..లోపలకు రండి అంటే నువ్వే బయటకు రా అంటాడు. నీ ఆలోచనలు మంచివి కాదని మోనిత చెప్పినా నేను వినలేదు.. తెలిసికూడా పరాయి స్త్రీ భర్తని ఎలా కోరుకుంటున్నావ్...