News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Karthika Deepam September 13th Update: దీప కోసం డాక్టర్ అన్నయ్య ప్రయత్నం సక్సెస్, మోనిత చీటర్ అని కార్తీక్ తెలుసుకోనున్నాడా!

Karthika Deepam September 13th Update: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

FOLLOW US: 
Share:

Karthika Deepam September 13th Episode 1456 (కార్తీకదీపం సెప్టెంబరు 13 ఎపిసోడ్)

దీప చెప్పినట్టు ఒంటరిగానే పూజచేస్తాడు కార్తీక్. పూజ పూర్తయ్యాక దీప వెళ్లిపోయిన తర్వాత కార్తీక్  పై మోనిత ఫైర్ అవుతుంది. అసలు నువ్వు ఎప్పుడు వంటలక్కని కలిశావ్ అని అడుగుతుంది..అప్పుడు కార్తీక్ నిన్న రాత్రి అని దీపను కలిసిన విషయం చెబుతాడు
కార్తీక్: వంటలక్కా..నువ్వు మొదటి సారి చూసినప్పుడు నా భార్యని అని చెప్పావు..నిన్ను చూడాగనే ఏదో గుర్తొస్తోంది.
దీప: ఏంటి డాక్టర్ బాబు గుర్తొస్తోందా..
కార్తీక్: నాకు ఏదీ గుర్తుండడం లేదు..పూజకు రానన్నావంట కదా..అందుకే నేను పిలవడానికి వచ్చాను
దీప: పూజలో మీరు ఒక్కరే కూర్చోవాలి..గతం గుర్తుకురావాలి..మీ భార్య, పిల్లలతో కలసి సంతోషంగా ఉండాలి  అందుకే ఒక్కర్నే కూర్చోమంటున్నా..
కార్తీక్: నువ్వు మంచి విషయమే కదా చెప్పావ్..తప్పకుండా ఫాలో అవుతాను
దీప: మర్చిపోరు కదా...
కార్తీక్: మర్చిపోయినా మర్చిపోతాను ఎందుకైనా మంచిదని పూజలో నేను ఒక్కడినే కూర్చోవాలని పేపర్ పై రాసుకుని జేబులో పెట్టుకుంటాడు. రేపు ఈ చీటీ చూడగానే నీకిచ్చిన మాట గుర్తుచేసుకుంటాను... సరే వంటలక్కా వెళ్లొస్తాను...
అదీ జరిగింది మోనిత అంటాడు...
మోనిత: నేను వెళ్లి పిలిచాను కదా..నువ్వెందుకు వెళ్లాలి..మనిద్దరం కలసి పూజచేయాలంటే నువ్వు ఒక్కడివే కలసి పూజ చేయాలంది అంటే..మనిద్దర్నీ విడదీయాలని ఎందుకు చూస్తోంది..
కార్తీక్: భార్య పిల్లలతో కలసి ఉండమనే కదా పూజ చేశాను..నీ కోసమే కదా..నువ్ నా భార్యవి కాదా. నాకు సాయం చేసింది నేను సాయం చేశాను
మోనిత: సాయం చేస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా...
కార్తీక్: ఏం మాట్లాడుతున్నావ్ మోనిత..నువ్వెలా బిహేవ్ చేస్తే నేను అలాగే బిహేవ్ చేస్తానంటూ కోపంగా వెళ్లిపోతాడు..
మోనిత: ఇంత చేస్తున్నది దీపకి అప్పగించడానికా..ఏదో ఒకటి చేసి కార్తీక్ కి నాపై ప్రేమ కలిగేలా చేసుకుంటాను...

Also Read: దీప ప్లాన్ సక్సెస్ - వినాయకుడి సాక్షిగా మోనిత మాట కాదని దీప మాట విన్న కార్తీక్

సౌందర్య ఇంట్లో వినాయక పూజ చేస్తారు.. శౌర్యకి, నాకు అంటూ రెండు దండలు తీసుకొస్తుంది హిమ. శౌర్య గురించి హిమ బాధపడుతుంటుంది. అక్కడకు వారణాసిని పంపించాం కదా బాగా చూసుకుంటాడులే అని ధైర్యం చెబుతారు సౌందర్, ఆనందరావు. 
హిమ: అమ్మా నాన్న ఉన్నారని అంటోంది..నిజంగా ఉన్నారా
సౌందర్య: ప్రతి దానికీ కాలమే సమాధానం చెబుతుంది..వేచి చూడడమే మన పని...

దీప ఇంటికి వస్తాడు డాక్టర్ అన్నయ్య.. 
డాక్టర్ అన్నయ్య: ఈ రోజు మోనితతో కలసి డాక్టర్ బాబు పూజ చేయకుండా ఆపావ్ సంతోషమే కదా
దీప: సంతోషమో బాధో తెలియడం లేదు..ఈ సంతోషం శాశ్వతం అయ్యేదెప్పుడు
డాక్టర్ అన్నయ్య: త్వరలోనే ఆయనకు గతం గుర్తొస్తుందిలేమ్మా..
దీప: నేను చేసిన సాయానికి కృతజ్ఞతగా ఈ పని చేశారు..
డాక్టర్ అన్నయ్య: కార్తీక్ మనసులో నీకు స్థానం ఉంది..అందుకే మోనిత చెప్పినా కూడా నీకిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. ఎంత తొందరగా గుర్తొస్తావ్ అన్నది నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది..
దీప: అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాను..కానీ ఈ రోజు తగిలిన దెబ్బకు మోనిత ఏం చేస్తుందో ఏంటో..
డాక్టర్ అన్నయ్య: డాక్టర్ బాబుని చూపించవా నాకు.. ముందు మోనితని చూడాలని ఉంది
దీప: చవితి రోజు చంద్రుడిని చూసినదానికన్నా..దాని మొహం చూస్తేనే ఎక్కువ నీలాపనిందలు వస్తాయి..
ఇద్దరూ నవ్వుకుంటారు...

Alos Read: 'లైగర్'ని అన్న మోనిత,'లోఫర్'వి అన్న దీప - వినాయక చవితి పూజలో మోనితకు షాక్ ఇచ్చిన కార్తీక్

మోనిత
దీప దగ్గరకు ఎందుకు వెళ్లావని అడిగితే..నాపై కోపపడ్డాడంటే పరిస్థితి చేజారిపోయేలా ఉంది..అసలు కార్తీక్ ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాను.. ప్రేమ లేకపోవడమే ప్రాబ్లెమా..భార్యని అని చెప్పడమే కానీ కార్తీక్ ఎప్పుడూ నాతో ప్రేమగా లేడు..అలా నా మాట వినాలంటే ప్రేమ పుట్టేలా చేసుకోవాలి..నా ఆరోగ్యం బాగాలేకపోతే నాతో ప్రేమగా ఉంటాడు కదా..ఇదే మంచి ఐడియా అని వెంటనే ముసుగేసుకుని పడుకుంటుంది...

కార్తీక్: ఏమైంది మోనిత..
మోనిత: జ్వరంగా ఉంది..సడెన్ గా వచ్చింది..
కార్తీక్: ఇందాక నిన్ను నేను తిట్టాను కదా అందుకే జ్వరం వచ్చింది.. అయినా ఎందుకు చిరాకు తెప్పిస్తావ్ అనవసరంగా తిట్టాను..సరే డాక్టర్ ని పిలుస్తాను..
మోనిత: అవసరం లేదు..నా దగ్గర కూర్చో..నాలో ఆవేశమే కానీ ఆవేదన అర్థం చేసుకోలేదు..నీలో కన్నబిడ్డను చూసుకుంటున్నా కానీ అర్థం చేసుకోవడం లేదు..నాపై ప్రేమ అస్సలు లేదు.నన్ను పరాయిమనిషిలా చూస్తున్నావ్. నువ్వు ఇలాగే ఉంటే ఎక్కడ నాకు దూరం అయిపోతావో అని భయం వేస్తోంది..
కార్తీక్: చూడు బంగారం...నీకు ఎంత ప్రేమ ఉన్నా కోపం, చిరాకు ఎలా వస్తాయో నాక్కూడా అంతే..అనవసరంగా నన్ను అపార్థం చేసుకోవద్దు.. డాక్టర్ ని తీసుకొస్తాను ఉండు..
మోనిత: ఆవేశం వచ్చినా ప్రేమ వచ్చినా తట్టుకోవడం కష్టం..పోనీలే..ఈ రోజు దగ్గరైనట్టు రోజూ దగ్గరైతే చాలు... 

దీప-డాక్టర్ అన్నయ్య ఇద్దరూ కార్తీక్ ఇంటికి వెళుతుంటారు..ఇంతలో కార్తీక్ ఎదురుపడతాడు. మోనితకి జ్వరంగా ఉందని కార్తీక్ చెప్పడంతో మా అన్నయ్య కూడా డాక్టరే అని దీప చెబుతుంది. నేనంటే పడదు కాబట్టి మా అన్నయ్య అని చెప్పకండి అంటుంది దీప. లోపలకు వెళతారంతా..

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
మోనితని టెస్ట్ చేసి మందులు రాసిస్తాడు..ఆ చీటీ చూసిన మోనిత ఆవేశంతో ఊగిపోతుంది. ఎవడ్రా నువ్వు నిన్ను ఆ వంటలక్క పంపించిందా అని కాలర్ పట్టుకుంటుంది... కార్తీక్ ఆపేందుక ప్రయత్నిస్తాడు...https://telugu.abplive.com/web-stories/total-lunar-eclipse-on-november-8-2022-51044

Published at : 13 Sep 2022 08:26 AM (IST) Tags: Karthika Deepam Serial karthika deepam latest episode Nirupam Sobha Shetty premi archana doctor babu vantalakka monitha soundarya Karthika Deepam September 13th update Karthika Deepam Today Episode 1456

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్

Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్

Nindu Noorella Saavasam December 4th Episode: ఘోర ప్రశ్నకి దొరికిన సమాధానం.. తప్పంతా నాదే అంటూ ఫీలవుతున్న అరుంధతి!

Nindu Noorella Saavasam December 4th Episode: ఘోర ప్రశ్నకి దొరికిన సమాధానం.. తప్పంతా నాదే అంటూ ఫీలవుతున్న అరుంధతి!

Guppedantha manasu december 4th Episode: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ : శైలేంద్రను ఇంటరాగేషన్‌ చేస్తానన్న ముకుల్‌ - తన నాటకాన్ని దేవయానికి చెప్పిన శైలేంద్ర

Guppedantha manasu december 4th Episode:  ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ : శైలేంద్రను ఇంటరాగేషన్‌ చేస్తానన్న ముకుల్‌ - తన నాటకాన్ని దేవయానికి చెప్పిన శైలేంద్ర

Prema Entha Madhuram December 4th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: భార్యని చూసిన ఆనందంలో ఆర్య - వాళ్లను చంపేందుకు ఆలయంలోకి ప్రవేశించిన రౌడీలు

Prema Entha Madhuram December 4th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: భార్యని చూసిన ఆనందంలో ఆర్య - వాళ్లను చంపేందుకు ఆలయంలోకి ప్రవేశించిన రౌడీలు

Gruhalakshmi December 4th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: దివ్యకు ప్రెగ్నెన్సీ రావడంతో షాకైన రాజ్యలక్ష్మీ - పెద్దమనసు చాటుకున్న జాహ్నవి

Gruhalakshmi December 4th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: దివ్యకు ప్రెగ్నెన్సీ రావడంతో షాకైన రాజ్యలక్ష్మీ - పెద్దమనసు చాటుకున్న జాహ్నవి

టాప్ స్టోరీస్

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
×