అన్వేషించండి

Karthika Deepam జులై 15 ఎపిసోడ్ 1405: శాడిస్ట్ లా తయారైన శౌర్య - హిమ అనుకుని రౌడీబేబీకి మళ్లీ ఐ లవ్ యూ చెప్పిన డాక్టర్ సాబ్

Karthika Deepam july 15 Episode 1405: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీకదీపం జులై 15 శుక్రవారం ఎపిసోడ్ (Karthika Deepam july 15 Episode 1405)

బయటి నుంచి హిమను భోజనానికి రమ్మని సౌందర్య పిలుస్తుంది. తాను వెళ్లి కూర్చుంటే శౌర్య తినదేమో అని ఆలోచించిన హిమ తర్వాత తింటాను అంటుంది. నేనిక్కడ ఉన్నానని భయపడుతోందా అనుకున్న శౌర్య...నానమ్మ రమ్మని చెప్పు అంటుంది. మనం తిన్న తర్వాత తినడం ఏంటి వచ్చి కూర్చోమను అంటుంది. హిమ సంతోషంగా భోజనానికి కూర్చుంటుంది. నా కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ తినమని చెప్పు..చేసిన ద్రోహం నన్ను చూసి ప్రతిక్షణం గుర్తుకురావాలి, తినే ప్రతీసారీ నా కడుపుమంట తెలియాలి అంటుంది... 

అటు నిరుపమ్ ఫోన్లో హిమ ఫొటో చూసి తనతో తానే మాట్లాడుకుంటాడు
నీకు నేనంటే ఇష్టం అని తెలుసు అయినా కూడా నీ మనసులో ప్రేమను చంపుకుని జ్వాలని పెళ్లిచేసుకోమంటున్నావ్ ఎందుకిదంతా..జ్వాలే శౌర్య అని నాకు ఇప్పుడు తెలిసింది కానీ నీ మనసులో ఏముందో తెలియడం లేదు. ఈ గందరగోళం ఏంటో నేను క్లియర్ చేసుకుంటాను. నీ మనసులో ఏముందో తెలుసుకుంటాను. శుభలేఖల వరకూ వచ్చిన పెళ్లిని పీటల వరకూ తీసుకెళ్లడం కష్టం కాదు కానీ ఈ చిక్కుముడులు నువ్వే విప్పాలి.

Also Read:నిరుపమ్ మాట కూడా వినకుండా అపార్థాల ఊబిలో కూరుకుపోతున్న శౌర్య, ప్రేమతో పాటూ ప్రాణ త్యాగానికి సిద్ధమైన హిమ

ఇంట్లో కూర్చుని హిమ తనలో తాను మాట్లాడుకుంటుంది
నువ్వు ఇంట్లో అడుగుపెట్టడం నాకు ఆనందం...నీకోపం ఎప్పుడు తీరుతుందో అర్థంకావడం లేదు. నీ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను, నీతో మాట్లాడలన్నా భయం వేస్తోంది. నిరుపమ్ బావతో నీ పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే క్యాన్సర్ అని అబద్ధం ఆడాను. కానీ ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. నాపై కోపం తెచ్చుకుని నేనేదో నీదగ్గర్నుంచి బావని లాక్కుంటున్నట్టు అపార్ఠం చేసుకుం  టున్నావ్. కానీ నీదగ్గరకు వచ్చి మాట్లాడితే కోపంతో ఎక్కడ వెళ్లిపోతావో అని భయం వేస్తోంది. నిన్ను అపురూపంగా చూసుకోవాలి...నీ మనసులో ఉన్న కోపాన్ని నేనే తగ్గించాలి....

సౌందర్య-ఆనందరావు: చిన్నప్పుడూ ఇద్దరూ ముద్దుగా కలసి మెలసి ఉండేవారు..ఇప్పుడేంటో ఇలా అయిపోయారు..వీళ్లిద్దరి మధ్యా దూరం ఎప్పుడు తగ్గుతుందో అని ఆనందరావు అంటే... అది రావడమే గొప్ప..రాగానే అలాంటి ప్రయత్నం చేస్తే మళ్లీ వెళ్లిపోయినా అంటుంది సౌందర్య. మరోవైపు తెల్లారగానే ప్లాన్ ప్రకారం  ఇంట్లో బట్టలన్నీ ఉతకడానికి వేసేసిన సౌందర్య-ఆనందరావు...హిమకి-శౌర్యకి సేమ్ డ్రెస్ వేసుకునేలా ప్లాన్ చేస్తారు.     

Also Read:  వసు అనే చిక్కు లెక్కని పరిష్కరించే పనిలో లెక్కల మాస్టారు రిషి, జగతి దెబ్బకు సైలెంటైపోయిన దేవయాని

అటు ప్రేమ్...హిమను గుర్తుచేసుకుంటాడు. నా మనసులో ఉన్న మాటని నీకు వీడియో పంపించాను నువ్వు చూడలేదు అనుకుంటాడు. నువ్వు నిరుపమ్ తో పెళ్లి వద్దన్నావ్....ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటాడు. ఇంతలో శౌర్య-హిమ ఇద్దరూ నానమ్మ-తాతయ్య ఇచ్చిన డ్రెస్ వేసుకుని వస్తారు. ఒకరికి తెలియకుండా మరొకరు సేమ్ డ్రెస్ వేసుకుని ఎదురు పడగానే ఒకర్నొకరు చూసుకుని షాక్ అవుతారు.  డ్రెస్ లు ఒకటైనంత మాత్రాన మనుషులు ఇద్దరూ ఒక్కటే ఎందుకవుతారు. ఇదంతా నీ ప్లానేనా నాకు తెలుసు అంటుంది. హిమ చెప్పేందుకు ట్రై చేసినా శౌర్య అస్సలు విననే వినదు.  ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేస్తే నా కోపం ఏంటో నీకు తెలుసు కదా అంటుంది. నిరుపమ్ కాల్ చేయడంతో వస్తున్నాను బావా అని వెళ్లిపోతుంది హిమ.

మరోవైపు స్వప్న..నిరుపమ్ మాటలు గుర్తుచేసుకుని టెన్షన్ పడుతుంటుంది. ప్రేమ్ ఆ పరిష్కారం ఏంటో త్వరగా చెప్పరా అంటే...నిరుపమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ హిమను పెళ్లిచేసుకోడు అని చెప్పేస్తాడు. ఆ మాటకి స్వప్న సంతోషిస్తుంది. హోటల్లో కలసిన నిరుపమ్ పెళ్లిపై హిమకు క్లారిటీ ఇస్తాడు. శౌర్యపై నీకు ప్రేమ ఉంటే ఇంకేదైనా సహాయం చేయి కానీ... పెళ్లి మధ్యలోకి తనని లాగొద్దు అని చెబుతాడు. బావ కోపంగా ఉన్నట్టున్నాడు ఇలాంటి టైమ్ లో శౌర్య గురించి చెప్పకపోవడమే మంచిది అనుకుంటుంది హిమ. ఇంతలో అక్కడకు వచ్చిన శౌర్య....హిమ-నిరుపమ్ ని చూసి కోపంగా వెళ్లిపోతుంది. ఆ వెంటనే హిమ కూడా లేచి వెళ్లిపోతుంది. నిరుపమ్ ఎంత పిలుస్తున్నా నన్ను క్షమించు బావా అనుకుంటూ వెళ్లిపోతుంది. ఇంటికి కోపంగా వచ్చిన శౌర్యని చూసి సౌందర్య షాక్ అవుతుంది. ఇప్పుడే వెళ్లావ్ అప్పుడే వచ్చావేంటి అంటుంది. బయటకు వెళ్లిన వెంటనే ఇంట్లోకి రాకూడదని మీ ఇంట్లో రూల్ ఉందా అని రివర్సవుతుంది. ఆ వెనుకే హిమ వస్తుంది.  సౌందర్య ఆనందరావు ఇద్దరూ పిలుస్తున్నా వినకుండా హిమ కూడా లోపలకు వెళ్లిపోతుంది. 

డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాది అన్నావ్ నువ్వే పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ కోపంగా ఏరోస్ విసురుతుంటుంది శౌర్య. అంత కోపం ఉంటే ఫొటోపై విసరడం ఎందుకు నాపై విసురు అని వచ్చి నిల్చుంటుంది. నీ ప్లాన్ లో ఇదో భాగమా అని శౌర్య అంటే...ప్లాన్ ఏదీ లేదు నీకు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు...నన్ను చెప్పనీయడం లేదు అంటుంది...

Also Read:   క్లైమాక్స్ కి చేరుతున్న 'కార్తీకదీపం', వీడిపోతున్న చిక్కుముడులు - హిమ-శౌర్య విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నడాక్టర్ సాబ్

రేపటి( శనివారం) ఎపిసోడ్ లో
హిమ-శౌర్య సేమ్ డ్రెస్ వేసుకోవడంతో హిమ అనుకుని శౌర్యకి ఐ లవ్ యూ చెప్పి...అక్కడున్నది శౌర్య అని తెలియగానే sorry అంటాడు. మరోవైపు నాపై ప్రేమ ఉంటే శౌర్యని పెళ్లిచేసుకో బావా అని అడుగుతుంది. ఇదంతా విన్న రౌడీ బేబీ... హిమా నాకోసం ఇంత చేస్తున్నావా అని హగ్ చేసుకుంటుంది.  (ఇది కలో నిజమో తెలియదు కానీ రౌడీ బేబీ మారినట్టు చూపించారు)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget