అన్వేషించండి

Guppedantha Manasu జులై 14 ఎపిసోడ్: వసు అనే చిక్కు లెక్కని పరిష్కరించే పనిలో లెక్కల మాస్టారు రిషి, జగతి దెబ్బకు సైలెంటైపోయిన దేవయాని

Guppedantha Manasu July 14 Episode 502:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు జులై  14 గురువారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 14 Episode 502)

అంతా కలసి ప్రాజెక్ట్  వర్క్ మొదలు పెడతారు. ఈ చదువుల పండుగను పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టి ఈవెంట్ లా అందరికీ తెలిసేలా చేద్దాం అంటుంది సాక్షి... వెంటనే స్పందించిన వసుధార మనం చేసేపనిలో బాధ్యత కనిపించాలి కానీ హంగు, ఆర్భాటాలు కనిపించకూడదు అంటుంది. జగతి-మహేంద్ర నవ్వుకుంటారు.. 
వసుధార: ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయడానికి ఇదేం ప్రొడక్ట్ కాదు ఇదో ఆలోచన సార్..ఈ ఆలోచనను అందరి సమక్షంలోకి తీసుకెళ్లాలి కానీ అందరి అటెన్షన్ తెచ్చుకోవడం కాదు
మహేంద్ర: డబ్బు ఖర్చులేకుండా కూడా పని చేయొచ్చు...మనం కార్పోరేట్ స్టైల్లో చేద్దాం అనుకోవడం లేదు కదా
జగతి: వసు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది
అందరూ ఒక్కటై నన్ను ఒంటరిని చేస్తున్నారు అనుకుంటుంది సాక్షి...
రిషి: నాకు వసుధార చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది...
వసు: చదువుల పండుగ అంటే సంక్రాంతి, ఉగాదిలా ఆహ్లాదంగా చేద్దాం...అంతేకానీ బర్త్ డే ఈవెంట్ లా మార్చొద్దు...
రిషి: మేడం మీరు ప్లాన్ చేయండి... సాక్షి వసుధార మీరిద్దరూ దీనిపై వర్క్ చేయండి...మీరు ఫైనల్ చేశాక మార్పులు చేర్పులుంటే మేడం చూస్తారు..డాడ్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మీవైపు నుంచి సలహాలు సూచనలు ఇవ్వండి. వీళ్లద్దరూ గెస్ట్ రూమ్ లో ఉండేలా ఏర్పాట్లు చేయండి. మీకేమైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి అని వసు-సాక్షికి చెప్పేసి వెళ్లిపోతాడు రిషి...
గుడ్ ఐడియా వసుధారా బాగా చెప్పావ్ అంటూ అందరితో పాటూ గౌతమ్ కూడా వెళ్లిపోతాడు...
సాక్షి: రెండు పండుగల పేర్లు చెప్పి గెలిచాను అనుకుంటున్నావా...అసలు కాన్సెప్ట్ నేను డిజైన్ చేస్తాను...రిషి కూడా నేను చెప్పిందే ఫైనల్ అంటాడు చూడు...
వసు: ఆల్ ది బెస్ట్ ...

Also Read: అర్థరాత్రి వసు-రిషి కబుర్లు, విశ్వరూపం చూపిస్తానంటోన్న సాక్షి, ముందస్తు హెచ్చరికలు చేసిన గౌతమ్

కట్ చేస్తే ఒకే రూమ్ లో మంచంపై చెరోపక్కన కూర్చుని ఉంటారు వసుధార-సాక్షి. వసు వర్క్ చేసుకుంటుంటే సాక్షి క్రూరంగా చూస్తుంటుంది.
సాక్షి: నా కర్మ కాకపోతే నీతో కలసి ఈ రూమ్ లో ఉండడం ఏంటి...
వసు: వర్క్ చేయడానికి వచ్చినప్పుడు అవి చూసుకోకూడదు
సాక్షి: నాకు బోర్ కొడుతోంది కథేమైనా వచ్చా
వసు: పని వదిలేసి కథలు చెప్పమంటావా..
సాక్షి: మన రేంజ్ లో చెప్పు..పిట్టకథలు కాదు...
వసు: రియల్ స్టోరీనే చెబుతాను... నేను టెన్త్ చదివే రోజుల్లో మోహిని అని ఫ్రెండ్ ఉండేది..కొన్నాళ్లకి సడెన్ గా మాయమైపోయింది..అందరూ ఏదేదో అనుకున్నారు..ఓ రోజు పనిపై కొన్ని రోజుల తర్వాత సిటీకి వచ్చాను..రోడ్డుపై మోహిని కనిపించింది. నేను ఇక్కడే ఉంటున్నానని వాళ్లింటికి తీసుకెళ్లింది...ఇంట్లో ఎవ్వరూ లేరు..కాఫీ తెచ్చి ఇచ్చింది..తాగబోతుంటే చూశా...కప్పులో కాఫీ ఎర్రగా ఉంది ( సాక్షిలో భయం మొదలవుతుంది). ఎదురుగా మోహిని నవ్వుతూ కాఫీతాగు వసుధార అంటోంది...కప్పులో రక్తం...ఇంట్లో ఎవ్వరూ లేరు...తాగవే అంటూ కళ్లురిమి చూసింది..భయం... ఎక్కడో నక్కల ఊళలు...కాఫీ సోఫా వెనుక పారబోద్దామని వెనక్కు తిరిగా...సోఫా వెనుక మోహిని శవం  ఉంది..ఎదురుగా మోహిని నువ్వుతూ ఉంది..మోహిని కాళ్లు చూశా..ఇలా వెనక్కు తిరిగి ఉన్నాయి. అప్పుడు చెప్పింది...తను ఎప్పుడో చచ్చిపోయానని...మోహినీ మోహినీ  మోహినీ అని మూడుసార్లు పిలిస్తే వస్తాను వసుధార అంది...పిలుద్దామా...
అప్పటికే భయపడిపోయిన సాక్షి వద్దు వద్దు నేను పడుకుంటాంటుంది....

Also Read: నిరుపమ్ మాట కూడా వినకుండా అపార్థాల ఊబిలో కూరుకుపోతున్న శౌర్య, ప్రేమతో పాటూ ప్రాణ త్యాగానికి సిద్ధమైన హిమ

రూమ్ లో కూర్చుని వసుగురించే ఆలోచిస్తున్న రిషి... వసు ఎందుకు రిజెక్ట్ చేసిందో అనే ఆలోచనలోనే ఉంటాడు.  వసుతో కలసి దిగిన ఫొటోలు చూసుకుంటూ ఉంటాడు. నా జీవితంలోకి నువ్వు రాకముందు నువ్వొచ్చాక అనే గీత గీసుకుంటే నేను ఏం కోల్పోయానో తెలిసొచ్చింది...గీతకు ఇటువైపు నా మనసు నాకు తెలిసేలోగా నువ్వేంటో తెలియకుండా మారిపోయావ్... నా ఎదురుగా నిల్చుని నాకేం తెలియకుండా చిరునవ్వు నవ్వుతున్నావ్. నిన్నెలా అర్థం చేసుకోవాలి...నువ్వొక చిక్కులెక్కవని వదిలేయాలా-పట్టుదలతో పరిష్కరించాలా...నీ మనసు నాకు అర్థం కావడం లేదు కానీ అర్థం చేసుకుంటాను అనుకుంటూ గతంలో వసు ఇచ్చిన గోళీల బాటిల్ చూస్తూ ఉంటాడు. నువ్వు పక్కగదిలోనే ఉన్నావ్.... మనుషులం దగ్గర ఉన్నా మనసులు దూరంగా ఉన్నాయ్ .  నిద్రపోయి ఉంటుందా అనుకుంటాడు.... 

అక్కడ నిద్ర మధ్యలో ఉలిక్కి పడి లేచిన సాక్షి...మోహిని కథ గుర్తుచేసుకుని మరింత భయపడుతుంది... ఏమైంది సాక్షి అంటుంది వసుధార.. మోహిని వచ్చిందా అంటే.. సాక్షి మోహిని ఎందుకు వస్తుంది అంటుంది వసుధార.  మోహిని వస్తే డోర్ కొడుతుంది లేదా నన్ను పిలుస్తుంది కదా...వస్తే నీకు పరిచయం చేస్తానులే సాక్షి నువ్వు పడుకో నేను వర్క్ చేసుకోవాలి అంటూ బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది. మోహిని భయంతో సాక్షి ఆపేందుకు ప్రయత్నిస్తుంది కానీ వసు బయటకు వెళ్లి వర్క్ చేసుకుంటుంది. ఇంతలో నిద్రపట్టక బయటకు వచ్చిన రిషి... సోఫాలో వసు వర్క్ చేసుకోవడం చూసి....  ఏంటీ ఈ వసుధార ఇంకా వర్క్ చేస్తోందా..నేను వర్క్ కంప్లీట్ చేయాలి అన్నందుకు ఇంత శ్రద్ధగా చేస్తోందా అనుకుంటూ వెళ్లి కాఫీ కలిపి తీసుకొచ్చి ఇస్తాడు. గతంలో కాఫీ ఇచ్చినప్పుడు యాక్ అన్న సందర్భం గుర్తుచేసుకుని నా జీవితంలో ప్రతిక్షణానికి వసు తోడై ఉంటుంది ఏంటో అనుకుంటాడు. వసు: నిద్రస్తోంది కాఫీ తాగితే బావుండును అని అనుకుంటుంది. ఇంతలో రిషి కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. జగతి మేడం అనుకుని పొగడ్తలు మొదలెట్టిన వసుధార రిషిని చూసి షాక్ అవుతుంది.

Also Read:  ఇరువురి భామల మధ్య ఈగో మాస్టర్ - వసుని నెట్టేసిన గర్వంలో సాక్షి, బుంగమూతి పెట్టిన వసుని రిషి బుజ్జగిస్తాడా!
రిషి-వసు మాట్లాడుకోవడం చూసి దేవయాని ఓర్వలేకపోతుంది. వాళ్లదగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అప్పుడే జగతి దేవయాని చేయి పట్టుకుని వారిస్తుంది. వారి దగ్గరికి వెళ్తే గతంలో సాక్షి లైబ్రరీలో చేసిన ఘటన వెనుక నువ్వే ఉన్నావు అని రిషికి చెబుతాను అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో దేవయాని సైలెంట్ గా వెళ్లిపోతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget