News
News
X

Karthika Deepam ఏప్రిల్ 13 ఎపిసోడ్: నిరుపమ్, ప్రేమ్ ఇద్దరూ ప్రేమిస్తున్నది హిమనే, మరి జ్వాల సంగతేంటి

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవడంతో ఇప్పుడు వాళ్ల చుట్టూ కథ నడుస్తోంది. ఎప్రిల్ 13 బుధవారం 1325 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

FOLLOW US: 

జ్వాల గతం గురించి అడిగిన హిమను ఆటోలోంచి దించేసి కోపంగా వెళ్లిపోతుంది. నువ్వెంత దూరం వెళ్లినా నీ నీడలా నీ వెంటే వస్తాను, నీకెంత కోపం వచ్చినా ఆ కోపాన్ని భరిస్తాను, ఆ కోపం తగ్గేలా నేను చూసుకుంటాను శౌర్య అనుకుంటుంది హిమ. తానెక్కడుందో అర్థంకాక హిమ నడుస్తూ వెళుతుంటుంది. ఇంతలో మళ్లీ వెనక్కు వస్తుంది జ్వాల. చేతిలో ఫోన్ ఉందికదా ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవచ్చుకదా నువ్వు నిజంగా తింగరిదానేవే అన్న జ్వాల...మళ్లీ నా విషయాలు అడగొద్దు, పోనీలే పాపం తింగరి అని వెనక్కు వచ్చానంటుంది. నీకు నాపై ఎంతోకొంత ప్రేమ ఉందని అర్థమైంది, కచ్చితంగా నీ కోపాన్ని తగ్గించగలనని అర్థమైందని మనసులో అనుకుంటుంది హిమ. 

ప్రేమ్  ఇంట్లో కూర్చుని హిమ ఫొటో చూస్తూ ఊహల్లో తేలుతుంటాడు. నీ ఫొటోని చూస్తూ నా మనసులో మాట చెప్పేస్తాను హిమా అనుకుంటాడు. మరోవైపు ఆటోలో వెళుతుండగా కామ్ గా కూర్చున్న హిమని మాట్లాడు అంటుంది జ్వాల. వద్దులే జ్వాలా...మాట్లాడకపోతే ఏమీ మాట్లాడటం లేదు, మాట్లాడితే మళ్లీ ఏం కొంప మునుగుతుందో అని నా భయం అంటుంది. ఇంతలో జ్వాల ఆటో ఆపిన ట్రాఫిక్ పోలీస్ పేపర్స్ అన్నీ చెక్ చేస్తాడు. మీ బండి పేపర్స్ వ్యాలిడిటీ అయిపోయింది కదా రెన్యువల్ చేయించుకోవాలి కదా అంటారు. ఈ రోజుకి వదిలేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తుంటుంది జ్వాల, ఇంతలో అక్కడకు వచ్చిన ప్రేమ్...ఈ తిక్క, హిమ ఇద్దరూ ఇక్కడే ఉన్నారా అనుకుంటాడు. 
ప్రేమ్: ఏయ్ తిక్కా వదిలిందా నీ లెక్క, ఇవి నా బైక్ పేపర్స్ అని చూపిస్తాడు. ఆ తర్వాత జ్వాల ఆటో ఆపిన విషయం తెలుసుకుని అస్సలు వదలకండి సార్, ఆటో సీజ్ చేయండి
జ్వాల: మధ్యలో నీ ఎక్స్ట్రాలేంటి
ప్రేమ్: వదలకండి సార్ ఈ ఆటోని అస్సలు వదలకండి...అవసరం అయితే ఈ భూమ్మీద మళ్లీ తిరగకుండా చేయండి, పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏమో ఇంత మంచి సీన్ చూశాను... ఈ రోజు ఆనందం కూడా ఎక్స్ట్రాగానే ఉందన్న ప్రేమ్...నువ్వు రా మనిద్దరం వెళదాం అని హిమని పిలుస్తాడు...
సైలెంట్ గా వెనక్కు వెళ్లి బండి తాళాలు తీసేస్తుంది జ్వాల....నువ్వు బైక్ తాళాలు తీసేస్తే నేను ఆటో తాళాలు తీసేస్తానంటూ ఆటోలో కూర్చుంటాడు ప్రేమ్. ఇదిగో తీసుకో అంటూ ఆటో తాళాలు విసిరేసి బైక్ పై హిమను ఎక్కించుకుని వెళ్లిపోతుంది జ్వాల. అందులో సత్యం సార్ కి ఇవ్వాల్సిన బాక్సులున్నాయి అక్కడకు వచ్చెయ్ అంటుంది. 

Also Read: సీరియస్ సింహం రిషి సర్ ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి? ఫ్యామిలీ అంతా షాక్!
నిరుపమ్: అటు నిరుపమ్ కూడా హిమని చూస్తూ ఊహల్లో తేలిపోతాడు. హిమా చిన్నప్పటి నుంచీ శౌర్యతో పోలిస్తే నువ్వు సైలెంట్ అని విన్నాను కానీ కార్తీక్ మావయ్య, దీపత్త సంఘటన ద్వారా నువ్వు మరింత సైలెంట్ అయ్యావ్...అందుకే నిన్ను మార్చమని జ్వాలకి అప్పగించాను.ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తోంది. మిగిలినది ఏమైనా ఉంటే నేను మార్చుకుంటాను. నీతో మాట్లాడాలని, టైమ్ స్పెండ్ చేయాలని, ఉన్న కాస్త టైమ్ ని నీతో గడపడం నాక్కావాలి, నువ్వు సంతోషంగా ఉండటం కావాలి, నీ సంతోషమే నా సంతోషం అనుకుంటాడు నిరుపమ్.  

సౌందర్య: కార్లో వెళుతున్న సౌందర్య అప్పట్లో ఇంట్లోంచి వెళ్లిపోతూ శౌర్య రాసిన లెటర్, ఇంట్లోంచి పారిపోయిన విషయం గుర్తుచేసుకుంటూ కారు  పక్కన ఆపేస్తుంది. కార్తీక్-దీప పేర్లతో ఓ అమ్మాయి రసీదు ఇచ్చి వెళ్లిందని పూజారి చెప్పిన మాటలు తలుచుకుని.... నిన్ను ఇంతకాలంగా ఇన్ని రకాలుగా ప్రయత్నించినా కనిపించడం లేదంటే నువ్వు మమ్మల్ని చూస్తూ దాగుడు మూతలు ఆడుతున్నావా...కావాలనే తప్పించుకుని తిరుగుతున్నావా...నిద్రనటించేవారిని ఎప్పటికీ లేపలేం అన్నట్టు...నువ్వు మా చుట్టూ తిరుగుతూ మాకు దొరకకూడదని డిసైడ్ అయ్యావా... అవునులే మీ అమ్మ దీపలా ఆత్మాభిమానం ఎక్కువ కదా... ఈ నానమ్మని చూడాలని ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా అని ఆలోచిస్తూ ఫైల్ చూసుకుంటుంది. ఇంతలో ఎదురుగా బండిపై వస్తున్న హిమని చూస్తుంది. హిమ బైక్ పై వెళ్లడం ఏంటి...బైక్ నడిపేదెవరు చూద్దాం అనుకుంటూ ఫాలో అవుతుంది సౌందర్య. 
హిమ: నన్ను నానమ్మ చూసేసింది అనుకుంటూ జ్వాలా త్వరగా పోనీ..( ఇప్పుడు కానీ నానమ్మని శౌర్య చూసిందంటే నాపని అయిపోతుంది అనుకుంటుంది)
మరోవైపు స్వప్న ఎక్కడినుంచో వస్తుండగా కారు ఆగిపోతుంది. చేసేది లేక దిగి రోడ్డుపై ఆటో ఆపుతుంది....ఆ ఆటో జ్వాలది...ప్రేమ్ తీసుకొస్తుంటాడు... ఆటోలో ప్రేమ్ ని చూసి షాక్ అవుతుంది స్వప్న:  నువ్వేంట్రా ఆటో నడుపుతున్నావ్... అసలు నువ్వేం చేస్తున్నావ్ నీకేమైంది...
ప్రేమ్: అనవసరంగా మమ్మీకి దొరికిపోయాను, ఆ తిక్క నన్ను భలే ఇరికించేసింది...ఎవరికైతే దొరక్కూడదో వాళ్లకే దొరికిపోయాను... అనుకోకుండా అలాజరిగిపోయిందంటూ జ్వాల విషయం చెబుతాడు.
స్వప్న: ఆ ఆటోది అంతపని చేసిందా..నాకు కనిపించనీ దానిపని చెబుతాను...దానికి బుద్ధి లేకపోతే నీకేమైంది... నీ బైక్ తీసుకెళుతుంటే లాక్కోవాలి కానీ ఫైన్ కట్టి ఆటో విడిపించి తీసుకురావడం ఏంటి... ఇది మీ నాన్న పెంపకం, నా దగ్గర ఉండిఉంటే ఇలా ఉండేవాడికి కాదు...అడ్డమైన వాళ్లని ఇంటికి రానిస్తారు మీ డాడీ...
ప్రేమ్: నువ్వేంటి ఇక్కడున్నావ్....
స్వప్న: కారు ఆగిపోయింది ఇక్కడున్నాను...ఇదీ ఒకందుకు మంచిదే లేదంటే నీ అవతారం చూసిఉండేదాన్ని కాదు కదా .... ఎపిసోడ్ ముగిసింది...

News Reels

Also Read: తమ్ముడు అని తెలియకుండానే ఆనంద్ కి దగ్గరైన హిమ-జ్వాల, ఆసక్తికర మలుపు
రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
సౌందర్య కారు హారన్ కొడుతూ జ్వాల-హిమ వెనుకే ఫాలోఅవుతుంటుంది. హిమ నన్ను చూసి కూడా ఆగడం లేదు కావాలనే నన్ను తప్పించుకునేందుకు వెళుతున్నారా... అసలు బైక్ మీద ఉన్న అమ్మాయి ఎవరు అనుకుంటుంది. ఇంతలో జ్వాల బైక్ ఆపడంతో కార్లోంచి దిగి వస్తుంటుంది సౌందర్య. జ్వాల సౌందర్యని చూసి షాక్ అవుతుంది.... 

Published at : 13 Apr 2022 08:38 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat Bigg Boss Manas amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam13th April Episode 1325

సంబంధిత కథనాలు

Guppedantha Manasu December 1st Update: తండ్రి రాకతో రిషిలో ఉత్సాహం, అర్థరాత్రి వసుతో షికార్లు

Guppedantha Manasu December 1st Update: తండ్రి రాకతో రిషిలో ఉత్సాహం, అర్థరాత్రి వసుతో షికార్లు

Karthika Deepam December 1Update:కార్తీక్ గురించి దీపకి నిజం చెప్పేసిన డాక్టర్, మోనితను బంధించిన సౌందర్య

Karthika Deepam December 1Update:కార్తీక్ గురించి దీపకి నిజం చెప్పేసిన డాక్టర్, మోనితను బంధించిన సౌందర్య

Gruhalakshmi December 1st: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్

Gruhalakshmi December 1st: తులసి, లాస్య మాటల యుద్దం- ఒక్కరోజు గృహిణిగా మారిన సామ్రాట్

Janaki Kalaganaledu December 1st: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్

Janaki Kalaganaledu December 1st: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్

Janaki Kalaganaledu November 30th: తన ఐపీఎస్ కల నెరవేర్చమని అడిగిన రామా- అలా అయితేనే ఐపీఎస్ చదవాలని కండిషన్ పెట్టిన జానకి

Janaki Kalaganaledu November 30th: తన ఐపీఎస్ కల నెరవేర్చమని అడిగిన రామా- అలా అయితేనే ఐపీఎస్ చదవాలని కండిషన్ పెట్టిన జానకి

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: గుజరాత్‌లో మొదటివిడత పోలింగ్ షురూ, బీజేపీదే విజయం - మాజీ సీఎం ధీమా

Breaking News Live Telugu Updates: గుజరాత్‌లో మొదటివిడత పోలింగ్ షురూ, బీజేపీదే విజయం - మాజీ సీఎం ధీమా

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే