అన్వేషించండి

Guppedantha Manasu ఏప్రిల్ 12 ఎపిసోడ్: సీరియస్ సింహం రిషి సర్ ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి? ఫ్యామిలీ అంతా షాక్!

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొన్నటి వరకూ మిషన్ ఎడ్యుకేషన్ రద్దు, వివాదాలు చుట్టూ సాగిన సీరియల్ ఇప్పుడు మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కింది. ఏప్రిల్ 12 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు (Guppedantha Manasu) ఎప్రిల్ 12  మంగళవారం ఎపిసోడ్

మినిస్టర్ గారి సన్మానం కాలేజీలో చాలా గ్రాండ్ గా చేద్దాం అంటాడు ఫణీంద్ర. కాలేజీలో మునుపెన్నడూ లేని విధంగా గ్రాండ్ గా డెకరేషన్ చేయించి, ట్రెడిషనల్ లుక్ లో తయారు చేద్దాం, మినిస్టర్ గారిని సంప్రదాయ లుక్ లో ఆహ్వానిద్దాం ...మీరు ఆ ఏర్పాట్లు చేయండి జగతి మేడం అంటాడు. ఏం చెబుతున్నా కానీ చూద్దం పెదనాన్న అనేస్తాడు రిషి. నువ్వేంటి అలా ఉన్నావ్ అనడంతో.. మనం అనుకున్నాం కానీ మినిస్టర్ గారు ఇంకా ఓకే చెప్పలేదు కదా అంటాడు రిషి. ఇంతలో మినిస్టర్ నుంచి కాల్ వస్తుంది... మీకు కాల్ చేయడం కాస్త ఆలస్యం అయిందని చెప్పిన మినిస్టర్ ... నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు కానీ, మీరేదో ప్లాన్ చేస్తున్నారు ... ప్రోటోకాల్ ప్రకారం కాలేజీలో అది కరెక్ట్ కాదు, నాక్కూడా ఇష్టం ఉండదంటాడు. కాలేజీలో కాకుండా మీ ఇంట్లో ప్లాన్ చేసుకుంటే బావుంటుందేమో అంటారు. ఇంట్లోనే టీ పార్టీ చేసుకుందా అనడంతో...మా మహేంద్ర బర్త్ డే పార్టీ ఉంది ఏకంగా భోజనం చేసి వెళతాను అంటారు. రిషి చాలా తెలివైన వాడు ఫణీంద్ర గారు అనేసి కాల్ కట్ చేస్తారు మినిస్టర్. 

కాలేజీకి వద్దన్నారు ఇంటికే వస్తామన్నారని ఫణీంద్ర చెప్పడంతో రిషి సంతోషిస్తాడు. ఎందుకో మరి మినిస్టర్ గారు రిషిని పొగుడుతున్నారు అని అంటాడు ఫణీంద్ర.  మొదట్లో సన్మానం నచ్చదు అన్నారు చివర్లో మన ఇంటికే వస్తామన్నారు
జగతి: మంచిదే కదా సార్...
రిషి: క్యాబిన్లో ఫోన్ మర్చిపోయానంటూ లోపలకు వెళ్లిన రిషి... అక్కడ ఏం జరిగిందో గుర్తుచేసుకుంటాడు( నువ్వంటే చాలా అభిమానం రిషి-మీ కాలేజీకి సంబంధించి ఏ విషయంలో అయినా సహాయ సహకారాలు అడుగమన్నాను కానీ నువ్వు అడగలేదు). మీరు నాకు చిన్న ఫేవర్ చేయాలి... కాలేజీ తరపున సన్మానం అని అనుకుంటున్నాం కదా...నేను చెప్పానని కాకుండా కాలేజీకి కాదు మా ఇంటికి వస్తానని చెప్పండి అంటాడు. ఎందుకు ఏంటి అడగొద్దు..మీ ద్వారా ఓ మంచి జరుగుతుందని అడుగుతున్నాను అనేసి వెళ్లిపోతాడు..( మినిస్టర్ గారు నేను చెప్పినట్టుగా ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది)...

జగతి ఇంట్లో
మీ బర్త్ డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా అన్న రిషి మాటలు.... కాలేజీలో కాకుండా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే బావుంటుందేమో అని ఫణీంద్ర మాటలు.. నేను ఎంత ఎక్కువగా పార్టీ చేస్తే రిషి అంత బాధపడతాడని అన్న జగతి మాటలు గుర్తుచేసుకుని...రిషి ఎంత తెలివిగా ఆలోచించావ్ మొండివాడివి అనుకుంటాడు. 
జగతి: ఏం ఆలోచిస్తున్నావ్ మహేంద్ర
మహేంద్ర: నేను రాను అన్నానని రిషి ప్లాన్ చేసి మరీ రప్పించుకుంటున్నాడు, మినిస్టర్ గారి సన్మానం కాబట్టి నువ్వు రాక తప్పదు..నువ్వు నా పక్కనే ఉంటావ్...
రిషి: కార్లో వెళుతూ రిషి.... జగతి నా భార్య అని ప్రపంచానికి తెలిసింది...తనని వదిలేసి బర్త్ డే జరుపుకుంటున్న ఫీలింగ్ నాకు వద్దు అన్న తండ్రి మాటలు గుర్తుచేసుకుంటూ...నేను ప్లాన్ చేసి రప్పిస్తున్నాను కానీ నా ప్లాన్ వెనుక మీపై చెప్పలేనంత ప్రేమ ఉంది డాడ్ అనుకుంటాడు రిషి.  
జగతి: హడావుడిగా వెళుతున్న వసుధారని ఆపి...ఎక్కడికి అని అడిగి నాకు తెలుసులే అంటుంది..( జగతి వెళ్లనీ అని మహేంద్ర అనడంతో ఇద్దరూ నవ్వుకుంటారు). రిషి అర్థంకాడు అనుకుంటాం కానీ అప్పుడప్పుడు వసు కూడా అర్థంకాదు...
మహేంద్ర: రెండూ ఓ గూటి పక్షులే... ఇద్దరూ ఒకర్నొకరు బాగానే అర్థం చేసుకుంటారు...

వసుధార రోడ్డుపక్కన కూర్చుని వెయిట్ చేస్తుండగా రిషి అక్కడకు వస్తాడు....
వసుధార: రమ్మని చెప్పారు
రిషి: రేపు మినిస్టర్ గారి సన్మానం...డాడ్ బర్త్ డే కూడా... రేపు మా డాడ్ ని-మీ మేడంని దగ్గరుండి తీసుకురావాలి. నేనెందుకు తీసుకురావాలి అంటావేమో... వాళ్లు సమయానికి ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత నీదే...నీ శాలరీ అకౌంట్లో పడింది చూసుకున్నావా...
వసుధార: నీ శాలరీ ఇచ్చాను..నువ్వు నా అసిస్టెంట్ వే నేను చెప్పింది వినాలి అంటున్నారా...
రిషి: నిన్ను డ్రాప్ చేయమంటావా...
వసుధార: చేయండి సార్... నాకొచ్చే జీతం మొత్తం ఆటోలు, క్యాబ్ లకే అయిపోతోంది...
రిషి: శాలరీ పెంచాలా...
వసుధార: పెంచొద్దంటారా సార్... 
రిషి: ఓ మెయిల్ పెట్టు..ఆలోచిస్తాను...

ఇంట్లో జరుగుతున్న ఏర్పాట్లు చూసి దేవయాని ఫైర్ అవుతుంది. మహేంద్ర బర్త్ డే ఇక్కడ సెలబ్రేట్ చేయడం ఏంటో అంటూ మండిపడుతుంది. ఆ మినిస్టర్ వస్తే ఆ జగతి, శిష్య పరమాణువు వస్తుంది కదా అంటుంది. ఈ మాట వినగానే అవును కదా వసుధార వస్తుందంటే నా గెటప్ మార్చుకోవాలి అనుకుంటాడు. ఇంతలో వసుధార ఎంట్రీ ఇస్తుంది. దేవయాని మరింత చిరాకు పడుతుంది. గౌతమ్-ధరణి వసుని ఆహ్వానించడం చూసి..హారతి పళ్లెం తీసుకుని వెళ్లలేకపోయావా అని ధరణిపై ఫైర్ అవుతుంది దేవయాని. ఇంతలో ఫణీంద్ర, రిషి మేడపై నుంచి కిందకు దిగుతారు. నేను నీకు ఏం చెప్పాను వసుధార అని రిషి అనడంతో వస్తున్నారు సార్ అంటుంది వసుధార. మినిస్టర్ గారికి ఏ లోటు లేకుండా ఏర్పాట్లు ఉండాలని చెబుతాడు రిషి. డెకరేషన్ సెక్షన్ మొత్తం వసు-గౌతమ్, వంటల సెక్షన్ వదిన చూసుకోండని చెబుతాడు.  

రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
ఫంక్షన్ జరిగిన తర్వాత మంత్రిగారు వెళ్లిపోతారు. ఇక వెళ్లాల్సిన వాళ్లు కూడా వెళ్లిపోతే లోపలకు వెళతాం అని జగతి-మహేంద్రని ఉద్దేశించి అంటుంది దేవయాని. స్పందించిన రిషి అప్పుడేనా పెద్దమ్మా డాడ్ కి గిఫ్ట్ ఇవ్వలేదంటూ ఏదో చెబుతాడు. అక్కడున్నవారంతా షాక్ అవుతారు. ధరణి, వసుధార ముఖాలు సంతోషంతో వెలిగిపోగా దేవయాని ముఖం మాడిపోతుంది. ఇంతకీ రిషి ఏం చెప్పాడో రేపటి ఎపిసోడ్ లో చూడాలి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Mohan Raj: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Bathukamma 2024: ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
Shardiya Navratri 2024: ఉపవాసాల దసరాగా పేరుబడ్డ  తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!
ఉపవాసాల దసరాగా పేరుబడ్డ తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!
Embed widget