Jagadhatri serial January 8th: 'జగద్ధాత్రి' సీరియల్: చంపేస్తానంటూ యువరాజ్ గొంతు పట్టుకున్న ధాత్రి - కౌషికి ప్రవర్తనకి కోపంతో రగిలిపోతున్న నిషిక!
Jagadhatri Serial Today Episode : బయటికి వెళ్ళిపొమ్మంటూ ధాత్రి వాళ్ళ లగేజ్ నిషిక విసిరేయటంతో దానిని లోపలికి తీసుకొని రమ్మని చెప్తుంది కౌషికి. కోపంతో రగిలిపోయిన నిషిక ఏం చేస్తుందో?
Jagadhatri Serial Today Episode :ఎపిసోడ్ ప్రారంభంలో ఇప్పటికైనా నిజం చెప్పు వాళ్లని ఎక్కడ ఎందుకు ఉంచావు అని భర్తని అడుగుతుంది.
కౌషికి : నిజంగానే ఏ సంబంధం లేదు పిన్ని, నా కూతుర్ని కాపాడాడు, పెళ్లి చేసుకుని రోడ్డున పడ్డాడు అని జాలితోనే ఇంట్లో పెట్టుకున్నాము అంటుంది.
అదే విషయాన్ని ఒట్టేసి చెప్పమంటుంది వైజయంతి. కుటుంబం కోసమే ఇదంతా చేస్తున్నాను ఏదైనా శిక్ష వేస్తే నాకే వెయ్యు దేవుడా అని మనసులో అనుకొని ఒట్టు వేసేస్తాడు సుధాకర్.
వైజయంతి: నీ మీద ఉన్న నమ్మకంతో ఈ మాటలు నమ్ముతున్నాను కానీ అబద్ధమని తేలితే మాత్రం మళ్లీ ఈ విషం తాగటానికి వెనకాడను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
నీవల్ల మా అమ్మకి ఎలాంటి హాని జరిగినా నిన్ను, నీకు సహకరించిన వారిని వదిలిపెట్టేది లేదు అంటూ తండ్రికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యువరాజ్.
కౌషికి : అసలు ఏం జరిగింది? ఇంతలా యువరాజ్ ఎందుకు కోపంతో రగిలిపోతున్నాడు అని అడుగుతుంది. జరిగిందంతా చెప్తాడు సుధాకర్. యువరాజ్ లో అనుమానం మొదలైంది, ధాత్రి వాళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంట్లోంచి పంపించేయాలి అంటుంది.
ఆ తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ధాత్రి కేదార్ లను చూసి ఏంటి ఈ దెబ్బలు ఎవడో కసితో కొట్టినట్లుగా ఉన్నాడు ఇకనైనా వాడి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది లేదంటే ఈసారి ప్రాణాలు అయిపోవచ్చు అని వెటకారంగా మాట్లాడుతాడు యువరాజ్.
ధాత్రి : వెంటనే యువరాజ్ గొంతు పట్టుకొని కేదార్ ని చంపాలన్న ఆలోచన వస్తేనే చాలు ముందు నేను నిన్ను చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది.
ఆ హడావుడికి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు ఏం జరిగింది అని అడుగుతుంది కౌశికి.
యువరాజ్: వాడెవడో కేదార్ తల పగలగొడితే దానికి నేనే కారణం అంటుంది అంటాడు.
నిషిక : మా దయాదాక్షిణ్యల మీద బ్రతుకుతూ నా భర్తనే అంటావా అంటూ కౌషికి వైపు తిరిగి నేను తప్పు చేస్తే అరుస్తారు కదా తను తప్పు చేస్తే ఏమీ అనరా అని నిలదీస్తుంది.
కౌషికి : నువ్వు చేసింది తప్పు, సాక్షాలు లేకుండా ఒక మనిషి మీద నింద వేయడం పద్ధతి కాదు ధాత్రి యువరాజ్ కి సారీ చెప్పు అంటుంది.
ధాత్రి: నేను చెప్పను అంటుంది.
వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు అని చెప్పి నిషిక ధాత్రి దంపతుల లగేజ్ తీసుకువచ్చి బయటకు విసిరేస్తుంది. అందరూ బయటికి వస్తారు.
ధాత్రి: నా దగ్గర సాక్షాధారాలు ఉన్నాయి చూపిస్తాను రండి అని చెప్పి కౌషికిని తనతో పాటు తీసుకు వెళుతుంది. ఫోన్ లో యువరాజ్ సుత్తి పట్టుకుని దిగిన సీసీ ఫుటేజ్, కేదార్ ని వెంబడిస్తున్న సీ సీ ఫుటేజ్ చూపిస్తుంది.
కేదార్ : ఈ పని చేసింది ఇంకొకడు అయి ఉంటే ఈపాటికి వాడి అంతు చూసేవాడిని కానీ ఈ పని చేసింది నా తమ్ముడు అందుకే ఏమీ చేయలేకపోతున్నాను అంటాడు.
కౌషికి: నువ్వు ముందు వాడిని తమ్ముడు అనటం మానేయ్ సాక్షాదారాలు లేకుండా నువ్వు మా బాబాయ్ కి కొడుకువి కాలేవు అంటుంది. అయినా ఫాలో అయినంత మాత్రాన సుత్తి పట్టుకున్నంత మాత్రాన వాడే హంతకుడు అంటే నేను నమ్మను అంటుంది.
ధాత్రి : తమ్ముడు మీద ప్రేమ ఉండొచ్చు కానీ తప్పుల్ని కూడా వెనకేసుకొచ్చే అంత ధృతరాష్ట్ర ప్రేమ ఉండకూడదు. సరే మీరు నమ్మకపోతే ఇదే సాక్ష్యాధారాలు నేను పోలీసులకు చూపిస్తాను అంటుంది.
కౌషికి : కొంచెం నెమ్మదించి నేను యువరాజ్ తో మాట్లాడుతాను అని అక్కడ నుంచి వెళ్ళబోతుంది.
ధాత్రి : మా లగేజ్ లోపల పెట్టించండి.. అవమానాలతో, అపనిందలతో మేము ఇంటిలోంచి బయటికి వెళ్ళలేము అంటుంది.
కౌషికి : నువ్వు చెప్పావని కాదు కేదార్ ప్రాణాల మీదకు వచ్చిందని నువ్వు చెప్పినట్లు చేస్తున్నాను అంటూ కిందికి వెళ్లి నిషికతో బయటికి విసిరేసిన లగేజ్ లోపలికి తీసుకొనిరా అని చెప్తుంది.
ఆ మాటలకి నిషిక కోపంతో రగిలిపోతుంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: ఆస్కార్ లిస్ట్‌లో ఆ మూవీ - నా గుండె పగిలిపోయింది, అదంతా రాజకీయం: విజయ్ సేతుపతి