Jagadhatri Serial Today September 25th: జగద్ధాత్రి సీరియల్: యువరాజ్ నేర చరిత్ర కౌషికి బిజినెస్కి అడ్డు వస్తుందా! నిషిక అసహనానికి కారణం?
Jagadhatri Serial Today Sep 25th కౌషికి బిజినెస్ డీల్‌కి అడ్డు వస్తాడని యువరాజ్‌ని గదిలో పెట్టి బంధించడం, నిషిని కాదని జగద్ధాత్రితో సాక్షి సంతకం పెట్టించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కౌషికి బిజినెస్ డీల్ చేసే టైంకి యువరాజ్ గురించి నెగిటివ్ న్యూస్ వస్తుంది. అది చూసిన కౌషికి యువరాజ్‌ని చాలా కోప్పడుతుంది. నేను బాబాయ్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాం.. నువ్వు మమల్ని కిందకి లాగేస్తున్నావ్.. ఇప్పుడు వచ్చే వాళ్లకి నీ నేర చరిత్ర తెలిస్తే ఒక సామాజ్రంలా స్థాపించిన కంపెనీలు అన్నీ కుప్పకూలిపోతాయి. ఇప్పుడు నేనేం చేయాలి అక్క అని యువరాజ్ అడుగుతాడు.
కౌషికి యువరాజ్‌తో నువ్వు వాళ్లకి కనిపించకూడదు. గది దాటి రాకూడదు.. నువ్వు వాళ్లకి కనిపిస్తే డీల్ క్యాన్సిల్ అయిపోతుంది. వాళ్లు ఏ టైంలో అయినా రావొచ్చు అని కౌషికి యువరాజ్‌ని తీసుకొని గదిలో పెట్టేస్తుంది. ఏం కాదు అక్కా నేను చూసుకుంటా అని యువరాజ్ అంటాడు. నిషిక యువరాజ్‌తో వదిన ఇదేం బాలేదు.. నా మొగుడిని చేతకాని వాడిలా అలా గదిలో బంధించడం బాలేదు అని అంటుంది. మొత్తం విన్నావు కదా నీకు మళ్లీ మొదటి నుంచి చెప్పే ఓపిక నాకు లేదు అని కౌషికి అంటుంది. నా భర్త పట్ల మీరు చాలా ఛీప్‌గా ప్రవర్తిస్తున్నారు అని అంటుంది.
జగద్ధాత్రి, కేథార్ వాళ్లు అక్కడికి వస్తారు. యువరాజ్ నేర చరిత్ర అందరికీ తెలిసింది కదా ఎందుకు ఇప్పుడు అంత బాధ పడుతున్నావ్ అని జగద్ధాత్రి అంటే.. దానికి నిషిక నువ్వు పెద్ద పత్తిత్తులా మాట్లాడకే. అయినా మీ అమ్మది నేర చరిత్రే కదా అయినా నిన్ను కోడల్ని చేసుకోలేదా ఇంట్లో తిరగనివ్వడం లేదా.. నిన్నేం గదిలో బంధించలేదు కదా అని అంటుంది. కేథార్ నిషికతో చాలా థ్యాంక్స్ నిషి కోపంలో అయినా జగద్ధాత్రి ఈ ఇంటి కోడలు అని అంగీకరించావ్.. ఇక వాళ్ల అమ్మ నేరుస్తురాలు కాదు ఉత్తమురాలు అని కాలమే చెప్తుంది అని అంటాడు.
సుధాకర్ నిషికతో ఇక ఏం మాట్లాడొద్దని కాసేపు వాడు లోపల ఉంటే నష్టం ఏమీ లేదు.. కౌషికి మన ఎదుగుదల కోసమే ప్రయత్నిస్తుంది అని అంటాడు. మన జీవితాలు మళ్లీ పాతగా మారకూడదు అంటే జాగ్రత్తగా ఉండాలి.. జగద్ధాత్రి నువ్వు వంట చేయ్ అని అంటుంది. నేనేం చేయాలి అని నిషిక అంటే నువ్వేం చేయకు చెప్పింది చేయ్ అని కౌషికి అంటుంది. ఎందుకు అమ్మి అంత బాధ పడతావ్.. కౌషికి కష్టపడుతూ డబ్బు సంపాదించేది నీ కోసం నా కొడుకు కోసమే కదా అందుకే ఇప్పుడు గొడవ పడకూడదు అని వైజయంతి నిషికతో చెప్తుంది. దివ్యాంక నువ్వు మా అక్క మీద పగతో నా మీద న్యూస్ వేయించి నన్ను మరింత దిగజారేలా చేశావ్ అని అనుకుంటాడు.
జగద్ధాత్రి బజ్జీలు చేస్తుంటే కేథార్ పక్కనే చేరి రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. కౌషికి, సుధాకర్ ప్రశాంత్ వాళ్ల కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో ప్రశాంత్ వాళ్ల టీమ్‌తో వస్తారు. కౌషికి స్వాగతం పలుకుతుంది. కౌషికి నిషికతో స్నాక్స్ తీసుకురమ్మని చెప్తుంది. నిషిక కోపంగా చూస్తుంది. దాంతో కౌషికి మళ్లీ చెప్తుంది. నిషిక వెళ్లకపోతే వైజయంతి వెళ్లమని చెప్తే నిషి కదలదు మీరు నాకే చెప్తారా అంటే నువ్వు తెచ్చి ఇవ్వకు అమ్మీ వాళ్లకి చెప్పు సరిపోతుందని నిషికకు పంపిస్తుంది. నిషిక వెళ్లి వదిన చేయమంది చేశారా.. వంటింట్లో మీ సరసాలు ఏంటి.. త్వరగా తీసుకురండి అని చెప్తుంది.
కేథార్ జగద్ధాత్రితో యువరాజ్‌ని అక్క గదిలో పెట్టింది కదా ఆ మంటే ఇది అంటాడు. ఇక జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ స్నాక్స్ తీసుకెళ్లి ఇస్తారు. ప్రశాంత్ వాళ్లు తిని అదిరిపోయిందని అంటాడు. ఇక ప్రశాంత్ వీళ్లు ఎవరూ అని అడుగుతారు. దాంతో కౌషికి మా తమ్ముడు, మరదలు అని చెప్తుంది. జగద్ధాత్రి, కేథార్ సంతోషిస్తే నిషిక, వైజయంతి కోపంతో ఉంటారు. ఆవిడ కంటికి నేను కూడా కనిపించడం లేదన్నమాట అని నిషిక అంటే చిన్న చిన్న వాటికి ఎందుకమ్మా నీకు పిలిచి పెద్ద బాధ్యతలు ఇస్తుందని అంటుంది.
కౌషికి, ప్రశాంత్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. ప్రశాంత్ కౌషికి ప్రజంటేషన్‌కి ఇంప్రెస్ అయి డీల్ ఒకే అంటాడు. అగ్రిమెంట్ చేసుకుందామని చెప్తాడు. ప్రశాంత్, కౌషికి, సుధాకర్ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టుకుంటారు. ఇక ప్రశాంత్ బిజినెస్ డీల్‌కి సాక్షి సంతకం ఉంటే బెటర్ అని మీకు నమ్మకం ఉన్న వాళ్లకి సాక్షి సంతకం పెట్టించమని అంటాడు. నిషిక తననే పిలుస్తుందని అనుకొని చాలా సంబరపడిపోతుంది. వైజయంతి నిషికతో నీకు ఎంత గౌరవం ఇస్తుందో చూడు అని అంటుంది. కానీ కౌషికి జగద్ధాత్రిని పిలుస్తుంది.
ప్రశాంత్ కూడా జగద్ధాత్రి కంటే నమ్మకమైన వాళ్లు ఎవరూ అని అంటాడు. నేను కనిపించడం లేదా వదినా నీకు అని నిషిక అడుగుతుంది. సుధాకర్ ఒక్క మాట కూడా మాట్లాడొద్దని అంటాడు. ప్రశాంత్ తను ఎవరు అంటే ఆమె బిజినెస్‌లో అంత ఇంపార్టెంట్ కాదని కౌషికి చెప్తుంది. ఇక జగద్ధాత్రి సాక్షి సంతకాలు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















