Jagadhatri Serial Today September 24th: జగద్ధాత్రి సీరియల్: హోంమినిస్టర్ చెంప పగలగొట్టిన జేడీ! శ్రీవల్లిని దారుణంగా అవమానించిన సవతి తల్లి!
Jagadhatri Serial Today Episode September 24th జేడీనే విక్కీని చంపిందని తాయారు గన్ తీసుకొని జేడీ మీదకు వెళ్లడం జేడీ హోంమినిస్టర్ చెంప చెల్లుమనిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode విక్కీని దారుణంగా హింసించి చంపారని డాక్టర్ చెప్తుంది. ఎవరు నా కొడుకుని ఇంత దారుణంగా చంపింది అని హోంమినిస్టర్ తాయారు అడిగితే దుండగులు మేడం అని కేడీ అంటాడు. వీక్కీ బాబుని దుండగులు ఎత్తుకెళ్లిపోయారని నిన్ను మీరే చెప్పారు కదా మేడం అని కేడీ అంటాడు.
తాయారు ఆవేశంగా వాళ్లే చంపారా అని అడుగుతుంది. అంతే కదా మేడం.. వాళ్ల నుంచి విక్కీ బాబుని కాపాడటానికి పది బృందాలుగా విడిపోయి వెతికాం అయినా ఫలితం లేకుండా పోయింది అని జేడీ అంటుంది. జేడీ దుండగుల పేరు వాడుకుంటున్నారు కదా నేను నమ్మను అని తాయారు అంటుంది. దానికి జేడీ నమ్మాలి మేడం నిన్ను మీరు చెప్పినప్పుడు మేం కూడా నమ్మాం కదా మేం చేశాం అనుకుంటున్నారా.. అయితే ఇది చేసింది దుండగులు కాదు అంటారా.. మీరే లేని దుండగుల్ని సృష్టించారా.. అది నిజం అయితే ఇది నిజమే అది అబద్ధం అయితే ఇది అబద్ధమే అని జేడీ అంటుంది. అయినా మీ కొడుకు ఏమైనా ఉత్తముడా చేయని పాపాలు లేవు.. వీడు ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాడు అని తెలిసి కూడా వదిలేశారు అప్పుడే మీరు వాడిని సరిచేసుంటే ఈ బాధ ఉండేది.. మళ్లీ ఆడపిల్ల జోలికి వచ్చాడు ఎవరో చంపేశారు అని జేడీ అంటుంది.
నా కొడుకుని మీరే చంపేశారు అని తాయారు అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం అని జేడీ అంటుంది. సాక్ష్యం ఏంటి అని జేడీ అంటే ఆ సాక్ష్యాలు కూడా మీరే కనిపెడతారు కదా అని మీరే చంపేశారు అని అంటుంది జేడీ. నా కొడుకుని మీరే చంపేసి నాటకాలు ఆడుతున్నారని జేడీ పీక పట్టుకుంటుంది తాయారు. తప్పు చేస్తున్నారు మేడం అని కేడీ అంటాడు. సాధుసార్ వదలమని అంటాడు. నాకొడుకుని చంపి నాకు తీరని బాధ మిగిల్చారు నిన్ను వదలను చంపేస్తా అని తన గన్‌మెన్ గెన్ తీసుకొని జేడీని గురి పెడుతుంది.
జేడీ తాయారుకి లాగిపెట్టి కొడుతుంది. తాయారు వెళ్లి కొడుకు శవం మీద పడుతుంది. నన్నే కొడతావా నేను హోం మినిస్టర్ అంటే అయితే ఏంటి.. చీఫ్ మినిస్టర్ అయినా ఇలాంటి పనులు చేస్తే వదిలేదు లేదు.. పోయిన కొడుకుకి దహన సంస్కారాలు చేసుకోండి.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరు అని కూడా చూడను మైండ్ ఇట్ అని జేడీ తన టీమ్‌ని తీసుకొని వెళ్లిపోతుంది. తాయారు కొడుకు కొడుకు శవంతో నిన్ను చంపిన వాళ్లని వదలను అని అనుకుంటుంది. సాధుసార్ జేడీ, కేడీలతో అలాంటి నీచుడు భూమ్మీద తిరగకూడదు మంచి పని చేశారు.. ఆ హోంమినిస్టర్ మిమల్ని ఏం చేయలేక మీ ఫ్యామిలీ మీద పడుతుంది వాళ్లని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు.
కౌషికి ఇంట్లో అందరూ కలిసి భోజనాలు చేస్తుంటారు. వైజయంతి వీలైనంత త్వరగా శ్రీవల్లిని ఇంటి నుంచి గెంటేయాలని అనుకుంటుంది. ఇంతలో శ్రీవల్లి వచ్చి కౌషికితో అక్క బాబు పడుకున్నాడు అని చెప్తుంది. కౌషికి వచ్చి భోజనం చేయమని చెప్తుంది. శ్రీవల్లి వైజయంతి పక్కన కూర్చొబోతే వైజయంతి తోసేస్తుంది. అదో అనాథ మనతో పాటు మా పక్కన కూర్చొవడం ఏంటి అని అందరితో అంటుంది. హద్దులు దాటొద్దని మన స్థాయి దానికి లేదని నిషిక అంటుంది. అక్క ఈరోజు సంతోషంగా ఉండటానికి కారణం తనే అని కేథార్ అంటాడు.
కేథార్ శ్రీవల్లితో ఎవరు ఏమన్నా నువ్వు నా సొంత చెల్లి లాంటి దానివి నేను అలాగే భావిస్తున్నా నువ్వు రామ్మా అని శ్రీవల్లిని తీసుకొని సుధాకర్ పక్కన కేథార్ కూర్చొపెట్టి పక్కన కేథార్ కూర్చొంటాడు. వైజయంతి మనసులు దాన్ని ఇప్పుడే ఇలా చూస్తున్నాడు.. అదే ఈ శ్రీవల్లి కేథార్‌కి సొంత చెల్లి అని తెలిస్తే ఇంకెలా చూసుకుంటాడో అని అనుకుంటుంది. శ్రీవల్లి ఏడుస్తూ ఇప్పటి వరకు అందరూ నన్ను అనాథ అన్నారు నువ్వు సొంత చెల్లి అనగానే ఏడుపొస్తుంది అన్నయ్యా అని శ్రీవల్లి ఏడుస్తుంది. నువ్వు కూడా సొంత అన్నయ్య అనుకో అని జగద్ధాత్రి చెప్తుంది.
శ్రీవల్లి భోజనం చేసే టైంకి నువ్వు అనాథవి తల్లీ నీకు సిగ్గు పౌరుషం లేదు.. తోసేసినా సిగ్గు లేకుండా తినేస్తున్నావ్ అని శ్రీవల్లిని వైజయంతి నానా మాటలు అంటుంది. ఇంకొక్క మాట తనని అంటే నేను ఊరుకోను అని సుధాకర్ అంటాడు. అన్నీ పట్టించుకోవద్దని అవన్నీ గాలి మాటలు అని చెప్తాడు. దానికి శ్రీవల్లి నేను అనాథాశ్రమంలో చాలా మాటలు పడ్డాను అని అంటుంది. కౌషికి వైజయంతి వాళ్లతో తను నా కోసం వచ్చింది నా మనిషి నా ముఖం అయినా చూసి తనని ఏం అనకుండా ఉండండి అని రేపు మన ఇంటికి ముంబయి నుంచి ఓ పెద్ద కంపెనీ వాళ్లు వస్తున్నారు ఆ ఏర్పాట్లు చూడండి అని కౌషికి కోపంగా వెళ్లిపోతుంది.
వైజయంతి వాళ్లు కూడా విసురుగా కడుపు నిండిపోయింది అని వెళ్లిపోతారు. అవేమీ పట్టించుకోవద్దు నువ్వు తినమ్మా అని సుధాకర్ చెప్తాడు. శ్రీవల్లి మనసులో నాకు అన్నయ్య ఉంటే ఇలాగే ఉండేవాడు.. మా నాన్న కూడా ఇంతే ప్రేమగా చూసుకునేవాళ్లేమో అనుకుంటుంది. ఇంతలో సుధాకర్ పొలమారుతాడు. శ్రీవల్లి నీరు ఇచ్చి అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అయ్యగారు మాట్లాడితే మెతుకులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతాయంట అప్పుడు ఇలాగే అవుతుంది అంట అని అంటుంది. సుధాకర్ గతంలోకి వెళ్లి ఈ అమ్మాయి ఏంటి అచ్చం సుహాసిని చెప్పినట్లు చెప్పింది అని ఆలోచిస్తాడు.
కౌషికితో పాటు అందరూ ఉదయం ముంబయి నుంచి రానున్న కంపెనీ వాళ్ల కోసం ఎదురు చూస్తుంటుంది. ఈ డీల్ ఓకే అయితే మనకు చాలా లాభం ఉంటుందని అందుకే చాలా ఎగ్జైట్ అవుతున్నా అని కౌషికి చెప్తుంది. మరోవైపు టీవీ చూస్తున్న సుధాకర్ ఓ ఛానెల్ పెడితే అందులో యువరాజ్ మాదకద్రవ్యాలు లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాడు యువరాజ్ అక్క ఓ పెద్ద ఛానెల్ సీఈఓ అవ్వడంతో యువరాజ్‌కి శిక్ష పడకుండా చేస్తుందని అంటాడు. నీ వల్లే ఇదంతా అని కౌషికి అరుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















