Jagadhatri Serial Today October 22nd: జగద్ధాత్రి సీరియల్: యువరాజ్ ప్రాణాలకు ముప్పు! సీఐ రహస్యం బట్టబయలు, కేథార్ కోసం జేడీ-కేడీల పోరాటం!
Jagadhatri Serial Today Episode October 22nd జేడీ, కేడీలు యువరాజ్‌ని కాపాడటం బెయిల్ మీద ఇంటికి పంపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి, కేథార్‌కి మీనన్, తాయారు యువరాజ్‌ని పోలీస్ స్టేషన్‌లో చంపాలని ప్రయత్నిస్తున్నారని అర్థమైపోతుంది. జేడీ కౌషికితో మాట్లాడి మీ తమ్ముడిని మేం కాపాడుతాం కానీ ఆయన మాకు సపోర్ట్ చేయాలి అని చెప్తుంది. బెయిల్ గురించి తెలిసి సీఐ ఇంటికి జగద్ధాత్రి, కేథార్‌లు జేడీ, కేడీలుగా వెళ్తారు.
సీఐ చక్కగా మెగాస్టార్ పాటలు పెట్టుకొని ఎంజాయ చేస్తుంటాడు. జేడీ, కేడీలు సీఐ ఇంటికి వెళ్తారు. సీఐ భార్య విషయం చెప్పడంతో సీఐ మీనన్ చెప్పినట్లు చేతికి కాలికి బ్యాండేజ్ చుట్టేసి యాక్సిడెంట్ అయిందని జేడీ, కేడీలతో చెప్తాడు. జేడీ, కేడీలు యువరాజ్‌కి బెయిల్ రెడీగా ఉంది.. మీరు సంతకం పెడితే చాలు అని బెయిల్ పేపర్లు చూపిస్తారు. సీఐ తన కండీషన్ బాలేదని సంతకం పెట్టలేను అని అంటాడు. జేడీకి మేటర్ అర్థమైపోతుంది. యాక్సిడెంట్ అయి ఎన్నిరోజులు అయింది అని కేడీ అడిగితే 3 రోజులు అయింది అని 30 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారని అంటాడు. రెస్ట్ తీసుకోండి అని చెప్పి జేడీ, కేడీలు వెళ్లిపోతారు.
సీఐకి అసలు యాక్సిడెంట్‌నే కాలేదు అని జేడీ కేడీలు అనుకుంటారు. ఇక రోడ్డు మీద ఓ కారు బాబుని ఢీ కొట్టడానికి వస్తే జేడీ కాపాడుతుంది. అది కౌషికి చూస్తుంది. జేడీ దగ్గరకు వచ్చి ఏం కాలేదు కదా అని అంటుంది. చిన్న దెబ్బ అంతే అని కౌషికి అంటుంది. నిషిక పోలీస్ స్టేషన్‌కి వెళ్తాను అంటే సరే తీసుకెళ్లండి అని జేడీ అంటుంది. ఇక జేడీ కాపాడిన బాబు సీఐ కొడుకు. జేడీ బాబుతో మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది కదా అంటే లేదు ఉదయం పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్లారని అంటాడు.
కేథార్ సీఐకి కాల్ చేసి మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది త్వరగా రండి అని చెప్పడంతో సీఐ పరుగున వస్తాడు. జేడీ, కేడీలు బాబుని కారులో కూర్చొపెట్టి చాక్లెట్స్ ఇస్తారు. కేడీ చెప్పిన అడ్రస్‌కి సీఐ వస్తాడు. కేడీ సీఐకి కాల్ చేసి లొకేషన్‌కి రమ్మని అంటాడు. జేడీ, కేడీలు బాబుని వాళ్లకి అప్పగిస్తారు. సీఐ తలదించుకుంటాడు. కాలు చేయి విరిగిపోయి 30 రోజులు కోలుకోలేని వాళ్లు ఎలా వచ్చేశారు అంటే సీఐ సారీ చెప్పి బెయిల్ పేపర్ల మీద సంతకం పెడతాడు. విషయం ఎక్కడా చెప్పొద్దని చెప్తాడు.
జేడీ, కేడీలు బెయిల్ కోసం స్టేషన్‌కి వెళ్తారు. ఇక మరో ఆఫీసర్ డ్రగ్స్‌తో దొరికిన ఇద్దర్ని తీసుకొచ్చి యువరాజ్ ఉన్న సెల్‌లో వేస్తాడు. ఆ వ్యక్తి డ్రగ్స్ యువరాజు దగ్గర దాచానని చెప్తాడు. దాంతో లేడీ పోలీస్ యువరాజ్‌ని చంపడానికి గన్ గురి పెడుతుంది. మీనన్ ప్లాన్ అని అర్థమైన యువరాజ్ మీనన్ అని గన్ లాక్కొని కొట్టి బయటకు వెళ్తాడు. డ్రగ్స్ అని వచ్చిన వాళ్లు భాయ్‌కే ఎదురు తిరుగుతావా యువరాజ్‌ని చంపాలని కత్తి తీస్తారు. ఇంతలో జేడీ వచ్చి రౌడీ చేయి పట్టి నలిపేస్తుంది. యువరాజ్‌ని కొట్టిన పోలీసుల్ని కేడీ చితక్కొడతాడు. జేడీ, కేడీ ఇద్దరూ కేథార్‌ని కాపాడుతారు.
కౌషికి, వైజయంతిలు మొత్తం చూసి షాక్ అయిపోతారు. రౌడీలు పారిపోతారు. బెయిల్ ఇచ్చి యువరాజ్‌ని తీసుకెళ్లమని అంటారు. రెండు రోజులే బెయిల్ టైం అని చెప్తారు. వైజయంతి కొడుకుని తలచుకొని ఏడుస్తుంది. ఇంతలో నిషిక వైజయంతికి కాల్ చేసి యువరాజ్‌కి ఏ ప్రమాదం లేదని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















