Nuvvunte Naa Jathaga Serial Today October 22nd: నువ్వుంటే నా జతగా: పాపాత్మురాలా నా కొడుకు జీవితం నాశనం చేసేశావే: మిథునపై శారద ఫైర్
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 22nd మిథున దేవాని అరెస్ట్ చేయించిందని కోపంతో శారద మిథునని నానా మాటలు అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవాని అరెస్ట్ చేయించిందని శారద చాలా కోపంగా ఉంటుంది. మిథున ఇంట్లోకి వెళ్తుంటే ఆపుతుంది. ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ అని అడుగుతుంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి దేవాకి వ్యతిరేకంగా సాక్షి సంతకం పెట్టి వస్తున్నా అని ధైర్యంగా చెప్పండి మిథునా మేడం అని కాంతం అంటుంది. మిథున నువ్వు నిజంగా దేవాకి వ్యతిరేకంగా సాక్షి సంతకం పెట్టావా అని ప్రమోదిని అడిగితే అవును అని మిథున తలూపుతుంది.
శారద కోపంతో మిథునని దుర్మార్గురాలా.. ఎందుకు నా కొడుకు ప్రాణాలతో ఆడుకుంటున్నావ్.. వాడు చావాలి అనే నీ కోరికా.. వాడి మీద పగ తీర్చుకోవాలని ఇన్నాళ్లు కాచుకు కూర్చొన్నావా.. అందుకే ఈ ఇంటికి వచ్చావా అని అడుగుతుంది. అత్తయ్యా మీకు ఆయన కొడుకు అయితే నాకు భర్త.. నా భర్త క్షేమంగా ఉండాలి అని తపన పడతాను కానీ ప్రాణాలు పోవాలి అని ఎందుకు అనుకుంటాను అని మిథున అంటుంది. ఆయన బయట ఉంటే ఆ ఎమ్మెల్యే మనుషులు అతన్ని చంపేయాలని చూస్తారు. అందుకే కొన్నాళ్లు ఆయన లోపల ఉంటే ఏం కాదు అని ఈ నిర్ణయం తీసుకున్నా అంటుంది.
జైలుకి వెళ్తే ఏడు ఎనిమిది ఏళ్లు శిక్ష వేస్తారు అని ఆనంద్ అంటే త్వరలోనే మంచి లాయర్‌ని పెట్టి తీసుకొస్తా అని మిథున అంటుంది. ఏంటి తీసుకొచ్చేది.. అక్కడ జడ్జి మీ నాన్నే.. ఆయనకు ఉన్న కోపంతో ఎన్ని ఏళ్లు శిక్ష వేస్తారో తెలీదు దేవా ఇక బయటకు రావడం కష్టమే అని కాంతం అంటుంది. దేవాని బలి చేయడానికి ఈవిడ ఈమె నాన్న ఈ ప్లాన్ చేశారు అని కాంతం అంటే నాకు అదే అనుమానం ఉంది అని శారద అంటుంది. అత్తయ్యా మీరు కూడానా అని మిథున అంటే ఓసేయ్ పాపాత్మురాలా.. బలవంతంగా తాళి కట్టినా చావు అయినా బతుకు అయినా దేవాతోనే అన్నావ్ కదా అవన్నీ నాటకాలేనా.. అవన్నీ మాయమాటలేనా.. అవన్నీ నమ్మించి గొంతు కోయడం కోసమేనా అని అడుగుతుంది. నీ లాంటి మంచి భార్య వాడికి దొరికింది అని సంబర పడిపోయా.. కానీ అదంతా నీ నమ్మకద్రోహం అనుకోలేదు. నమ్మించి ఇలా చేయడానికి నువ్వు అసలు ఆడపిల్లవేనా అని తిడుతుంది.
మిథున అత్తమాటలకు ఏడుస్తూ మా ఆయన ప్రాణాలతో ఉండాలి అని ఇలా చేశాను కానీ నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు అని అంటుంది. నువ్వు మాకు మంచి చేసుండొచ్చు.. నా కొడుకుని మార్చాలి అని చూడొచ్చు.. కానీ నీ వల్ల నా కొడుకు భవిష్యత్ నాశనం అవుతుంటే నువ్వు నాకు వద్దు.. నా కొడుకు తర్వాతే ఎవరైనా నువ్వు నా కొడుకుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే ఇప్పటి వరకు అమ్మని చూసిన నువ్వు నాలో రాక్షసిని చూస్తావ్.. నా కొడుకుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా చెప్పవా చెప్పు అని అడుగుతుంది. మిథున ఏం చెప్పకుండా ఇంట్లోకి వెళ్లిపోతుంది. నా కొడుకుని నాకు దూరం చేయొద్దు అని శారద ఏడుస్తుంది.
రాహుల్, త్రిపురలు హరివర్ధన్‌తో మాట్లాడుతారు. మిథున దేవాలను విడదీయడానికి ఇదొక గొప్ప అవకాశం అని అనుకుంటారు. దేవా కేసు మీ బెంచ్‌కి వస్తుంది కాబట్టి వాడిని లైఫ్ లాంగ్ జైలులో ఉండేలా చేయమని అంటాడు. లలిత వచ్చి మీ నాన్నకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు మీకు బుద్ధి ఉందా అని తిడుతుంది. ఎమ్మెల్యే కొడుకుని కొట్టాడు వాడిని ఆ ఎమ్మెల్యే అంత ఈజీగా వదలదు అని రాహుల్ అంటాడు. నాన్న వాడికి లైఫ్ లాంగ్ శిక్ష వేస్తారా అని అడిగితే హరివర్ధన్ సైలెంగ్గా వెళ్లిపోతాడు. ఏంటి నాన్న ఏం చెప్పలేదు అని రాహుల్ అంటే దానికి త్రిపుర మీనాన్న కోర్టు విషయాలు ఇంట్లో మాట్లాడరు కదా అని అంటుంది. అలంకృత తల్లితో నాన్న తప్పుడు తీర్పులు ఇవ్వరు అమ్మా బావ ఏం తప్పు చేయలేదు నిర్దోషిగా బయటకు వస్తారు అని అంటుంది.
మిథున దేవా ఫోటో చూసి ఏడుస్తుంది. ప్రమోదిని మిథున దగ్గరకు వచ్చి పాలు తాగమని ఇస్తుంది. మిథున వద్దు అనేస్తుంది. మాట్లాడటానికి అయినా శక్తి కావాలి కదా అని ప్రమోదిని పాలు తాగిస్తుంది. అందరూ మిథున ఏంటి దేవాని అరెస్ట్ చేయించింది తన ఆలోచన తప్పు అంటున్నారు.. కానీ దేవా అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ నువ్వు ఎందుకు దేవాని అరెస్ట్ చేయించావో నాకు అర్థం కావడం లేదు మిథున అని ప్రమోదిని అంటుంది. అక్కా మనకి కావాల్సిన వాళ్లకి యాక్సిడెంట్ అయి బతికే ఉన్నాడు కానీ కాళ్లు చేతులు పని చేయవు అంటే ఏం చేస్తావ్ అక్క అని మిథున అడుగుతుంది. దానికి ప్రమోదిని పోనీలే ప్రాణం అయినా ఉంది కదా అని సంతోషపడతామని అంటుంది. నేను చేస్తుంది అదే అక్క మిథున చెప్తుంది. దేవుడమ్మ వదలదు అక్క కనీసం జైలులో అయినా నా దేవ ప్రాణాలతో ఉంటాడు కదా అక్క అని మిథున అంటే ప్రమోదిని మిథునని హత్తుకొని ఏడుస్తుంది. నువ్వు చేస్తుంది కరెక్ట్ అని చెప్తుంది.
ఉదయం దేవాని కోర్టుకి తీసుకొస్తారు. మిథున దేవా దగ్గరకు వెళ్తుంది. నాకు శిక్ష పడాలి నేను జైలుకి వెళ్లాలి అనే కదా నువ్వు సాక్ష్యం చెప్తున్నావ్ మరి ఆ కన్నీళ్లు ఎందుకు అని అడుగుతాడు. నన్ను ఆపార్థం చేసుకోకు దేవా అని మిథున అంటుంది. భవిష్యత్‌లో నువ్వే నన్ను అర్థం చేసుకుంటావ్ అని మిథున అంటే దానికి దేవా నేను ఎమ్మెల్యే కొడుకుని దారుణంగా కొట్టాను అని నువ్వు అనుకుంటున్నావ్ కానీ కారణం లేకుండా నేనేం చేయను అని నీకు తెలిసిన రోజు నేనేంటో నీకు తెలుస్తుంది. నువ్వే పశ్చాత్తాప పడతావ్ అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















