(Source: ECI | ABP NEWS)
Illu Illalu Pillalu Serial Today October 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కాపాడిన శోభ కిడ్నాప్! నింద ధీరజ్ మీదకు వస్తుందా! వల్లీ భయమేంటి?
Illu Illalu Pillalu Serial Today Episode October 22nd శోభని ధీరజ్ కాపాడటం కానీ ధీరజ్ వెళ్లిపోయిన తర్వాత శోభని తన ఫ్రెండ్స్ కిడ్నాప్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ధీరజ్ క్యాబ్‌లో శోభాతో పాటు ఇద్దరు అబ్బాయిలు ఎక్కుతారు. శోభ తన ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారని అబ్బాయిల్ని అడుగుతుంది. వస్తారు అని చెప్పి అక్కడెక్కుతారు ఇక్కడెక్కుతారు అని చెప్తారు. శోభకి డౌట్ వచ్చి అడుగుతుంది.
గౌతమికి ఫోన్ చేయాలని శోభ ఫోన్ తీస్తే అజయ్ ఫోన్ లాక్కుంటాడు. సర్‌ఫ్రైజ్ ఉంది నువ్వు మిస్ అయిపోతావ్ అని అంటాడు. శోభ చాలా టెన్షన్ పడుతుంది. గౌతమి, అంజలి ముందే అన్నవరం వెళ్లిపోయారని చెప్తారు. అదేంటి అని శోభ కంగారు పడుతుంది.
అమూల్య తన గురించి ప్రేమకి చెప్పేసిందని శ్రీవల్లి చాలా టెన్షన్ పడుతుంటుంది. పార్టీ రోజు రాత్రి ప్రేమ వల్లీని పెట్టిన టార్చర్ గుర్తు చేసుకొని ప్రేమ అంటేనే భయపడుతుంది. ఇంతలో ప్రేమ వచ్చి ఎదురుగా నిల్చొంటుంది. వల్లీ చాలా భయపడుతూ మెల్లగా వెళ్లిపోతుంది. వల్లీ కిచెన్లో ఉంటే ప్రేమ అక్కడికి వెళ్తుంది. వల్లీ ఎక్కడికి వెళ్తే ప్రేమ అక్కడికి వెళ్తుంది. అమూల్యని ఎక్కడికి తీసుకెళ్లావ్ అని ప్రేమ అడుగుతుంది. జాతర చూడటానికి వెళ్లాం అని కంగారు పడుతూ చెప్తుంది వల్లీ. మా అన్నయ్య అమూల్యతో మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు అక్కడలేవు.. అమూల్యని ఒంటరిగా ఎందుకు వదిలేశావ్ అని అడుగుతుంది. వాష్రూమ్కి వెళ్లా అని వల్లీ చెప్పడంతో నువ్వు చెప్పేవి అబద్ధం అని నాకు తెలుసు నీ మీద నాకు చాలా కోపం వస్తుంది అని ప్రేమ అంటుంది. నీ విశ్వరూపం చూసేశా నాకు చాలా భయంగా ఉందని వల్లీ అంటుంది. నేను అమాయకురాలిని నన్ను అనవసరంగా ఏమైనా అంటే దేవుడు ఊరుకోడు చెప్పి అక్కడి నుంచి జారుకుంటుంది.
శోభ కూర్చొన్న బ్యాక్ సీట్‌కి మరో అబ్బాయి కూడా వెళ్లి కూర్చొంటాడు. పాపికొండలు వెళ్లి రెండు రోజులు వెళ్దాం అని అంటారు. వద్దు నాకు డౌట్ వస్తుంది అని శోభా అంటుంది. ఇక ఇద్దరూ శోభతో తప్పుగా ప్రవరిస్తారు. మీద మీద పడుతూ రాసుకొని పూసుకొని కూర్చొంటారు. అదంతా చూసిన ధీరజ్ కారు సైడ్‌కి ఆపేస్తాడు. ఏమైందని వాళ్లు అడిగితే కారు ఆగిపోయింది అని చెప్తాడు. ధీరజ్ దిగి అమ్మాయి ఏదో టెన్షన్‌లో ఉన్నట్లు ఉంది అని కారు ప్రాబ్లమ్‌లో ఉందని చెప్పి కారు నెట్టమని ఇద్దరు అబ్బాయిలతో చెప్తాడు. వాళ్లు కిందకి దిగి కారు నెట్టగానే ధీరజ్ వాళ్లని బయటకు దింపేసి కారు పోనిస్తాడు.
ధీరజ్ ఆ అమ్మాయితో వాళ్ల మీద డౌట్ వచ్చి వచ్చేశా అంటాడు. థ్యాంక్స్ అన్నయ్యా నాకు అదే డౌట్ అని చెప్తుంది. శోభ గౌతమికి కాల్ చేస్తే అసలు వాళ్లు ట్రిప్‌కి వెళ్లలేదు అని చెప్తారు. శోభ షాక్ అయి అన్నయ్యా అని ధీరజ్‌కి విషయం చెప్తుంది. దాంతో ధీరజ్ నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్తాడు. శోభ ఇంటికి దగ్గర్లో దిగి ధీరజ్‌కి థ్యాంక్స్ చెప్పి దేవుడిలా నన్ను కాపాడారని చెప్పి వెళ్తుంది. ధీరజ్ వెళ్లగానే అజయ్ వాళ్లు వచ్చి శోభని ఎత్తుకెళ్లిపోతారు.
ప్రేమ తనని ఏం చేస్తుందో అని వల్లీ టెన్షన్ పడుతుంది. ఇంట్లో మామయ్య మాత్రమే మందు తాగుతారు కాబట్టి అది దాచేస్తే ఇక ఏ ప్రాబ్లమ్ ఉండదు అని మందు బాటిల్స్ అన్నీ దాచేస్తుంది. రామరాజు మందు తాగుతూ ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















