Ammayi garu Serial Today October 21st: అమ్మాయిగారు సీరియల్: కోమలి నిశ్చితార్థం రింగ్ తీసుకున్న రూప! కోమలి కొంగు చుట్టూ రాజు!
Ammayi garu Serial Today Episode October 21st రాజు తాయొత్తు ప్రభావంతో కోమలిని అమ్మాయిగారు అని రూపతో ఉన్నట్లు కోమలితో ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode కోమలి పూజ చేస్తుంటే రూప వచ్చి కాపురాలు కూల్చాలి అని వచ్చిన నీకు ఆ అర్హత మర్యాదగా ఇంటి నుంచి వెళ్లిపో అని అంటుంది. నేను వచ్చిన పని పూర్తయితే వెళ్లిపోతా అని కోమలి అంటుంది. నిన్ను ఎలా పంపాలో నాకు తెలుసు అని రూప అంటే ఆ మాట అటు చూసి చెప్పు అని సూర్యప్రతాప్‌ని చూపిస్తుంది.
కోమలి అందరికీ హారతి ఇస్తుంది. రూపకి కూడా ఇస్తుంది. ఇక రూప హారతి తీసుకొని ఆగు రూపక్కా అని కోమలిని ఆపి కోమలి చేతికి ఉన్న నిశ్చితార్థం ఉంగరం పట్టుకొని అక్కా ఈ ఉంగరం ఏంటి కొత్తగా ఉంది అని అడుగుతుంది. అందరి ముందు నన్ను ఇరికించేలా ఉందని కోమలి అనుకుంటుంది. ఈ రింగ్ ఎప్పుడు తీసుకున్నావ్ అక్క చాలా బాగుంది ఎప్పుడు తీసుకున్నావ్ ఎప్పుడు తీసుకున్నావ్ అని కోమలి చేతిలో ఉన్న రింగ్ తీసేస్తుంది. ఏయ్ ఆ రింగ్ ఇవ్వు రుక్మిణి అని కోమలి అంటుంది. ఇస్తా ఉండు చూస్తా ఉంటే చాలా ఖరీదైన రింగ్‌లా ఉందే అని సూర్యప్రతాప్ దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తుంది.
కోమలి దొరికిపోయేలా ఉందని విజయాంబిక, దీపక్ అనుకుంటారు. సూర్యప్రతాప్‌తో రుక్మిణి నాయనా నువ్వు ఏమైనా కొనిపెట్టావా.. నాయనా ఈ రింగ్ చూశావా ఏదో నిశ్చితార్థం రోజు అబ్బాయి అమ్మాయికి పెట్టినట్లు లేదూ అని ఇరికిస్తుంది. సూర్యప్రతాప్ కోమలితో చెప్పు రూప ఈ రింగ్ నీకు ఎక్కడిది.. దాని కోసం ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావ్ చెప్పు అని అడుగుతారు. కోమలి చాలా భయపడుతుంది. ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి నేనే కొనుకున్నా నాన్న.. మీకు చెప్తే ఏం అంటారో అని చెప్పలేదు అని కోమలి చెప్తుంది. మనసులో రూపని చూసి నన్ను ఇరికించాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యావ్ కదా నేను దొరకను అని అంటుంది. సూర్యప్రతాప్ కోమలితో రూప ఇదంతా నాదే కదా నువ్వు ఎందుకు అప్పు చేయడం అని చంద్రకి ఆ అప్పు తీర్చేయమని ఎప్పుడు ఏం అవసరం ఉన్నా బాబాయ్‌కి అడుగు అని అంటాడు.
కోమలి రూపతో రుక్మిణి ఆ ఉంగరం నాకు ఇచ్చేయ్ అని అంటుంది. రూప ఇచ్చినట్లే ఇచ్చి ఈ ఉంగరం నాకు చాలా బాగా నచ్చింది నేను తీసుకుంటా నువ్వు వేరేది తీసుకో అని అంటుంది. నాకు అది బాగా నచ్చింది నాకు ఇచ్చేయ్ కావాలి అంటే నేను ఇంకోటి అలాంటిదే కొనిస్తా అని అంటుంది. సూర్యప్రతాప్ కలుగ జేసుకొని ఇచ్చేయ్ అమ్మా చెల్లే అడుగుతుంది కదా అని అంటాడు. ఇంతలో రాజు వచ్చి ఏం జరుగుతుంది అని అడుగుతాడు. కోమలి దగ్గరకు వెళ్లి అమ్మాయి గారు ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతాడు. రాజు కోమలిని అమ్మాయి గారు అనడంతో అందరూ బిత్తరపోతారు.
సూర్యప్రతాప్ మనసులో రాజు, రూప ఒక్కటైపోయారు ఇక నాకు ఏం బాధ లేదు అని అనుకుంటాడు. తాయొత్తు పని చేస్తుంది అని కోమలి అనుకుంటుంది. కోమలి రాజుకి కూడా హారతి ఇస్తే రాజు తీసుకొని కోమలితో అమ్మాయి గారు ఆకలేస్తుంది టిఫెన్ తిందాం అంటాడు. రూప, విరూపాక్షి వాళ్లు చాలా కంగారు పడతారు. కోమలి, రాజు చేతులు పట్టుకొని వెళ్లడం చూసి రూప షాక్ అయిపోతుంది. కోమలి దగ్గరుండి రాజుకి టిఫెన్ పెట్టడం రాజు కోమలిని పక్కన కూర్చొపెట్టుకొని టిఫెన్ పెట్టడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రూప అయితే చాలా కంగారు పడుతుంది.
కోమలి రూపతో మీరు వచ్చి తినండి అంతే తర్వాత తింటా అని కోపంగా రూప అంటే దానికి రాజు సర్లే అమ్మాయి గారు రుక్మిణి తర్వాత తింటుంది మీరు తినండి అని అంటాడు. మందారం మనసులో రాజన్నకి ఏమైంది కోమలిని అమ్మాయిగారు అంటున్నాడు.. అమ్మాయిగారిని రుక్మిణి అంటున్నాడు అని అనుకుంటుంది. ఇక కోమలి చేయి కట్ అయిపోయింది అని తినడానికి ఇబ్బంది పడితే రాజు కోమలికి తినిపిస్తాడు. రూప చాలా చాలా బాధ పడుతుంది. రాజు రూపతో ఉన్నట్లు కోమలితో ఉంటాడు. సూర్యప్రతాప్ రాజుతో మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. అమ్మాయిగారితో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందని రాజు అంటాడు.
రూప ఓ చోట బాధపడుతుంటే విరూపాక్షి, మందారం రూపతో ఏంటి ఇదంతా రాజు నీతో ఉన్నట్లు కోమలితో ఉండటం ఏంటి.. అని అనుకుంటారు. కోమలి ఆట కట్టించడానికే ఇదంతా చేస్తున్నట్లు ఉన్నాడని మందారం అంటుంది. రూప కూడా రాజు నటిస్తున్నాడని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.






















