Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 21st: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ కోసం విహారి అన్వేషణ! యమున కలలు, సహస్ర సంతానవ్రతం!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 21st లక్ష్మీని వెతకడానికి విహారి అడవిలోకి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ కనిపించడం లేదని అంతా గుర్తిస్తారు. అడవిలోకి వెళ్లిన లక్ష్మీ ఏమైందా అని అనుకుంటారు. లక్ష్మీని ఎందుకు అడవిలోకి వెళ్లనిచ్చారు అని విహారి అంటాడు. మా నాన్న ఇచ్చిన రెండు వందల ఎకరాలు వెనక ఉన్నాయని పారిపోయిందని పద్మాక్షి అంటుంది. వీర్రాజు కూడా కరెక్ట్ అని పని మనిషికి అన్ని ఎకరాలు ఇస్తే ఇంకెందుకు ఉంటుంది అని అంటాడు.
విహారి వీర్రాజు కాలర్ పట్టుకుంటారు. లక్ష్మీ కోసం నేనే వెళ్తాను అని విహారి ఎవరు చెప్పినా వినకుండా అమ్మని తీసుకొని ఇంటికి వెళ్లండి నేను లక్ష్మీని తీసుకొని వస్తాను అని విహారి వెళ్తాడు. విహారి అడవిలోకి వెళ్లి లక్ష్మీ కోసం వెతుకుతూ నా కోసం నా వెనకాలే వచ్చి నువ్వు తప్పిపోయావా లక్ష్మీ అని విహారి అనుకుంటాడు.
యమున పోచమ్మతో లక్ష్మీకి ఏమైంది పోచమ్మ అని అంటుంది. జరగబోయేది చెప్పే అంత శక్తి నాకు లేదు కానీ లక్ష్మీ, విహారి ఇద్దరికీ ప్రాణహాని ఉందని పోచమ్మ చెప్తుంది. యమున షాక్ అయిపోతుంది. లక్ష్మీ తాళి బంధానికి నీ కొడుకు భవిష్యత్‌కి బలమైన బంధం ఉంది.. నీ కొడుకుకి లక్ష్మీ దూరం అయిన కొద్దీ ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు లక్ష్మీ ఆచూకీ తెలియాలి.. విహారి పక్కన తనుండా.. విహారి కోసం చేసే ఏ పని అయినా తనే చేయాలి.. మీరంతా వెతకండి అనీ చెప్తుంది.
విహారి లక్ష్మీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంట్లో యమున, వసుధ, చారుకేశవ అందరూ టెన్షన్ పడతారు. విహారి ఒక్కడే ఇంటికి వస్తాడు. లక్ష్మీ ఏమైందని అందరూ అడుగుతారు. లక్ష్మీ కనిపించలేదని అంటాడు. యమున వాళ్లు టెన్షన్ పడతారు. లక్ష్మీ కోసం ఎక్కడా తిరిగినా అది దొరకదు ఎందుకంటే అది పారిపోయింది అని పద్మాక్షి చెప్తుంది. రెండు వందల ఎకరాలతో జంప్ అయిపోయిందని అంటుంది. తప్పిపోయిన వాళ్ల కోసం వెతికితే దొరుకుతారు.. తప్పించుకున్న వాళ్లు దొరకరు అని అంబిక అంటుంది. లక్ష్మీ ఒక్కర్తే పారిపోయిందో ఎవరినైనా తీసుకొని పారిపోయిందో అని సహస్ర అంటే నిజనిజాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని అంటాడు. మరి నీ వెనక వెళ్లింది తిరిగి రావాలి కదా అని కాదాంబరి అంటుంది. లక్ష్మీ అలాంటిది కాదు అని యమున అంటుంది. ఆస్తి రాసిచ్చావ్ అని కాదాంబరి అంటే ఆస్తి పోతే పోయింది వదిలేయండి దరిద్రం పోయింది అని సహస్ర అంటుంది. పద్మాక్షి యమున, విహారిలను లక్ష్మీ కోసం వెతకొద్దని అంటుంది. అంబిక అయితే లక్ష్మీ ఆలోచనే చేయొద్దని అంటుంది.
యమున రాత్రి పడుకొని నిద్రలో లక్ష్మీ వచ్చేసినట్లు తనతో మాట్లాడినట్లు మందులు ఇచ్చినట్లు కల కంటుంది. నా ప్రాణాలు కోసం నువ్వు నీ ప్రాణాలు పణంగా పెట్టావ్ నీకు మేం ఎంతో రుణపడిపోయాం అని మాట్లాడుతుంది. నువ్వే నా అసలు కోడలివి జాతరలో అందరితో చెప్తాను అని అనుకుంటుంది. తీరా కల నుంచి యమున లేచి లక్ష్మీ అని ఏడుస్తుంది. నిన్ను ఆ దేవుడు రక్షించి నాదగ్గరకు పంపించాలి.. నువ్వే నా అసలైన కోడలు అని చెప్పేస్తా అంటుంది. ఉదయం లేచే సరికి సహస్ర చేయబోయే సంతాన వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి. విషయం ఏంటి అని యమున పద్మాక్షిని అడిగితే సహస్ర, విహారిలతో సంతానలక్ష్మీ పూజ చేయాలని ఇలా చేస్తే త్వరలో మన ఇంటికి బుజ్జి కృష్ణుడు వస్తాడని అంటుంది. నేను వ్రతంలో కూర్చొలేను ఏ పూజ చేయలేను అని విహారి చెప్పేస్తాడు. ఏ పనులు ఉన్నా ఈ వ్రతం తర్వాతే అని పద్మాక్షి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















