అన్వేషించండి

Nindu Manasulu Serial Today March 17th: నిండు మనసులు: గణ, ఈశ్వరిలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన ఇందిర! సంతోషంలో ప్రేరణ!

Nindu Manasulu Serial Today March 17th గణ తనని చంపాలని చూశాడని ప్రేరణ చెప్పడం ఇందిర గణ, ఈశ్వరిలకు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ లేచి ప్రేరణ దగ్గరకు వెళ్లాలి అని బయల్దేరుతాడు. మంజుల ఏడుస్తూ నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలుసా.. అసలే చావు నుంచి బయట పడ్డావని అంటుంది. ప్రేరణకు ఏమైనా అయితే నేను బతికున్నా చచ్చినట్లే అమ్మా,, నేను ప్రేరణని చూడాలి అని సిద్ధూ అంటాడు. తనకి ఏం కాదురా.. తను బాగానే ఉంది.. తన కోసం అంత ఆరాట పడుతున్నావ్ ఎందుకు.. నీ కళ్ల ముందు ఈ అమ్మ ఉంది.. చెల్లి ఉంది..మమల్ని కాదు అని తన కోసం ఎందుకు పాకులాడుతున్నావ్ అని అడుగుతుంది. 

సిద్ధూ బాధ పడుతూ నేను కాస్త ఆలస్యం చేసుంటే నేను ఉన్న ఈ పరిస్థితిలో తను ఉండేది.. నేను తట్టుకున్నా కానీ తను తట్టుకోలేదు అని అంటాడు. కుమార్ సిద్ధూతో ప్రేరణ గారు ఇప్పటి వరకు ఇక్కడే ఉందిరా.. నీది తనది సేమ్ బ్లడ్ గ్రూప్ కావడంతో నీకు కావాల్సినంత రక్తం ఇచ్చింది అని అంటాడు. తను నా కోసం ఏమైనా చేస్తుంది అమ్మా అని అంటాడు. మేం కూడా నీ కోసం ఏమైనా చేస్తాంరా కానీ తన ముందు మా ప్రేమ నిలబడటం లేదు కదా.. మా కోసం నువ్వు ఆలోచించడం లేదు కదా అంటుంది. నేను ఆ క్షణం ప్రేరణ గురించి మాత్రమే ఆలోచించాను అమ్మా... అని అంటాడు. నీకు ఏమైనా అయింటే అని మంజుల అంటే ప్రేరణ నాకు ఏం కానివ్వదు అమ్మా నేను వెంటనే వెళ్లి ప్రేరణని చూడాలి అంటాడు. మంజుల, సాహితి, కుమార్ ఆపుతారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆపరేషన్ జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు పడుకోండి అని కోప్పడతాడు. 

గణ ప్రేరణ వాళ్ల మీద అరుస్తూ మీకు మా నాన్నకి ఏం సంబంధం ఉంది.. మీకు ఎందుకు మా నాన్నని అప్పగిస్తాను అని అంటాడు. దానికి ఐశ్వర్య అయితే మీ అమ్మ మా నాన్నని ఎందుకు దాచింది అని అడుగుతుంది. వాళ్ల ముఖాలు చూస్తే అర్థం కావడం లేదా.. వాళ్లు మనకి భయపడుతున్నారు అని అంటుంది ప్రేరణ. మీరు ఎన్ని చేసినా ఎన్ని డైలాగ్‌లు చెప్పినా మీరు అనుకున్నది జరగదు అని గణ అంటే అందుకేనా నన్ను ఇందాక రౌడీతో చంపించాలి అని చూశావ్ అని ప్రేరణ అడుగుతుంది. నాకేంటి అవసరం అని గణ అంటే నీకే అవసరం మా నాన్న కోసం నేను పోరాడుతుంటే నీ పరువు పోతుందని అని చివరకు నన్ను చంపించాలని ప్రయత్నించావ్ అని అంటుంది. ఆడవాళ్లం మేమే ధైర్యంగా పోరాడుతున్నాం.. అసలు నువ్వు మా నాన్నకి ఎలా పుట్టావురా అని ప్రేరణ అంటుంది. దానికి ఈశ్వరి ఏయ్ అని అరుస్తుంది.

ఇంతలో  ఇందిర కూడా ఏయ్ అని అరిచి ఈశ్వరికి వేలు చూపించి నీకు నీ కొడుకు ఎంత ముఖ్యమో నాకు నా కూతుళ్లు అంతే ముఖ్యం.. వాళ్లకి హాని తలపెట్టాలి అని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అని ఎలా చూస్తున్నావ్ అని అడుగుతుంది. ఏంటే సంబంధం లేని విషయంలో నన్ను ఇరికించి నన్ను దోషిని చేయాలి అనుకుంటున్నారా.. నేను నిన్ను చంపాలి అనుకోవడానికి సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతాడు. దానికి ప్రేరణ నీ మనస్శాక్షిని అడుగురా అని అంటుంది. నువ్వు చేసిన పనికి అన్యాయంగా సిద్ధూ ప్రాణాల మీదకు వచ్చిందిరా.. తనే నన్ను కాపాడకపోయి ఉంటే నేను చనిపోయేదాన్ని అని సంబరాలు చేసుకునే వాడివి కదా.. నాకు కౌంట్ డౌన్ స్టార్ అయింది అన్నావ్ కదా.. నీకు స్టార్ట్ అయింది.. నువ్వు చేసిన ప్రతీ తప్పుడు పనికి నీకు శిక్ష పడేలా నేను చేస్తా గుర్తుంచుకో అని ప్రేరణ ఛాలెంజ్ చేస్తుంది. 

రేయ్ నాన్న నిజంగా నిద్ర పోతున్నారా.. లేదంటే నిజం చెప్పేస్తారేమో అని మీరే తనని నిద్ర పోయేలా చేస్తున్నారా అని అడుగుతుంది. గణ, ఈశ్వరి షాక్ అయిపోతారు. ఫ్లాష్‌బ్యాక్‌లో గణ తండ్రి లేచి నిజం చెప్తే ఆ అవమానం తట్టుకోలేను అని పాలలో ట్యాబ్లెట్స్ కలిపి తండ్రికి ఇచ్చేస్తాడు.   మంజుల సిద్ధూ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. వీడే ప్రాణంగా బతుకుతున్నాను.. వీడిని ఇలా చూసి ఎలా బతకాలి.. ఒక్కోసారి ఇలాంటివి చూసి నాకు చావు ఎందుకు రావడం లేదు అని బాధగా ఉందని అంటుంది మంజుల. ఆ మాటలు ఏంటమ్మా అని సిద్ధూ అంటాడు. లేని పోని భయాలు పెట్టుకోవద్దు అమ్మా నేను బాగానే ఉన్నాను.. నన్ను కుమార్ చూసుకుంటాడు నువ్వు ఇంటికి వెళ్లు అని చెల్లికి చెప్పి తల్లిని తీసుకెళ్లమని అంటాడు. ఇప్పుడు కూడా ఈ అమ్మ నీ పక్కన ఉండటం నీకు ఇష్టం లేదారా అని మంజుల అడిగితే అలా కాదమ్మా నువ్వు ఇక్కడే ఉండి నీ మనసు కష్టపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. 

ప్రేరణ కుమార్‌కి కాల్ చేస్తే సిద్ధూ కళ్లు తెరిచాడు అని ఫోన్ ఇస్తా మాట్లాడు అని అంటే ప్రేరణ వద్దు అని రేపు వస్తా అని అంటుంది. తర్వాత తల్లీ చెల్లికి సిద్ధూ కోలుకున్నాడని చెప్పి ప్రేరణ సంబర పడిపోతుంది. రంజిత్ కూడా వింటాడు. సొంత వాళ్లే పరాయి వాళ్లలా చూస్తుంటే ఏ సంబంధం లేని సిద్ధూ మనల్ని ఇంతలా అండగా ఉన్నాడు..సిద్ధూ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని ప్రేరణ అంటుంది. మన కోసం సిద్ధూ బాబు.. తన వాళ్లకి కూడా దూరం అయ్యే పరిస్థితికి వచ్చాడు.. ఎన్ని చేసినా తన రుణం తీర్చుకోలేమని ఇందిర అంటుంది. కుమార్ సిద్ధూకి విషయం చెప్తే తను అలా చెప్తే నాకు ఫోన్ ఇవ్వవా... ఇప్పుడే ఫోన్ చేయరా మాట్లాడాలి అని అంటాడు. వీడియో కాల్ చేయమని అంటాడు.

ప్రేరణ సిద్ధూని చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. సిద్ధూ కూడా ప్రేరణని చూసి చాలా సంతోషపడతాడు. కుమార్ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు. ఆ కత్తి ఏదో నాకు తగిలుంటే బాగున్న సిద్ధూ నిన్ను ఇలా చూడలేకపోతున్నా అని ఏడుస్తుంది. ఏంటి ప్రేరణ నువ్వు నేను నిన్ను ఎప్పుడు వేరే మనిషిలా చూడలేదు.. నా మనిషిలా చూశా నీకు ఏమైనా అయితే నేను తట్టుకోగలనా చెప్పు అంటాడు. ఇంతలో మంజుల వచ్చి ఫోన్ తీసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget