Jagadhatri Serial Today January 21th: తన తల్లిని బాబాయి కమలాకరే చంపాడని కేధార్‌కు తెలిసిందా...? కోపంతో ఇంటికి వచ్చిన కేదార్...కమలాకర్‌కు ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు..?
Jagadhatri Serial Today Episode January 21th:తన తల్లిని బాబాయి కమలాకరే చంపాడని కేధార్‌కు తెలిసిందా...? కోపంతో ఇంటికి వచ్చిన కేదార్...కమలాకర్‌కు ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడు..?

Jagadhatri Serial Today Episode: హిమాలయాల నుంచి వచ్చిన నిన్ను చంపే ఉద్దేశం ఎవరికి ఉందని కేదార్ వాళ్ల తాతయ్యను అడుగుతాడు. వజ్రపాటి కమలాకర్ అని చెప్పడంతో కేదార్‌తోపాటు ధాత్రికి కూడా షాక్‌కు గురవుతారు. బాబాయి నిన్ను చంపాలనుకోవడం ఎందుకని కేదార్ అంటాడు. ఎందుకంటే మీ అమ్మను చంపింది కూడా ఆ దుర్మార్గుడేనని చెబుతాడు. ఈ మాటలు విని జగధాత్రి మరింత అదిరిపడుతుంది. కేదార్ వాళ్లన్న, వాళ్ల అమ్మన్న కమలాకర్‌కు నచ్చదని తెలుసుకానీ....మరీ మనుషులను చంపేంత చెడ్డవాడుకాదని వాదిస్తుంది. వాడే వీళ్ల అమ్మను చంపాడు అనడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటూ ఓ పాత డైరీ తీసి కేదార్ చేతికి ఇస్తాడు. ఇది మీ అమ్మ స్వయంగా రాసుకున్న డైరీ అని...ఇది చదివితే అన్ని విషయాలు తెలుస్తాయని చెబుతాడు. ఆ డైరీ తీసుకున్న జగధాత్రి చదవడం మొదలుపెడుతుంది. అందులో సుధాకర్‌ను కలవడం, అతన్ని ప్రేమించడం, ఓ బిడ్డకు జన్మనివ్వడం అన్నీ రాసి ఉంటాయి. సుధాకర్ వాళ్ల తమ్ముడు కమలాకర్ పదేపదే బెదిరిస్తున్నట్లు కూడా ఆమె రాస్తుంది. బిడ్డను తీసుకుని దూరంగా పారిపోకుంటే ఇద్దరినీ చంపేస్తానని కమలాకర్ బెదిరించినట్లు రాసుకుంటుంది. వాడి మాటలు వినలేదని...కత్తితో పొడిచి మీ అమ్మన చంపేశాడని కేదార్ వాళ్ల తాతయ్య చెబుతాడు. నిన్ను వాడి కంట పడనివ్వకుండా మీ అమ్మ కాపుడుకుందని అంటాడు. ఆ దుర్మార్గుడికి భయపడి నేను హిమాలయాలకు వెళ్లిపోయాననిచెబుతాడు.
కమలాకర్ తన తల్లిని చంపడంతోపాటు తన పుట్టుకనే అవమానించాడని కేదార్ కోపంతో రగిలిపోతాడు. వాడు అంతు చూస్తానంటూ మండిపడతాడు.ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న కమలాకర్, యువరాజును అక్కడే ఉన్న వాచ్‌మెన్ గమనించి అరుస్తాడు. దీంతో వాచ్‌మెన్ తల పగులగొట్టి వాళ్లిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. ఆవేశంగా కమలాకర్‌ను నిలదీయడానికి బయలుదేరిని కేదార్‌ను వాళ్ల తాతయ్య, జగధాత్రి ఆపాలని చూసినా ఆగడు. ఇంతలో ఇంటికి వెళ్లిన కమలాకర్‌ను చూసి నిషిక, వైజయంతి ఏం జరిగిందని అడుగుతారు. ఆ కేదార్‌గాడికి నిజం తెలిసిపోయిందని....కోపంగా వాడు ఇక్కడికే వస్తున్నాడని చెబుతాడు. అయితే మరీ మంచిదని...కోపంలో వాడు నీపై చేయిచేసుకోవడం ఖాయమని నిషిక అంటుంది.అప్పుడు మామయ్య, కౌషికియే వాళ్లను బయటకు పంపిస్తారని చెబుతుంది.మనం ఆ కేదార్‌గాడిని ఎంతరెచ్చగొడితే అంత మంచిదని అంటారు.
కోపంతో ఇంటికి వచ్చిన కేదార్....కమలాకర్‌ను గట్టిగా పిలుస్తాడు. అక్కడే ఉన్న వాళ్లనాన్న సుధాకర్,కౌషికి ఎందుకు అంత కోపంగా ఉన్నావని అడుగుతారు. మీ తమ్ముడు పాతికేళ్ల క్రితం మా అమ్మను చంపేశాడని కేదార్ చెప్పడంతో వాళ్లంతా షాక్‌కు గురవుతారు. ఇంతలో కిందకు దిగివచ్చిన కమలాకర్...ఏం మాట్లాడుతున్నావని అంటాడు.సాక్ష్యాలు తీసుకుని రమ్మంటే మొగుడు,పెళ్లాం కలిసి కొత్త నాటకం ఆడుతున్నారని నిషిక అంటుంది. కమలాకర్ కేదార్ వాళ్ల అమ్మను చంపినట్లు సాక్ష్యాలు ఉన్నాయని....వాళ్ల అమ్మ స్వయంగా రాసిన డైరీ మేం చదివామని జగధాత్రి చెబుతుంది. ఇవాళ వాళ్ల తాతయ్యను చంపడానికి మహల్ దగ్గరకు కూడా వచ్చారని చెబుతుంది. మేం బిల్డింగ్ పనులు చూడటానికి వెళ్లామని మహల్ దగ్గరకు వెళ్లలేదని యువరాజు అబద్ధం చెబుతాడు.అసలు కేదార్‌కు ఓ తాతయ్య ఉన్న సంగతే నాకు తెలియదని కమలాకర్ అంటాడు. ఈ క్రమంలోనే కేదార్‌ను మరోసారి కమలాకర్ రెచ్చగొడతాడు.





















