Jagadhatri Serial Today November 9th: ‘జగధాత్రి’ సీరియల్: విగ్రహంలో దొరికిన లాకెట్ - కేదార్ ను చంపేస్తానన్న యువరాజ్
Jagadhatri Today Episode: ఇంట్లోకి ఎలుకలు రావడంతో ధాత్రి భయంతో విగ్రహాన్ని కింద పడేస్తుంది. అందులోంచి లాకెట్ బయటకు వస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: క్యాండిల్ తీసుకుని లోపలికి వెళ్లిన ధాత్రి కేదార్ వచ్చేలోపు విగ్రహం ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దామనుకుంటుంది. బయట నుంచి నిషిక ఎలుకలను రూంలోకి వదులుతుంది. ఎలుకలను చూసిన ధాత్రి భయపడుతుంది. వదిన అంటూ కేకలు వేసుకుంటూ పరుగెత్తుకుంటూ బయటకు వెళ్తుంది. కౌషికి పరుగెత్తుకొస్తుంది. ఏమైందని అడుగుతుంది. లోపల అన్ని ఎలుకలు ఉన్నాయని చెప్తుంది. దీంతో నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి చూస్తాను అంటూ మెయిన్ బోర్డు దగ్గరకు వెళ్లి చూసి యువరాజ్‌ను పిలిచి బోర్డు సరి చేయిస్తుంది. కరెంట్ వస్తుంది. ఇంతలో కేదార్ ఎలక్రీషియన్ ను తీసుకుని వస్తాడు. కరెంట్ వచ్చిందని చెప్తుంది.
కేదార్: పద జగధాత్రి వెళ్దాం.
ధాత్రి: ఇంట్లో ఎలుకలు ఉన్నాయి. నేను రాను నాకు భయం
కేదార్: నేను ఉన్నాను కదా పద వెళ్దాం.. ఎలుకలు అంటే నీకు భయం అంటున్నావు కానీ ఆ ఎలుకలు నీకు భయపడి ఒక మూలన దాక్కున్నాయి.
నిషిక: ఎలుకలు భయపడటం ఏంటి..? అదేంటి యువరాజ్ జగధాత్రిని భయపెట్టే ఎలుకలు తీసుకురమ్మంటే జగధాత్రికి భయపడే ఎలుకులు తీసుకొచ్చావు.
యువరాజ్: జగధాత్రికి భయపడతాయని నాకెలా తెలుస్తుంది.
కేదార్: అదేంటి విగ్రహం ఓపెన్ అయింది.
ధాత్రి: ఎలుకలు వచ్చినప్పుడు నేనే భయపడి కింద పడేసి వెళ్లిపోయాను. పద కేదార్ విగ్రహం ఓపెన్ అయింది. లోపల ఏముందో చూద్దాం.
అని దగ్గరకు వెళ్లి చూడగానే అందులో సుధాకర్, లాకెట్ ఉంటుంది. అందులో కేదార్ వాళ్ల అమ్మ ఫోటో సుధాకర్ ఫోటో ఉంటుంది. ఫోటో చూసిన కేదార్, ధాత్రి చాలా హ్యాపీగా ఫీలవుతారు. వెంటనే బయటకు వెళ్లి లోపల దొరికిన లాకెట్ కౌషికికి చూపిస్తారు.
కేదార్: ఈ లాకెట్ అమ్మా నాన్నల ఫోటోలతో చేసింది అక్క.
కౌషికి: కానీ పక్కన ఉన్న ఆవిడ ఫోటో మాత్రం అంత క్లియర్ గా లేదు.
కేదార్: అది మా అమ్మ ఫోటోనే అక్కా..
యువరాజ్: మా అక్క ఫోటో క్లియర్ గా లేదని అంటుంటే నువ్వేంటి అది మీ అమ్మ ఫోటోనే అంటున్నావు.
కమలాకర్: అవును అద కచ్చితంగా మీ అమ్మ ఫోటో కాకపోవచ్చు. మా అన్నయ్య ఆ ఫోటో చేయించారు అంటే అది మా అన్నయ్యది, వైజయంతి వదినది అయ్యుండొచ్చు.
ధాత్రి: ఎందుకంటే ఆ జంట అందరూ అంగీకరించని జంట కాబట్టి రహస్యంగా దాచుకున్నారు.
యువరాజ్: అది ఎవరి ఫోటో నో తెలియకుండా అది మా అమ్మ ఫోటో అంటే నమ్మడానికి మేము పిచ్చోళ్లమ్మా..?
ధాత్రి: నమ్మకండి. ఆ ఫోటోలో ఉంది ఎవరో రేపు ఉదయాన్నే క్లీన్ చేసి మేము చూపిస్తాము. అప్పుడు అందులో ఉన్నది కేదార్ అమ్మే అయితే అప్పుడు అందరూ కేదార్ ను ఇంటి వారసుడిగా అంగీకరించాలి.
వైజయంతి: ఆ విగ్రహంలోంచి ఆ లాకెట్ వచ్చిందని గ్యారెంటీ ఏంటి..? వీళ్లే ఆ లాకెట్ కావాలని తీసుకొచ్చి ఉండొచ్చు కదా..? అసలు ఆ విగ్రహం పగిలిపోయింది. ఇప్పుడు ఆ పోలీసులు వస్తే ఏం చెప్పాలి.
కౌషికి: అవును జగధాత్రి ఇప్పుడెలా..?
అని కౌషికి అడగ్గానే జగధాత్రి ఆ విషయం నాకు వదిలేయండి వదిన నేను చూసుకుంటాను. అని చెప్పగానే అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కౌషికి మాత్రం ఇందులో ఉన్నది కేదార్ వాళ్ల అమ్మేనేమో అని మనసులో అనుకుంటుంది. అక్కా నీ మనసుకు ఏమి అనిపిస్తుంది అని కౌషికిని అడుగుతాడు కేదార్. ఫోటో క్లియర్ గా లేకుండా నేనేమీ మాట్లాడలేను అంటుంది కౌషికి. తర్వాత యువరాజ్ ఆ లాకెట్ ను ఎలాగైనా కొట్టేస్తానని లేదంటే ఆ లాకెట్ ఉన్న మనుషులనే చంపేస్తానని అంటాడు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!