అన్వేషించండి

Jagadhatri Serial Today November 5th: ‘జగధాత్రి’ సీరియల్‌: సెర్చ్‌ వారెంట్‌ చించేసిన యువరాజ్‌ - ధాత్రిని అడ్డుకున్న కౌషికి

Jagadhatri Today Episode:  సెర్చ్‌ వారంట్‌ తీసుకుని ఇంట్లో సోదాలు చేయడానికి వచ్చిన జేడీ, కేడీలను నిషిక అడ్డుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.  

Jagadhatri  Serial Today Episode: కౌషికి వచ్చి రేపు మన ఇంటికి ఎంక్వైరికీ జేడీ వస్తుందని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇప్పుడు ఎందుకు వస్తుందని అడుగుతారు. ఏదో నాన్నగారి యాక్సిడెంట్ కేసు గురించి వస్తున్నామని చెప్పారు. అయినా ఇవన్నీ మీకెందుకు వాళ్లు వచ్చినప్పుడు మీరు ఎవ్వరూ ఏమీ అనోద్దనే చెప్పడానికి వచ్చాను అని వెళ్లిపోతుంది కౌషికి. మరోవైపు ధాత్రి, కేదార్‌ లు గార్డెన్‌ లో నీళ్లు పడుతుంటారు. ఇంతలో సత్య ప్రసాద్‌ వస్తాడు.

ప్రసాద్‌: ఇన్నాళ్లకు మనోళ్లు ఎవరో పనోళ్లు ఎవరో తెలుసుకున్నారు. ఎవర్ని ఎక్కడ పెట్టాల్నో తెలుసుకున్నారు. నెమ్మదిగా అవుట్‌ హౌస్‌ నుంచి అవుటాప్‌ హౌస్‌కు పంపిస్తే మీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు.

సుధాకర్‌: రండి అందరూ మీ కోసం ఇంట్లో ఎదురుచూస్తున్నారు. నువ్వు రారా.. వైజయంతి తీసుకెళ్లు.  

ప్రసాద్‌: ఏంట్రా అందరూ వెయిట్‌ చేస్తున్నారు అని మమ్మల్ని లోపలికి పంపించి నువ్వు మాత్రం బయటే నిలబడి గేటు వైపు చూస్తున్నావేంటి..?

సుధాకర్‌: ఏం లేదురా.. ఏదో ఎంక్వైరీ అని ఇంటికి పోలీసులు వస్తున్నారట. వాళ్లతో మాట్లాడి ఈరోజు కాకుండా వేరే రోజు రమ్మని చెప్పడానికి ఇక్కడే నిలబడ్డాను.

ప్రసాద్‌: ఎంక్వైరీనా..? దేని కోసం ఎంక్వైరీ..

సుధాకర్‌: మా అన్నయ్య మధుకర్‌ డెత్‌ గురించి

ప్రసాద్‌: అవును ఆ కేసు ఎప్పుడో క్లోజ్‌ అయిపోయింది కదరా..? మళ్లీ ఎంక్వైరీ దేనికి..

సుధాకర్‌: మధుకర్‌ అన్నయ్య డెత్‌ యాక్సిడెంట్ కాదంట మర్డర్‌ అంట

  అని సుధాకర్‌ చెప్పగానే ప్రసాద్‌ భయపడతాడు. ఆ మర్డర్‌ కేసులో నేను ఉన్నాను. అది మర్డర్‌ అయితే నేను జైలుకు వెళ్లిపోతాను అని మనసులో అనుకుంటూ అయినా అది మర్డర్‌ ఏంట్రా అంటాడు. దీంతో ధాత్రి, కేదార్‌ మర్డర్‌ గురించి పోలీసులే చెప్తున్నారు కదా? అంటారు. ఇంతలో కౌషికి బయటకు వచ్చి బాబాయ్‌ పోలీసులు రానీ వస్తే నేను చూసుకుంటాను మీరు లోపలికి పదండి అని చెప్తుంది. అందరూ లోపలికి వెళ్లిపోతారు. తర్వాత అందరూ సంగీత్ లో డాన్స్‌ చేస్తుంటారు. ఇంతలో జేడీ, కేడీ ఎంక్వైరీకి వస్తారు. వాళ్లను చూసిన అందరూ షాక్‌ అవుతారు.

కౌషికి: ఇంట్లో ఫంక్షన్‌ జరుగుతుంది. ఇలాంటి టైంలో మా ఇంటికి పోలీసులు వస్తే మా పరువు పోతుందని ఎంతగా చెప్పినా ఎందుకు మీరు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నారు.

ధాత్రి: ఏంటి కౌషికి గారు పోలీసులు పరువు తీయడానికే పుట్టనట్టు మాట్లాడుతున్నారు. పోలీసులు డ్యూటీ చేయాలంటే మేం మొండిగానే ఉండాలి. అయినా మీ నాన్న గారి మరణం యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ గా క్రియేట్‌ చేసిన మర్డర్‌ అంటే మీరేంటండి ఇంతలా అడ్డుపడుతున్నారు.

కమలాకర్‌: మా అన్నయ్య ఎలా చనిపోయారో మాకు తెలుసు. ఇంట్లో ఫంక్షన్‌ జరుగుతుంది మీరు వెళ్లిపోండి.

కేదార్‌: ఇంట్లో మనిషిని ఎవరో చంపేశారు అంటున్నా కూడా మీరు ఇంకా ఫంక్షన్‌ గురించి ఆలోచిస్తున్నారా..?

వైజయంతి: చూడండి మా ఇంట్లో మనిషి గురించి మాకు బాధ ఉంది. కానీ మా మధ్యలో లేని మనిషి గురించి ఆలోచిస్తూ మా బిడ్డ పెళ్లి చెడగొట్టుకోలేం కదా..?

నిషిక: అయినా వీరితో మనకేంటి అత్తయ్య మాటలు. మర్యాదగా బయటికి వెళ్లారా..? లేదా..?

ధాత్రి: మీరేం చేసినా మా డ్యూటీ మేము చేసుకుని వెళ్లిపోతాము. మీ అందరూ కో ఆపరేట్‌ చేస్తే పది నిమిషాలు. లేదంటే మీ ఇష్టం.

ప్రసాద్‌: వీళ్లను ఎలాగైనా ఆపాలి. ఈ కేసు మర్డర్‌ అని తెలిసే ఎలాంటి ఆధారాలు దొరికినా నాకు ప్రాబ్లమ్‌ ( అని మనసులో అనుకుంటాడు.) అయినా ఇల్లు సెర్చ్ చేయాలంటే సెర్చ్‌ వారెంట్‌ ఉండాలి కదా..?

కేదార్‌: ఇదిగోండి సెర్చ్‌ వారెంట్‌.. ఇది సరిపోతుందా..? సార్‌ లేదంటే మీరు చేస్తున్న న్యూసెన్స్‌ కు అరెంట్‌ వారెంట్‌ తీసుకురావాలా..?

యువరాజ్‌: వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఆ రూంలోకి వెళ్లనివ్వకూడదు.

 అని యువరాజ్‌ మనసులో అనుకుని దగ్గరకు వెళ్లి సెర్చ్‌ వారెంట్‌ చించి వేస్తాడు. దీంతో కోపంతో ధాత్రి యువరాజ్‌ ను కొట్టబోతుంటే నిషిక అడ్డు పడుతుంది. ఇంతలో సుధాకర్‌ కలగజేసుకుని వాళ్లకు సహకరిస్తే వాళ్ల పని వాళ్లు చేసుకుని వెళ్లిపోతామని చెప్తున్నారు కదా? అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 27th: నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
Meghasandesam Serial Today July 27th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర
Karthika Deepam 2 Serial Today July 27th: కార్తీకదీపం 2 సీరియల్: దీప దశరథ్ కూతురని శ్రీధర్‌కి తెలిసిపోయిందా! సూరజ్ చేతిలో అదిరిపోయే స్వీట్ మెమోరీస్!
కార్తీకదీపం 2 సీరియల్: దీప దశరథ్ కూతురని శ్రీధర్‌కి తెలిసిపోయిందా! సూరజ్ చేతిలో అదిరిపోయే స్వీట్ మెమోరీస్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 27th:విక్కీని బ్రతిమాలించుకున్న రాధ....చిట్టి దగ్గర దొరికిపోకుండా విక్కీ నానా కష్టాలు
నువ్వులేక నేను లేను: విక్కీని బ్రతిమాలించుకున్న రాధ....చిట్టి దగ్గర దొరికిపోకుండా విక్కీ నానా కష్టాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Upcoming Cars in India: 3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
Embed widget