Jagadhatri Serial Today November 29th: ధాత్రి, కేదార్ ఇన్- నిషిక అవుట్- ఆసక్తిగా మారిన ‘జగధాత్రి’ సీరియల్ ఇవాళ్టి ఎపిసోడ్
Jagadhatri Today Episode: ధాత్రి చేసిన పనికి యువరాజ్ పరుగెత్తుకెళ్లి ధాత్రి, కేదార్‌లను ఇంటికి తీసుకురావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: ఇంత త్వరగా ఇంట్లోంచి బయటకు వస్తామని అసలు ఊహించలేదు అంటాడు కేదార్. దీంతో న్యాయంగా ధర్మంగా ఉంటే కుదరదు కేదార్. వాళ్ల దారిలోనే వెళ్లితే.. తప్పా నువ్వు ఆ ఇంట్లో ఉండలేవు అంటుంది ధాత్రి. కేదార్ ఫోన్ తీసుకుంటుంది. మరోవైపు వైజయంతి, నిషిక, యువరాజ్ హ్యాపీగా ఫీలవుతారు. ఎవరు తలుచుకున్నా వాళ్లు మాత్రం ఇంట్లో అడుగుపెట్టలేరు అంటాడు యువరాజ్. ఇంతలో కేదార్ ఫోన్ నుంచి యువరాజ్, మీనన్‌తో కలిసి ఉన్న వీడియోను యువరాజ్‌కు సెండ్ చేస్తుంది ధాత్రి. వీడియో చూసిన యువరాజ్ భయంతో బయటకు పరుగెడతాడు. కేదార్ కోసం వెతుకుతాడు.
కేదార్: యువరాజ్ వస్తాడు అంటావా ధాత్రి.
ధాత్రి: వస్తాడు కేదార్
కేదార్: పుట్‌పాత్ నుంచి ఆ ఇంట్లోకి అడుగుపెట్టడానికి చాలా కాలం పట్టింది ధాత్రి. కానీ ఆ ఇంట్లో నుంచి పుట్‌పాత్ మీదకు రావడానికి ఎంతో కాలం పట్టలేదు. నా జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్లీ అక్కడికే వచ్చి చేరింది. కానీ నా జీవితం అప్పట్లో నేను ఒక్కడినే ఉండేవాడిని. కానీ ఇప్పుడు నిన్ను కూడా పుట్‌పాత్ మీదకు తీసుకుని వచ్చేశాను.
ధాత్రి: బాధపడకు కేదార్. నేను చెప్పాను కదా..? మనల్ని బయటకు గెంటేసిన వాళ్లే మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్తారు.
కేదార్: ఏమో ధాత్రి నాకైతే నమ్మకం లేదు.
ధాత్రి: చెప్పాను కదా.. కేదార్..యువరాజ్ వస్తాడు అని
యువరాజ్: మీ ఇద్దరూ ఇక్కడున్నారా..? జగధాత్రి ఆ వీడియోస్ మీకు ఎక్కడ దొరికాయి. అవన్నీ డిలీట్ చేసేయండి.
ధాత్రి: సరే నేను డిలీట్ చేస్తాను. కానీ నేను చేసినంత మాత్రాన నీ ప్రాబ్లమ్ సాల్వ అవ్వదు కదా యువరాజ్. మాకు పంపిన ఎస్సై దగ్గర సేఫ్‌గానే ఉంటాయి కదా..?
యువరాజ్: ఎస్సైయా..? ఎవరా ఎస్సై.. చెప్పు జగధాత్రి..
ధాత్రి: చూడు యువరాజ్ నువ్వు కేదార్‌కు తమ్ముడివి అని తెలిసినా.. ఆ ఎస్సై ఫోటోస్ వీడియోస్ పంపి ఏం చేయాలని అడిగారు. కేదార్‌కు నీకు ఏ సంబంధం లేదు అంటే ఈ వీడియోస్ అన్ని సుపీరియర్‌కు పంపిస్తాను అన్నారు. మేమే పోనీలే అని కొంచెం సేపు ఆపాము.
యువరాజ్: జగధాత్రి థాంక్స్.. ఆ ఎస్సైకి ఫోన్ చేసి ఆ వీడియోస్ డిలీట్ చేయమని చెప్పు. ప్లీజ్..
ధాత్రి: యువరాజ్ నువ్వు మరీ మమ్మల్ని ఇంత బతిమాలాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళితే చాలు.
అని దాత్రి చెప్పగానే యువరాజ్ ఆలోచనలో పడిపోతాడు. మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్లాలా..? అనుకుంటాడు. ఇప్పుడు నేను ప్రాణాలతో బయటపడాలంటే వీళ్లను లోపలికి తీసుకెళ్లక తప్పడం లేదు అని మనసులో అనుకుని కేదార్, ధాత్రిలను ఇంటికి తీసుకెళ్తాను అంటాడు. బ్యాగ్స్ తీసుకుని రండి అంటూ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వచ్చిన కేదార్, ధాత్రిలను చూసి వైజయంతి, నిషిక షాక్ అవుతారు.
వైజయంతి: ఏందిరా అబ్బోడా ఈ కూలోడి అవతారం. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంది..? బయటకు వెళ్లిపోయిన వాళ్లను అలా ఇంట్లోకి తీసుకొచ్చావేట్రా..
నిషి: అడుగుతుంటే అలా ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డావేంటి యువరాజ్. ముందు వీళ్లను బయటకు పంపించేయ్.
ధాత్రి: నేను చెప్పాను కదా యువరాజ్. మేము ఇంట్లోకి రావడం వీళ్లకు ఇష్టం ఉండదు అని
యువరాజ్: నేను మాట్లాడతాను జగధాత్రి.
వైజయంతి: ఏం మాట్లాడతావురా.. అబ్బోడా..
యువరాజ్: అమ్మా నన్నేం అడగకండి. అలా అని నా మాట కాదనకండి. ఈరోజు నుంచి ధాత్రి, కేదార్‌లు ఇక్కడే మనతోనే ఉంటారు.
కౌషికి: ఇప్పుడే కదా వాళ్లను బయటకు గెంటివేశారు. అది కూడా కేదార్ అంటేనే మండి పడే యువరాజ్ వాళ్లు ఇంట్లో ఉంటారని చెప్తున్నాడు. ( అని మనసులో అనుకుంటుంది.)
ఇంతలో నిషిక కోపంగా వెళ్లి ధాత్రి వాళ్లను బయటకు గెంటివేస్తుంటే.. యువరాజ్ వెళ్లి కొడతాడు. నిషిక బాధపడుతూ నాకన్నా వాళ్లు నీకు ఎక్కువైపోయారా..? అని అడిగితే అవునని వీళ్లను బయటకు గెంటి వేయాలనుకుంటే నన్ను కూడా గెంటి వేయండి అంటాడు. ధాత్రి, కేదార్ లను లోపలికి తీసుకెళ్తాడు. రూంలోకి వెళ్లాక వీడియో డిలీట్ చేయండి అని అడుగుతాడు యువరాజ్. సరే అంటారు ధాత్రి, కేదార్. మరోవైపు కౌషికి ఎంతలా ఆలోచించినా యువరాజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఇంకోవైపు నిషిక రూంలో ఏడుస్తూ.. నేను ఈ ఇంట్లోంచి వెళ్లిపోదామనుకుంటున్నాను అత్తయ్యా అంటుంది. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!