అన్వేషించండి

Jagadhatri Serial Today November 15th: ‘జగధాత్రి’ సీరియల్‌:  నిషిక పీక పట్టుకున్న కౌశికి – కౌశికిని తిట్టి వెళ్లిపోయిన సురేష్‌

Jagadhatri Today Episode:  కోర్టులో సాక్ష్యం ఎందుకు చెప్పావని కౌశికి కోపంగా నిషిక పీక పట్టుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.      

Jagadhatri  Serial Today Episode:  కోర్టులో ఆదిలక్ష్మీ, కౌశికి కుటుంబాన్ని.. శపిస్తుంది. సురేష్‌ను ఆ కుంటుంబానికి దూరంగా ఉండమని చెప్తుంది. ఆదిలక్ష్మీని పోలీసులు తీసుకెళ్తుంటే.. అత్తయ్యగారు నేను ఈ కంప్లైంట్‌ చేయలేదని అంటుంది. ఇంతలో సురేష్‌ కూడా కౌశికిని తిడతాడు. నువ్వు ఇంకా కప్పి పుచ్చుకోవాలనుకుంటున్నావా..? అంటూ ప్రశ్నిస్తాడు. షష్టి పూర్తి రోజు నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టినప్పుడే మా ఇంట్లో పతనం మొదలైంది. నీవల్లే మా నాన్న చనిపోయాడు. మా చెల్లి, అమ్మ జైలుకు పోయారు. నా కుటుంబాన్ని ఇంత నాశనం చేసి కూడా ఇంకా నటిస్తున్నావా..? అని అడుగుతాడు.

కేదార్‌: బావా అక్క గురించి అందరికంటే నీకు బాగా తెలుసు. కచ్చితంగా అక్క  ఈ పని చేసి ఉండదు. ఎవరో కావాలనే అక్కను ఇరికించి ఉంటారు.

ధాత్రి: అవును అన్నయ్యా తొందరపడి వదినను నిందించకండి.

సురేష్‌: ఏ తప్పు చేయని మా అమ్మను నిందించింది ఈ కౌశికి ఇలాంటి వాళ్లతో కలిసే ఉంటే రేపు నాకు కూడా ఇదో గతి పడుతుంది. గుడ్‌ బై కౌశికి.

  అని సురేష్‌ వెళ్లిపోతాడు. కౌశికి ఏడుస్తుంది. ధాత్రి, కేదార్‌ ఓదారుస్తారు. మా ప్లాన్‌ ప్రకారం కౌశికి వదినను సురేష్‌ అన్నయ్యను విడగొట్టాము. ఇక కౌశికి వదిన కేదార్‌ విషయంలో కలగజేసుకోదు. అని మనసులో అనుకుంటుంది నిషిక. ఇంతలో కౌశికి కోపంగా నిషికను కొట్టి గొంతు నులుముతుంది. వైజయంతి అడ్డు పడుతుంది. ఏం చేస్తున్నావని నిలదీస్తుంది. తప్పు చేసిన మీ అత్తగారికి శిక్ష పడటంలో తప్పేం ఉంది. అంటూ అడుగుతుంది. దీంతో బయటకు వెళ్లిన కౌశికి ఏడుస్తుంది. తర్వాత ఇంటి దగ్గర కూర్చుని ఏడుస్తున్న కౌశికి దగ్గరకు కేదార్‌, ధాత్రి వస్తారు.

కేదార్‌: అక్క ఇదంతా ఎవరో నిన్ను ఇరికించడానికి ప్లాన్‌ చేస్తున్నట్టు ఉంది.

కౌశికి: నన్ను ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది కేదార్‌.

ధాత్రి: వదిన తప్పుగా అనుకోనంటే నా అనుమానం యువరాజ్‌ పైనే ఉంది. మీ సంతకం ఉన్న కంప్లైట్ పేపర్‌ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లింది.  మనం వెల్లే సరికి యువరాజ్‌ అక్కడే ఉన్నాడు. కోర్టుకు ఇంట్లో వాళ్లను రాకుండా చూడు అని చెప్పి మనం కోర్టుకు వెళ్లే లోపు అత్తయ్యగారు నిషిక కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో ఇది యువరాజ్‌ ప్లాన్‌ ఏమో అని డౌటుగా ఉంది వదిన.

కౌశికి: యువరాజ్‌కు నన్ను ఇరికించాల్సిన అవసరం ఏముంటుంది జగధాత్రి

కేదార్‌: ఏముంటుంది అని ఆలోచించడం పక్కన పెడితే ధాత్రి చెప్పినదాన్ని ఒక్కసారి ఆలోచించు అక్క ఉదయం యువరాజ్‌ ఫైల్స్‌ తీసుకొచ్చి నిన్ను సంతకం పెట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది అక్క.

ధాత్రి: మీరు కనీసం ఆ ఫైల్‌లో ఏముందో కూడా  చూడకుండ సంతకం పెట్టారు. అది యువరాజ్‌ మీద మీకున్న నమ్మకమే అనుకోండి. కానీ ఆదే నమ్మకాన్ని వాడుకుని ఎంటీ పేపర్‌ మీద సైన్ చేయించి ఉండొచ్చు కదా వదిన.

కౌశికి: మీరు చెప్పింది నిజమే అనుకున్నా.. నన్ను ఇరికించడం వల్ల నన్ను సురేష్‌కు దూరం చేయాలనుకున్నా వాళ్లకు ఏం లాభం చెప్పు.

ధాత్రి: సరే మీరేం బాధపడకండి వదిన ఈ సమయంలో మీరేం టెన్షన్‌ పడకూడదు. మీరు రిలాక్స్‌ గా ఉంటేనే మీ కడుపులో బిడ్డ హ్యాపీగా ఉంటుంది. అసలు ఇదంతా ఎవరు చేశారో మేము కనుక్కుంటాం.

కౌశికి: వద్దు జగధాత్రి మీ అనుమానం అబద్దం అయితే మనం అవమాన పడవలసి వస్తుంది.

సుధాకర్‌: జరిగింది అంతా విన్నాను అమ్మా.. ఎంత ఆలోచించినా ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇంతటి దారుణం జరగడానికి మన వాళ్లు కారణం కావడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను.  

అంటూ సుధాకర్‌ బాధపడుతుంటే కౌశికి మీ ఆరోగ్యం బాగాలేదని వెళ్లి రెస్ట్ తీసుకోండి బాబాయ్‌ అని చెప్తుంది. సుధాకర్‌ వెళ్లిపోతాడు. కౌశికి కూడా కీర్తిని తీసుకుని వెళ్లిపోతుంది. ధాత్రి, కేదార్‌ మాత్రం కౌశికి గురించి ఆలోచిస్తారు. ఇదంతా ఎవరు చేశారో కనుక్కోవాలి అని కేదార్‌ అంటాడు. మరోవైపు యువరాజ్‌ వైజయంతి వాళ్లకు ఆ కేదార్‌, జగధాత్రి మనల్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. మరోవైపు కేదార్‌, ధాత్రిలకు రూంలో వదిలి వెళ్లిన ఫైల్స్‌ గుర్తుకు వచ్చి మళ్లీ వెతుకుతారు. మరోవైపు యువరాజ్‌ మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కాలుస్తాడు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget