Jagadhatri Serial Today July 1st: ‘జగధాత్రి’ సీరియల్: మీనన్ ను రూంలో బంధించిన ధాత్రి – మార్చురీ లో బాడీలను తగులబెట్టమన్న యువరాజ్
Jagadhatri Today Episode: మీనన్ ను కనిపెట్టిన జగధాత్రి అతన్ని రూంలో వేసి బంధించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: మోహన్ సింగ్ లాగా మీనన్ మారు వేషంలో కౌషికి ఇంటికి వస్తాడు. ధాత్రి, సురేష్‌ను పిలిచి లోపల ఉన్నది మీనన్ అని అనుమానం ఉందని చెప్పగానే సురేష్ వెంటనే పోలీసులకు చెప్తామని అంటాడు. వద్దని ఒకవేళ మీనన్ కాకపోతే నేను బయటపడాల్సి వస్తుందని మనం ఒక నాటకం ఆడి వాడు మీనన్ నా లేక మామూలు వ్యక్తా తెలుసుకుందామని చెప్తుంది. ఏం నాటకమని సురేష్ అడగ్గానే నువ్వు దొంగలాగా వేషం వేసుకుని లోపలికి వెళ్లి నగలు ఇవ్వమని కత్తితో బెదిరించు అక్కడ ఉన్నది మీనన్ అయితే నీ చేతిలో కత్తి అయిదు సెకన్లలలోనే వాడి చేతుల్లోకి వెళ్తుంది అని చెప్పగానే సరేనని సురేష్ లోపలికి వెళ్లిపోతాడు. ధాత్రి చెప్పినట్టుగానే సురేష్ దొంగలాగా వస్తాడు. సురేష్‌పై మీనన్ దాడి చేస్తాడు. దీంతో ధాత్రికి కూడా వాడు మీననే అని క్లారిటీ వస్తుంది. వెంటనే బయటకు వెళ్లి పోలీసులకు ఫోన్ చేస్తుంది.
ధాత్రి: సార్ నేను వజ్రపాటి కౌషికి గారి ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నాను. మా ఇంట్లో జ్యువెల్లరీ షాపు నుంచి వచ్చానని ఒకతను వచ్చాడు సార్. అతన్ని చూస్తుంటే దొంగేమోనని నాకు అనుమానం వచ్చి ఆ షాప్ కు ఫోన్ చేసి కనుక్కుంటే తమ షాపు నుంచి ఎవ్వరూ రాలేదని చెప్పారు.
పోలీస్: మీ అనుమానం నిజమైందన్నమాట.
ధాత్రి: అవును సార్. అతన్ని చూస్తుంటే కరుడగట్టిన తీవ్రవాదిలా ఉన్నాడు.
పోలీస్: నేను ఇప్పుడే వస్తున్నాను మేడం. మీరు అప్పటిదాకా వాడికి మీ మీద అనుమానం రాకుండా ఉండండి. వాడి సంగతి నేను చూసుకుంటాను.
ధాత్రి: వేట దానంతట అదే వచ్చి వేటగాడి బాణానికి తగిలిందన్నట్టు ఈ ఇంటికి వచ్చి వెళ్దామనుకున్నావు కదా? ఇప్పుడు నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత మేము కస్టడీలోకి తీసుకుంటాము.
అని ధాత్రి అనుకుంటుంది. మరోవైపు నిషిక యువరాజ్‌కు ఫోన్ చేసి పాస్‌ఫోర్ట్ ఎక్కడుందని అడుగుతుంది. బెడ్ కింద ఉందని చెప్పగానే నిషిక పాస్‌ఫోర్ట్ తీసుకుని వస్తుంది. ఇంతలో ధాత్రి లోపలికి వెళ్లి మీనన్‌తో మీ టైం అయిపోయిందని చెప్తుంది. మీనన్ షాక్ అవుతాడు. అదే మీరు షాపుకు వెళ్లే టైం అయిపోయిందని.. రూంలో వేసి బంధిస్తుంది.
కమలాకర్: జగధాత్రి ఏం చేస్తున్నావు.
వైజయంతి: ఏమైంది మరిది ఎందుకు అలా అరుస్తున్నావు.
మీనన్: హలో ఎందుకు డోర్ క్లోజ్ చేశారు. తలుపు తీయండి.
వైజయంతి: ఈ గొంతు
నిషిక: మనకు నగలు అమ్మడానికి వచ్చిన మోహన్ సింగ్ గారిది. ఇది అతన్ని లోపల వేసి డోర్ క్లోజ్ చేసింది.
ధాత్రి: నిషి ఇతను నిజమైన నగల షాపు అతను కాదు దొంగ. నాకు ఇతని మీత అనుమానం వచ్చి ఇతను చెప్పిన షాపుకు ఫోన్ చేసి అడిగితే వాళ్లు ఇక్కడికి ఎవర్ని పంపించలేదు అని చెప్పారు.
సురేష్: ఏంటి జగధాత్రి నువ్వు చెప్పేది నిజమా? ఏంటి మామయ్యగారు. మీకు తెలిసిన వ్యక్తి అని చెప్పారు. మీకు తెలిసిన వ్యక్తి దొంగా?
కమలాకర్: అంటే ఇతను నాకు తెలియదు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఇతని గురించి చెబితే పిలిపించాను. నేను ఇతన్ని చూడ్డం ఇదే మొదటిసారి.
అనగానే అయితే ఇతను నిన్ను కూడా మోసం చేశాడా మామయ్య అంటుంది ధాత్రి. ఇంతలో పోలీసులు వస్తారు. ధాత్రి పోలీసులకు రూంలో ఉన్నాడని చూపిస్తుంది. రూంలోకి వెళ్లిన పోలీసులు లోపల ఎవ్వరూ లేరని చెప్పగానే ధాత్రి లోపలికి వెళ్లి చూస్తుంది. మీనన్ బాల్కనీలోంచి పారిపోవడం చూస్తుంది ధాత్రి. తర్వాత క్లూస్ సంపాదించాలని ధాత్రి హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడకు యువరాజ్ రౌడీలతో వస్తాడు. హాస్పిటల్ స్టాఫ్ వేషం వేసుకుని మార్చురీలోకి వెళ్లి బాడీలను కాల్చేయాలని చూస్తారు. ఇంతలో డాక్టర్ వేషం వేసుకుని ధాత్రి లోపలికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఖుషి కపూర్ వింత కోరిక - అదేంటో తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు