Jagadhatri Serial Today December 31st: ‘జగధాత్రి’ సీరియల్: యువరాజ్‌కు వార్నింగ్ ఇచ్చిన ధాత్రి – హీరోయిన్ ఇంటికి ఒంటరిగా వెళ్లిన కేదార్
Jagadhatri Today Episode: వీలునామా పేపర్స్ విషయంలో యువరాజ్ వాళ్లకు అసలు నిజం చెప్తుంది ధాత్రి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: వీలునామా పేపర్స్ చించేశామని హ్యాపీగా ఉన్న యువరాజ్ వాళ్ల దగ్గరకు ధాత్రి, కేదార్ వెళ్లి మీరు చించేసిన పేపర్స్ కలర్ ఫ్రింట్ అని చెప్పి అలాంటివి వంద పేపర్స్ ఉన్నాయని ఇంకొన్ని పేపర్స్ చూపించగానే యువరాజ్, నిషిక షాక్ అవుతారు. వైజయంతిని కూడా అనుమానిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
వైజయంతి: ఓరే అబ్బోడా అ అమ్మాయి ఏంది ఆఖరున అట్టా అని పోయింది. నేను నాటకం ఆడుతున్నానని తెలిసిపోయిందా ఏంటి..?
నిషిక: లేదు అత్తయ్యా నిజంగా తెలిసి ఉండి ఉంటే అందరిని పిలిచి పంచాయతీ పెట్టేది. ఇల్లు పీకి పందిరి వేసేది.
యువరాజ్: అవును అమ్మా నాకు తెలిసి జస్ట్ అనుమానం వచ్చి ఉంటుంది. ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజం తెలిస్తే అక్కా నాన్నా లైఫ్‌లో మన ముఖం చూడరు
వైజయంతి: అబ్బో సరే అబ్బోడా..?
నిషిక: అత్తయ్యా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి వీల్ చైర్ తీసుకొస్తాను.
అని చెప్పి నిషిక వెళ్తుంది. మరుసటి రోజ ఉదయం ధాత్రి నిద్రలేవగానే కేదార్ రూమ్ డెకరేట్ చేసి ఉంటాడు. అది చూసిన ధాత్రి హ్యాపీగా నవ్వుతుంది. కేదార్ కాఫీ ఇవ్వగానే నవ్వుతూ తాగబోతున్న ధాత్రికి బయట నుంచి నవ్వులు వినిపిస్తాయి.
ధాత్రి: ఎవరూ..
కేదార్: ఏమో..
కాచి, బూచి ఒకరికొకరు కాఫీ తాగించుకుంటూ ఉంటారు. వాళ్లను చూసిన ధాత్రి అనుమానంగా కేదార్‌ను చూస్తుంది.
కేదార్: నాకేం సంబంధం లేదు. సారీ..
బూచి: కాచి ఇక నుంచి మనం రోజూ ఇలానే కాఫీ తాగించుకుని ఉత్తమ్మ భార్యాభర్తలం అనిపించుకుందాం.
కాచి: అందరికీ తర్వాత ముందు నాకు నిరూపించు..
బూచి: లేదు బంగారం ఇక నుంచి మారిన బూచిని చూస్తావు కదా..? మనం రోజు ఇలానే ఒకరికొకరం కాఫీ తాగించుకుందాం.
అని ఇద్దరూ కలిసి ఒకరికొకరు కాఫీ తాగించుకుంటుంటే.. కేదార్ చూసి ఒక్కసారి ప్లీజ్ అని అడుగుతాడు. సరేనని ధాత్రి, కేదార ఇద్దరు ఒకరికొకరు కాఫీ తాగించుకుంటారు. ఇంతలో కేదార్‌కు కిరణ్ ఫోన్ చేస్తాడు.
ధాత్రి: చెప్పు కిరణ్..
కిరణ్: మీరు అడిగినట్టే ఆ హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేశాను మేడం.
ధాత్రి: సూపర్ ఏం తెలిసింది. అసలు ఆమె ఎవరు..?
కిరణ్: ఆర్కియాలజీ ఇంట్లో పని చేసిన పనిమనిషి పేరు ఆ హీరోయిన్ పేరు ఒక్కటే మేడం.
ధాత్రి: ఇద్దరి పేర్లు ఒక్కటే అవ్వడం ఏంటి..?
కిరణ్: ఆర్టిస్ట్ అసోసియేషన్ లో జాయిన్ అయినప్పుడు ఆమె అదే పేరుతో జాయిన్ అయింది.
ధాత్రి: పేర్లు మాత్రమే ఒక్కటేనా..? మనిషి కూడా ఒక్కటేనా..? అది కనుక్కోవాలి అంటే మనం వెంటనే హీరోయిన్ ను కలవాలి. పద కేదార్ ఆ హీరోయిన్ సంగతేంటో చూద్దాం
అని ధాత్రి చెప్పగానే.. కేదార్ సరే అంటాడు. మరోవైపు కేరళ షూటింగ్‌కు వెళ్లడానికి రెడీ అవుతుంది. మరోవైపు హీరోయిన్ కోసం వెళ్తూ వాళ్ల అమ్మను గుర్తు చేసుకుని ధాత్రి ఎమోషనల్ అవుతుంది.
కేదార్: 20 ఏళ్ల ముందు అజ్ఞాతంలో ఉన్న ఆ మూడో వ్యక్తిని బయటకు తీసుకొచ్చే టైం వచ్చింది.
ధాత్రి: అదే జరిగితే మా అమ్మ చావు వెనక ఉన్న నిజం ఇదే అయితే నా కన్నా సంతోషించే వాళ్లు ఎవరూ ఉండరు కేదార్.
కేదార్: అదే జరగుతుంది నువ్వు ధైర్యంగా ఉండు ధాత్రి.
అని చెప్పగానే ఇంతలో సాధు ఫోన్ చేసి ధాత్రిని ఆఫీసుకు రమ్మని అర్జెంట్‌గా మాట్లాడాలని చెప్తాడు. సరేనని ధాత్రి వెళ్తుంది. హీరోయిన్ దగ్గరకు కేదార్ వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లిన కేదార్‌ను పనిమనిషి వచ్చి బయటకు వెళ్లమని చెప్తుంది. ఒక్కసారి మేడంను కలిసి వెళ్తానని చెప్పగానే సరేనని లోపలికి వెళ్లి హీరోయిన్‌కు చెప్పగానే కూర్చోబెట్టి తినడానికి ఏమైనా ఇవ్వు అని చెప్తుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!