Jagadhatri Serial Today April 6th: ‘జగధాత్రి’ సీరియల్: హేమ, కళ్యాణ్ లకు పెళ్లి చేస్తానని మాటిచ్చిన ధాత్రి – అఖిలాండేశ్వరికి రమేష్ వార్నింగ్
Jagadhatri Today Episode: మీరుస్టేడియం ఎలా కడతారో చూస్తానని రమేష్, అఖిలాండేశ్వరికి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: గుడిలో పెళ్లి చేసుకోబోతున్న హేమ, కళ్యాణ్‌లను ధాత్రి పట్టుకుంటుంది. పెళ్లి ఆపి హేమకు క్లాస్ పీకుతుంది. ఇలా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకవడం కరెక్టు కాదని చెప్తుంది. మీ పెళ్లి మేము చేస్తామని చెప్తుంది. ఇప్పుడు నాతో రండి అని ధాత్రి భరోసా ఇవ్వగానే హేమ సరే అక్కా మీ మీద నమ్మకం ఉంది వస్తాము అని ధాత్రితో వెళ్తారు హేమ, కళ్యాణ్. మరోవైపు మీనన్ రౌడీలు చాపలో చుట్టిన పెళ్లికూతురుని మీనన్ ముందు నిలబెడతారు.
మీనన్: నా కాలర్ పట్టుకున్న వాడి గుండె ధైర్యం పోవాలి. నా పేరు తలుచున్న వాడిలో వెన్ను అదరాలి. పది పర్సెంట్ ఇవ్వమని అడుగుతే వాడేమన్నాడురా? ఇప్పుడు చూడండి వాడే ఒక నెంబర్ చెప్తాడు చూడు. నా పగను తీర్చబోయే ఆ అమ్మాయిని అలా చుట్టిపడేస్తారేంట్రా తీయండి.
రౌడీలు అమ్మాయిని చాపలోంచి బయటకు తీస్తారు.
మీనన్: దేవా పెళ్లి కూతరు ఈ అమ్మాయేనా?
దేవా: ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒక్కరు కాదు భాయ్..
మీనన్: ఈ అమ్మాయిని మార్చిందెవరు?
రౌడీలు: మాకేం తెలియదు భాయ్ యువరాజ్ ఎలా ఇచ్చాడో అలానే తెచ్చాము.
మీనన్: దేవా ఆ యువరాజ్ గాడికి కాల్ చేయ్..
అనగానే యువరాజ్‌కు ఫోన్ చేస్తాడు. యువరాజ్ సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి చూశారా భాయ్ మూడో కంటికి కనబడకుండా ఎలా పార్శిల్ చేసి పంపించానో అనగానే మీనన్ తిట్టి వీడియో కాల్ చేసి అమ్మాయిని చూపిస్తాడు. దీంతో యువరాజ్ షాక్ అవుతాడు. మరోవైపు అఖిలాండేశ్వరి ఇంట్లో అందరూ ఎదురుచూస్తుంటారు. రమేష్ మీరిచ్చిన టైం అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం అడిగినా చేస్తా అన్నారు చేస్తారా? అని అడగ్గానే దేవ ఆలోచిస్తుంటాడు. ఇంతలో ధాత్రి, కేదార్, హేమ, కళ్యాణ్ వస్తారు.
ధాత్రి: అయినా మీ ప్రేమ కోసం మీరే పోరాడలేక పారిపోయారు. మీ ఇంట్లో వాళ్లు ఎందుకు ఒప్పుకోవాలి.
కేదార్: ఇప్పటికైనా మీ ప్రేమ కోసం మీరు ఫైట్ చేయండి. ఇలా పారిపోయి పెళ్లిని గెలిపించి ప్రేమను ఓడించకండి.
అనగానే ధాత్రి వాళ్లు లోపలికి వస్తారు. పార్వతి చూసి అందరికి చెప్తుంది. దీంతో నిషిక షాక్ అవుతుంది. ఇంతలో హేమ లోపలికి రాగానే రమేష్ తిడతాడు. నా వల్ల బాధపడిన అందరికీ మనఃస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అనగానే దేవ కోపంగా రమేష్‌ను తిడతాడు. మీరు అన్నీ తెలిసి నలుగురిలో మా పరువు పోయేలా చేశారు. అంటూ నిలదీస్తాడు. దీంతో రమేష్ నా కూతురు చనిపోయింది. మీరంతా కలిసి చంపేశారు మీరు ఆ స్టేడియం ఎలా కడతారో చూస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దేవ: హేమ మీరు బయట ఉంటే మీ నాన్న వల్ల మీకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు మీ పెళ్లి జరిగే వరకు మీరు మాఇంట్లోనే ఉండండి.
పార్వతి: మంచి మాట చెప్పారు పెద్దబాబు గారు.
అనగానే మీకు మీ సంస్కారానికి థాంక్స్ అంటూ ధాత్రికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోతుంది. దేవ.. కేదార్, ధాత్రికి కృతజ్ఞతలు చెప్తాడు. అఖిలాండేశ్వరి ఆలోచిస్తుంది. ఇంతలో దేవ ఏంటమ్మా అని అడగ్గానే హేమ పారిపోవడానికి కారణం ఎవరు? అని ఆలోచిస్తున్నాను అంటుంది. దీంతో నిషిక టెన్షన్ పడుతుంది. నిషికను ధాత్రి బయటకు తీసుకెళ్లి ఎందుకు హేమకు ఎందుకు హెల్ప్ చేశావు అని నిలదీయగానే నిషిక కోపంగా అవునని నా ఫ్రెండ్ కాబట్టి చేశాను అంటుంది. దీంతో నిషికకు నువ్వు ఇలా చేసి ఉండకూడదని వార్నింగ్ ఇస్తుంది. అఖిలాండేశ్వరి ఆలోచిస్తుంది. ఇంతలో కలెక్టర్ వస్తారు. స్టేడియం గురించి అడుగుతాడు. దీంతో అఖిలాండేశ్వరి లాండ్ విషయంలో చిన్న ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పగానే ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయ్ - ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?