Jagadhatri Serial Today April 12th: ‘జగధాత్రి’ సీరియల్: గుడి దగ్గర ప్రత్యక్షమైన శివయ్య – పెళ్లి చెడగొట్టేందుకు నిషిక కొత్త ప్లాన్
Jagadhatri Today Episode: మాధురి పెళ్లి చెడగొట్టేందుకు నిషిక కొత్త ప్లాన్ వేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: టీపాయ్ మీద పెట్టిన న్యూస్ పేపర్ భవాని తీసుకుని చదువుతుంది. కేదార్, ధాత్రి కంగారుపడుతుంటారు. అందులో మాధురి హత్య చేసిందన్న న్యూస్ ఉందని అది భవాన్ని చూస్తే ఈ పెళ్లే ఆగిపోతుందని కేదార్ కంగారుపడుతాడు. నువ్వుండు ఎలాగైనా ఆ పేపర్ భవాని దగ్గర నుంచి తీసుకొస్తానని ధాత్రి దగ్గరకు వెళ్లి అది పాత పేపర్ నాకు ఇవ్వండి అనుకోకుండా తీసుకొచ్చానని చెప్తుంది. భవాని కూడా నేనేం కావాలని చదవడం లేదు. టైంపాస్‌కు చదవుతున్నానని చెప్పడంతో ధాత్రి కంగారు పడుతుంది. మరోవైపు నిషిక హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో అఖిలాండేశ్వరి ఇక వెళ్దామా అనగానే ధాత్రి సరేనని భవాని చేతిలో ఉన్న పేపర్ తీసుకుంటుంది. అందరూ బయటకు వెళ్తుంటే ధాత్రి, నిషికను కిచెన్ లోకి లాక్కెళ్లుతుంది.
నిషిక: ఏయ్ చెయ్యి వదలవే అందరి ముందు ఎక్ట్రాలు చేస్తున్నావు.
ధాత్రి: అందరి ముందు నిజం బయట పెడితే పోయేది నా చెల్లెలు పరువే అనుకున్నాను కాబట్టి. నీ పరువు పోతే నష్టపోయేది ఈ ఇల్లు, ఈ కుటుంబం కాబట్టి పక్కకు తీసుకొచ్చాను.
నిషిక: కుటుంబం పరువు అని చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.
ధాత్రి: ఇలా మాట్లాడితే అయినా కోపంగా మూసుకుపోయిన నీ కళ్లు తెరుచుకుంటాయని అప్పుడైనా ఇంటి కోడలుగా ఎలా ఉండాలో ఎలా మసలుకోవాలో నీకు అర్థం అవుతుందని
నిషిక: నీ ముఖానికి ఒక అత్తారిల్లు లేదు. అత్తగారు లేరు.
అంటూ ధాత్రి కోపంగా నువ్వు మాధురి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావని అది అందరికీ చెప్తే నీ గౌరవం ఏముంటుందని చెప్పగానే నిషిక తిడుతుంది దీంతో ధాత్రి, నిషికను కొడుతుంది. ఇంతలో కౌషికి రావడంతో మాధురి హత్య చేసిన న్యూస్ ఉన్న పేపర్ కావాలనే ధాత్రి వాళ్లకు ఇచ్చిందని ధాత్రే ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తుందని ప్లేట్ ఫిరాయిస్తుంది నిషిక. దీంతో ధాత్రి షాక్ అవుతుంది. ఇంతలో సుధాకర్ వచ్చి నిషికను తిట్టి నువ్వు ఆ పేపర్ ధాత్రికి ఇవ్వడం నేను చూశానని చెప్పడంతో నిషిక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ధాత్రి, కేదార్ గుడి దగ్గరకు వెళ్తారు. ధాత్రి వాళ్ల అమ్మ సంవత్సరీకం సందర్భంగా గుడి ముందు ఫోటో పెట్టి అన్నదానం చేయడానికి అన్ని రెడీ చేస్తారు.
ధాత్రి: అవును కేదార్ మా అమ్మ గురించి నాకు తెలుసు కాబట్టి అమ్మ తప్పు చేసిందంటే నేను నమ్మడం లేదు. కానీ ప్రపంచం అంతా మా అమ్మ తప్పు చేసింది అన్నా నువ్వెందుకు మా అమ్మ నిజాయితీని నమ్ముతున్నావు.
కేదార్: ధాత్రి నాకు ఈ ప్రపంచంతో పని లేదు. నాకు తెలిసిన నా ప్రపంచం నువ్వే.. నాకు నువ్వు ఏం అనుకుంటున్నావు.. నువ్వు ఏం నమ్ముతున్నావు అన్నదే ముఖ్యం. నిజం కోసం నిలబడమని నీకు నేర్పించిన మీ అమ్మ తప్పు చేసింది అంటే నేను నమ్మలేను ధాత్రి.
ధాత్రి: నేను చేసే ఈ ప్రయాణం ఎంత ప్రమాదకరమో నాక్కూడా తెలియదు కేదార్. ప్రమాదం నన్ను దాటి నిన్ను చేరుతుంది అన్నప్పుడు ఆలోచించకుండా వెళ్లిపో..
కేదార్: ప్రాణమైనా వదులుతాను కానీ ఈ చెయ్యి మాత్రం వదలను ధాత్రి.
ధాత్రి: మా అమ్మ నిర్ధోషి అని నిరూపించుకునే సాక్ష్యం ఎక్కడో ఉంది కేదార్. అమ్మ నాకు చెప్తున్నట్లు ఉంది కేదార్.
అని ఇద్దరూ మాట్లాడుకుంటూ అన్నదానం మొదలుపెడతారు. మరోవైపు ధాత్రి వాళ్ల అమ్మకు డ్రైవర్‌గా పనిచేసిన శివయ్యను కొందరు తరుముతుంటే శివయ్య కేదార్, ధాత్రి అన్నదానం చేస్తున్న దగ్గరకు వచ్చి కేదార్ ఫోన్ ఎత్తుకుని పోతాడు. ధాత్రి, కేదార్ శివయ్యను ఫాలో చేస్తారు. శివయ్యకు ఎదురుగా ధాత్రి మేనత్త ఆటోలో వస్తుంది. శివయ్యను ఆటోకు ఎదురుగా వెళ్లగానే ఆమె ఆటో దిగి శివయ్యను ధాత్రి వాళ్ల అమ్మను తిడుతుంది. శివయ్య అమ్మ తప్పు చేయలేదమ్మా అని పారిపోతాడు. ఇంతలో ధాత్రి కేదార్ రావడంతో వాళ్లకు శివయ్య గురించి చెప్తుంది వాళ్ల మేనత్త. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: విడాకుల తర్వాత బిజీ అయిపోయిన నిహారిక.. సినిమాలు, టీవీ షోలతో బిజీ అయిపోయిన మెగా డాటర్