Jagadhatri Serial Today August 22nd: జగద్ధాత్రి సీరియల్: జేడీ-కేడీ vs మీనన్: కిడ్నీల స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు! యువరాజ్-నిషికల పరిస్థితి ఏంటి?
Jagadhatri Serial Today Episode August 22nd జేడీ, కేడీలు మీనన్‌తో ఫైట్ చేసి నిషిక, యువరాజ్‌లను కాపాడి హాస్పిటల్‌లో చేర్చడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode మీనన్ మంగమ్మకి కాల్ చేసి కిడ్నీలు కావాలి అంటే వాడిని చంపేశావ్.. అది ఎవరికి ఫోన్ చేసిందో తెలీదు కనీసం వాళ్లున్న ప్లేస్ మార్చేయండి అని అంటాడు. నిషిక యువరాజ్ లేవడం లేదు హాస్పిటల్‌కి తీసుకెళ్లమని అంటే యువరాజ్ చనిపోయాడని మంత్రసాని చెప్తుంది.
నిషిక కోపంతో మంత్రసాని మీదకు వెళ్తే నిషికను కొట్టేసి ఇద్దరినీ కారులో ఎక్కించుకొని వెళ్తుంటుంది. మనీన్ వాళ్లు లోకేషన్‌కి వచ్చేస్తారు. మీనన్ నిషిక వాళ్లని చూడటానికి వెళ్తే టైంకి జేడీ, కేడీలు అక్కడికి వచ్చేస్తారు. జేడీ, కేడీలను చూసి మీనన్ బిత్తర పోతాడు. జేడీ మీనన్‌తో ఈ సారి ఓ కొత్త క్రైమ్‌తో కలిశావ్. ఈ అవయవాల రాకెట్ స్మగ్లింగ్ వెనక ఉంది నువ్వేనన్నమాట అని అంటుంది. ఎస్ నేనే అని మీనన్ అంటాడు. ఎప్పటికైనా నీ మీద గెలవాలి అని నా టార్గెట్ అని మీనన్ జేడీతో అంటాడు. జేడీ మీనన్‌తో నీ అన్నీ అక్రమాలకు ఈ రోజు ఫుల్‌స్టాప్ పెడుతున్నా అని అంటుంది. మీనన్ తన రౌడీలను జేడీ, కేడీల మీదకు పంపుతాడు. ఇద్దరూ రౌడీలను చితక్కొడతారు.
మంత్రసాని జేడీని కొడుతుంది. మమల్నే మోసం చేస్తావా అని జేడీ ఒక్క దెబ్బ కొట్టడంతో మంత్రసాని పడిపోతుంది. ఇక జేడీ, మీనన్‌లు ఫైట్ చేస్తారు. మీనన్ జేడీని కొట్టేస్తాడు. జేడీ, కేడీలు ఇద్దరూ మీనన్ మీదకు వెళ్లడంతో ఇద్దరినీ మీనన్ కొడతాడు. దాంతో కేడీ జేడీని పక్కన ఉండమని మీనన్‌తో గొడవ పడతాడు. మీనన్ కేడీని కొట్టేస్తాడు. కేడీ మీనన్ చేతిలో చాలా దెబ్బలు తింటాడు. మీనన్ తన మనిషిని కత్తి అడిగి కేడీని నరికే టైంకి జేడీ గన్‌తో కత్తి మీద పేల్చుతుంది. కేడీ దగ్గరకు జేడీ వెళ్లే లోపు మీనన్ తప్పించుకొని పారిపోతాడు.
జేడీ, కేడీలు నిషిక, యువరాజ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. నిషిక లేచే టైంకి జగద్ధాత్రిగా జేడీ అక్కడ ఉంటుంది నిషిక యువరాజ్ గురించి అడిగితే బాగానే ఉన్నాడు ఏం కాలేదని జగద్ధాత్రి చెప్తుంది. యువరాజ్ కండీషన్ చూసి కేథార్ ఏడుస్తాడు. నిషి జగద్ధాత్రికి సారీ చెప్తే జగద్ధాత్రి నిషితో క్షమిస్తున్నానని ప్రతీ సారి తప్పులు చేసి సారీ చెప్తే ఆ సారీకి విలువ ఉండదు అని అంటుంది.
కేథార్ యువరాజ్ దగ్గర కూర్చొంటారు. యువరాజ్ కేథార్‌ని చూసి ముఖం తిప్పేస్తాడు. నేను అంటే ఎందుకు యువరాజ్ నీకు అంత కోపం నేను వచ్చినప్పుడు నుంచి నన్ను అన్న అని ఎప్పుడు పిలుస్తావా అనుకుంటే నన్ను రోజు రోజుకూ ద్వేషిస్తున్నా నేనం ద్రోహం చేశానురా అని కేథార్ అడిగితే నువ్వ మా ఇంటికి రావడమే నువ్వు నాకు చేసిన ద్రోహం అని యువరాజ్ అంటాడు. నేను ఆస్తుల కోసం రాలేదురా కేథార్ అనాథ కాదు వాడికి నాన్న, పిన్ని, తమ్ముడు, అక్క అంటూ ఓ ఫ్యామిలీ ఉందని సమాజానికి చెప్పుకోవాలని అంతే కానీ వేరే ఏమీ ఆశించడానికి అంటాడు. దానికి యువరాజ్ మా ఇళ్లు సత్రం కాదు నిన్ను ఉంచడానికి అని అంటాడు.
కేథార్ యువరాజ్‌తో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇద్దరం అన్నాదమ్ముళ్లమే మన ఇద్దరిలో ప్రవహించేది ఒకటే రక్తం నేను ఆస్తి కోసం రాలేదు.. బంధాల కోసం వచ్చా నువ్వు అది అర్థం చేసుకుంటే మంచిది అని అంటాడు. కేథార్ వెళ్లిపోయిన తర్వాత యువరాజ్ కోపంగా నువ్వు ఎప్పటికీ వజ్రపాటి వారసుడివి కాదు.. నేను నిన్ను అన్న అని పిలవను.. అంటాడు. కేథార్ తల్లిని మంత్రసాని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తాడు. జగద్ధాత్రి నిషికకు మంచి చెప్తూ మీరు ఎన్ని సార్లు సాక్ష్యాలు తారు మారు చేసినా కేథార్ వజ్రపాటి వారసుడు కాకుండా పోడు అని అంటుంది. నిషిక కోపంగా కాపాడావని థ్యాంక్స్ చెప్తా అంతే కానీ నువ్వు నాకు ఎప్పటికీ అక్క కాదు కానివ్వను.. అని అంటుంది. కేథార్ ఏడుస్తుంటే జగద్ధాత్రి అక్కడికి వెళ్తుంది. విషయం తెలుసుకొని యువరాజ్ నిన్ను అన్నగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















