అన్వేషించండి

Guppedantha Manasu ఏప్రిల్ 14 ఎపిసోడ్: రిషికి హగ్ ఇచ్చి దేవయానికి షాకిచ్చిన వసుధార, మహేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. తండ్రి పుట్టిన రోజు సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేసిన రిషి...మినిస్టర్ సన్మానం ఏకంగా ఇంట్లోనే పెడతాడు. ఏప్రిల్ 14 వారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు (Guppedantha Manasu) ఎప్రిల్ 14 బుధవారం ఎపిసోడ్

మహేంద్ర పుట్టినరోజుని తను అనుకున్న విధంగా సెలబ్రేట్ చేసిన రిషి...గిఫ్ట్ ఇస్తానని చెబుతాడు. మీ భార్యతోనే మీరిక్కడ ఉండండి అని కోరుతాడు. ఈ విషయం విని అందరి మొహాలు ఆనందంగా వెలిగిపోతుండగా...దేవయాని మాత్రం కోపంతో రగిలిపోతుంటుంది.  మీరు నాతో ఉండాలి...మీరు ఏం మిస్సయ్యారో నాకు తెలుసు...అందుకే మిమ్మల్ని కలసి ఇక్కడే ఉండమంటున్నాను. ప్రేమంటే దూరం వెళ్లడం కాదు డాడ్..దగ్గరవడం. మీరు నాకు కావాలి, మీరు నాతోనే ఉండిపోవాలి, మీరిక్కడే ఉండిపోండి. రిషి అది అంత ఈజీ కాదని మహేంద్ర చెప్పినా. మీతో ఎవరున్నారన్నది నాకు అనవసరం నాకు నా తండ్రి కావాలి...నాకు మీరే ముఖ్యం..మీరు సంతోషంగా ఉండటం కావాలి.  మీరు గ్రేట్ సార్...మీ ఆలోచనలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని వసుధార,  అత్తయ్య గారికి సరికొత్త షాక్ తగిలిందని ధరణి అనుకుంటారు. ఇంతలో దేవయాని వచ్చి ఏంటి నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్ అని దేవయాని అనడంతో... నా ఆనందమే మీకు ముఖ్యం కదా పెద్దమ్మా మీరు కాదనరనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా అని రిప్లై ఇస్తాడు రిషి. రేపటి వరకూ టైమ్ ఇస్తున్నా డాడ్ మీరే నిర్ణయించుకోండని చెబుతాడు. అటు దేవయాని మాత్రం ఇదే ట్విస్ట్ రిషి..మొత్తం తల్లకిందులు చేశావ్ అనుకుంటుంది.

Also Read: బస్తీలో ఉన్న ఇంట్లో తండ్రి కార్తీక్ ఫొటో చూసి షాక్ అయిన మోనిత కొడుకు ఆనంద్, జ్వాలకి తెలిస్తే ఏం జరగుతుంది
ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయిన తర్వాత రిషి ఒక్కడూ లాన్ లో కూర్చుని, జగతి మేడపై నిల్చుని ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఆలోచిస్తుంటాడు. ఇంతలో జగతి దగ్గరకు వచ్చిన దేవాయని...
దేవయాని: రిషి ఉండమంటే ఉండిపోతావా...ఉండేందుకు ఏ అర్హత ఉంది నీకు అంటుంది..
జగతి: ఇంట్లో ఉండాలంటే అర్హతలు కావాలి...మనసులో ఉండాలంటే ఎవ్వరూ ఏ అర్హతలు అడగరు కదా అని మనసులో అనుకుంటుంది
మహేంద్ర-ఫణీంద్ర: వాళ్లిద్దరూ రూమ్ లో కూర్చుని ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉంటారు...
దేవయాని: రిషి ఎంతపని చేశావ్...ఇన్నాళ్లూ నేను కట్టిన కంచుకోటలోకి జగతికి ఆహ్వానం పలుకుతున్నావా..ఇది ఎలా జరుగుతుందో నేనూ చూస్తాను
గౌతమ్: పెద్దమ్మా..రిషి గొప్పపని చేశాడు కదా ( ధరణి నవ్వుకుంటుంది) వీడి ఆలోచనలు, మైండ్ అద్భుతం...ఈ సందర్భంగా ఇక్కడ పెద్ద పార్టీ చేయాలి
దేవయాని: గౌతమ్ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ...( మెట్లపైనుంచి దిగుతున్న వసుధారని చూసి)... రిషి మారడం వెనుక కొన్ని అదృశ్య శక్తులున్నాయి, కొన్ని శక్తులు-వ్యక్తులు కళ్లముందు కనిపిస్తున్నా ఏమీ చేయలేం...ఎందుకులే గౌతమ్ పరాయివాళ్లు పక్కదారి పట్టించే కిరాయివాళ్లు చాలామంది ఉన్నారు...నువ్వు చిన్నప్పటి ఫ్రెండ్ వి గౌతమ్..మధ్యలో వచ్చిన వాళ్లు మన రిషికి బాగా ఫ్రెండ్స్ అయ్యారులే...
గౌతమ్: మన రిషికి ఫ్రెండ్సా...ఛాన్సేలేదంటాడు ఇంతలో వసుని చూసి నువ్వెప్పుడు వచ్చావ్...ఏం కావాలి..నాకు చెబితే తెచ్చి ఇచ్చేవాడిని కదా..
వసుధార: చాలామంది పక్కవాళ్లని డిస్టబ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కానీ నేను అలా కాదంటూ వాట్ తీసుకుని వెళ్లిపోతుంది...
ధరణి: భలే దెబ్బకొట్టావ్...మా అత్తయ్యకి నీలాంటి వాళ్లు వస్తే ఉంటుంది అనుకుంటూ..ఇంకా ఏమైనా  కావాలా అని వసుని అడుగుతుంది....
వసుధార: నేను వెళ్లిపోతున్నాను...
ధరణి: నువ్వుంటావ్ అనుకున్నాను...ఎందుకు వెళుతున్నావ్...ఉండొచ్చుకదా...
వసుధార: ఎందుకు ఉండకూడదో తెలిసింది మేడం...
ధరణి: చిన్నత్తయ్యకి చెప్పావా..
వసుధార: ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడంని డిస్టబ్ చేయడం కరెక్ట్ కాదులెండి...

బయటకు అడుగుపెట్టిన వసుధారని చూసిన రిషి..ఆగమని పిలుస్తాడు. 
వసుధార: ఎవరికీ చెప్పకుండా వెళదాం అనుకున్నాను రిషి సార్ ఇక్కడే ఉన్నారా...
రిషి: ఎక్కడికి
వసుధార: వెళుతున్నాను సార్..
రిషి: ఉండొచ్చు కదా..
వసుధార: ఎప్పటికైనా వెళ్లాలి కదా...( నేను డ్రాప్ చేస్తానంటే వద్దులెండి అంటుంది). రేపటి వరకూ ఉండాలని నాకూ ఉందిసార్..మీరు మహేంద్ర సార్ కి కాదు మేడంకి గిఫ్ట్ ఇచ్చారు... మేడం ఈ ఇంటికి రావాలని ఎన్నాళ్లనుంచో నేను ఎదురుచూశాను... కార్లో వెళుతూ రిషిని చూస్తూ...అవే మాటలు గుర్తుచేసుకుంటుంది.
రిషి: ఏమైనా అనుకున్నావా....( మనసులో అనుకున్నవి కూడా వినిపిస్తున్నాయ్..) 
వసుని ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు... గుడ్ నైట్ సార్ అనేసి లోపలకు వెళ్లిపోతూ...సడెన్ గా వెనక్కు వచ్చి రిషిని హగ్ చేసుకుంటుంది...రిషి షాక్ లో అలాగే నిల్చుని ఉండిపోతాడు. ( గతంలో తను హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పిన విషయం గుర్తుచేసుకుంటాడు) ఏంటిది అని అడిగితే...గుడ్ నైట్ అనేసి వెళ్లిపోతుంది...

Also Read: రిషి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నాక మహేంద్ర-జగతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు
అటు ఇంటిదగ్గర నిద్రపోకుండా జగతి ఆలోచిస్తుంది. మీ భార్యగారితో ఇక్కడే ఉండాలన్న రిషి మాటలు-ఉండేందుకు ఏం అర్హత ఉంది నీకు అన్న దేవయాని మాటలు గుర్తుచేసుకుంటుంది.  ఇంతలో కారు దిగిన రిషి...వసు హగ్ ని గుర్తుచేసుకుంటూ జగతిని చూసికూడా లోపలకు వెళ్లిపోతుంటాడు. మాట్లాడాలి అని పిలుస్తుంది జగతి...
జగతి: మిమ్మల్ని సార్ అని పిలవడానికి ఇది కాలేజీ కాదు..రిషి అని పిలిచే చనువులేదు... ఇది ఇల్లే అయినా నా ఇల్లు కాదని చాలామంది అనుకుంటున్నారు..డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాను... మహేంద్రతో కలసి నన్ను ఈఇంటికి రమ్మన్నావ్...నువ్వు అని పిలిచే చనువు నాకుందని నేను అనుకుంటున్నాను..అందుకే నువ్వు అని పిలుస్తున్నాను... ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు..  నన్ను ఏ హోదాలో ఈ ఇంటికి రమ్మంటున్నావ్.... ( ఎపిసోడ్ ముగిసింది)

రేపటి( శుక్రవారం ఎపిసోడ్) లో
ఉదయాన్నే మహేంద్ర జగతి కోసం వెతుకుతుంటాడు... ఆ విషయం తెలుసుకున్న దేవయాని... జగతి ఇంట్లో కనిపించడం లేదంట-రాత్రికి రాత్రి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందంటే ఎవర్ని గౌరవించినట్టు అని రాద్దాంతం మొదలెడుతుంది. ఇంతలో ఎంట్రన్స్ దగ్గర వసుధార నిల్చుని ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Embed widget