IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Guppedantha Manasu ఏప్రిల్ 13 ఎపిసోడ్: రిషి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నాక మహేంద్ర-జగతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. తండ్రి పుట్టిన రోజు సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేసిన రిషి...మినిస్టర్ సన్మానం ఏకంగా ఇంట్లోనే పెడతాడు. ఏప్రిల్ 13 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు (Guppedantha Manasu) ఎప్రిల్ 13 బుధవారం ఎపిసోడ్
మిస్టర్ గారి సన్మానానికి , మహేంద్ర బర్త్ డే కి ఇంట్లో ఏర్పాట్లు జరుగుతుంటాయ్. హ్యాపీ బర్త్ డే డాడ్ అనే బోర్డ్ వసుధార సెట్ చేస్తుండగా... డి అనే లెటర్ కిందపడిపోతుంటే వచ్చి పట్టుకుంటాడు రిషి. డాడ్ అనే అక్షరాన్ని కిందపడనివ్వను, నా నుంచి దూరం కానివ్వను వసుధార అని తిరిగి అతికిస్తాడు. ఒక్కదానివే వచ్చావేంటని అడిగితే...వస్తున్నారు సార్ అని రిప్లై ఇస్తుంది వసుధార. 
వసుధార: ఈ బర్త్ డే ఇక్కడ చేయడం మినిస్టర్ కాలేజీకి రాకుండా ఇంటికి రావడం ఏంటి..నాకేం అర్థంకావడం లేదు..
రిషి: కొన్ని అర్థంకాకపోయినా మనకు బావుంటాయ్...
వసుధార: కానీ మీరు ఏదో చేశారు...నాకు అర్థంకావడం లేదు...
రిషి: ఏం జరిగి ఉండొచ్చు...
వసుధార: మీరేమైనా మినిస్టర్ గారితో కాలేజీకి రావొద్దు, ఇంటికి వస్తానని చెప్పించారా...
రిషి: షాక్ అయిన రిషి...అలా జరిగిందంటావా...అలా ఎలా చేప్పిస్తాను...
వసుధార: మహేంద్ర సార్ ని బర్త్ డే ఒప్పించాలంటే ఏం చేయాలని అడిగారు కదా...
రిషి: దానికి నేను తప్ప ఎవరూ సమాధానం చెప్పుకోలేరన్నావ్ కదా చెప్పుకున్నాను సమాధానం...

Also Read: నిరుపమ్, ప్రేమ్ ఇద్దరూ ప్రేమిస్తున్నది హిమనే, మరి జ్వాల సంగతేంటి
జగతి: హ్యాపీ బర్త్ డే మహేంద్ర....
మహేంద్ర: 96... నువ్వు ఇప్పటి వరకూ 96 సార్లు హ్యాపీ బర్త్ డే చెప్పావ్... ఈ బర్త్ డే ఏంటో నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా అలా కుదిరిపోయింది...
బయట అందరూ మినిస్టర్ గారికోసం ఎదురుచూస్తుంటారు. ముందుగా జగతి-మహేంద్ర కారు వచ్చి ఆగుతుంది. అందరూ సంతోషంగా ఉంటే..దేవయాని మాత్రం మొహం ముడుచుకుంటుంది. అందరూ హ్యాపీ బర్త్ డే అని సంతోషంగా చెబుతుంటే...పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చికాకుగా చెబుతుంది దేవయాని. మీ ఆశీస్సులు నాకెప్పుడూ కావాలంటాడు మహేంద్ర. రిషి మాత్రం అలా చూస్తూ నిల్చుంటాడు. అందరూ చెప్పడం అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి హత్తుకుని హ్యాపీ బర్త్ డే చెబుతాడు. వెల్‌ కమ్ టు హోమ్ డాడ్ అంటాడు...
దేవయాని: మహేంద్ర నీకోసమే వచ్చాడా లేదా ఆ మినిస్టర్ గారి సన్మానం అంటూ వచ్చాడా...
ధరణి: ఈవిడకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు...
గౌతమ్: అంకుల్ కి విశెష్ చెప్పావ్ సరే...గిఫ్ట్ ఏం లేదా 
రిషి: ఈ పుట్టిన రోజుకి మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను...
దేవయాని: నాకు తెలియకుండా ఏం గిఫ్ట్ కొన్నాడు
చిన్నత్తయ్యా అని ధరణి వెళ్లబోతుంటే...దేవయాని కోపంగా చూడడంతో వసుధార పద అని తీసుకెళ్లిపోతుంది..
దేవయాని: నువ్విక్కడ ఉండిపోవడానికి రాలేదు...
జగతి: మీ టెన్షన్ చూస్తుంటే నవ్వొస్తోంది...ఈ వయసులో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి... ఆరోగ్యానికి మంచిది... దేవయాని రగిలిపోతూ చూస్తుండగా మళ్లీ కుడికాలు లోపల పెట్టి అడుగుపెడుతుంది ...
అందరూ వచ్చి మహేంద్రకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారు....
వసుధార: రిషి సార్ మహేంద్రసార్ కి ఏం గిఫ్ట్ ఇస్తారో...
ఇంతలో మినిస్టర్ రావడంతో అంతా వెళ్లి ఆహ్వానిస్తారు.

Also Read: సీరియస్ సింహం రిషి సర్ ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి? ఫ్యామిలీ అంతా షాక్!
కేక్ కట్ చేసిన మహేంద్ర కు ... రిషి-జగతి ఇద్దరూ ఒకేసారి కేక్ నోటిదగ్గర పెడతారు. ఏది ఫస్ట్ తింటాడో అని అంతా ఎదురు చూస్తుంటారు. జగతి ఆ చేతిని కిందకు దించుతుండగా పట్టుకున్న మహేంద్ర.. భార్య-కొడుకు చేతిలో కేక్ ఒకేసారి తింటాడు. మహేంద్ర కేక్ తీసి...జగతి వైపు చూసిన తర్వాత రిషికి  తినిపిస్తాడు. ( నువ్వు అనుకున్నది సాధించావ్...నాకు చాలా ఆనందంగా ఉందని మనసులో అనుకుంటాడు).
జగతి: మీ నాన్న పుట్టిన రోజుని నువ్వు అనుకున్న విధంగా జరుపుకున్నావ్..ఇంతకీ గిఫ్ట్ ఏంటి...
కాసేపు పుట్టిన రోజు సందడి , కేక్ తినిపించుకోవడాలు నడుస్తుంది.... ఆ తర్వాత భోజనం చేసి బయలుదేరుతారు మినిస్టర్ గారు...
మహేంద్ర: మనసులో ఎన్నో ఏళ్ల తర్వాత జగతితో మీతో తలసి పుట్టిన రోజు జరుపుకున్నాను...థ్యాంక్యూ రిషి... నువ్వేదో గిఫ్ట్ ఇస్తానన్నావు కానీ ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుంది...
దేవయాని: రిషి...వెళ్లాల్సిన వాళ్లుకూడా వెళితే మనం లోపలకు వెళదాం...
రిషి: అప్పుడేనా పెద్దమ్మా...డాడ్ కి నేను బర్త్ డే గిఫ్ట్ ఇంకా ఇవ్వలేదు కదా... పెద్దమ్మ నా జీవితంలో ఓ దేవత...పెద్దమ్మ లేకపోతే నాకు జీవితమే లేదు..( థ్యాంక్యూ రిషి అనుకుంటుంది దేవయాని). ఈ భూమ్మీద నాకున్న ఒకే ఒక ఆత్మ బంధువు, నా సర్వశ్వం మా డాడ్...బాల్యంలో జరగకూడనివి జరిగాయ్..అందరిలా కాకుండా నా బాల్యం కొత్తగా మొదలైంది..అప్పుడు డాడ్ , పెద్దమ్మ ఇద్దరే నాకు రెండు కళ్లులా మారారు. పెద్దవుతున్న కొద్దీ డాడ్ నాకు ఫ్రెండ్ గా మారారు. ( రిషి సార్ బర్త్ డే గిఫ్ట్ ఇస్తానంటూ ఏదేదో చెబుతున్నారు అనుకుంటుంది వసుధార). ఓ శరీరానికి డాడ్ బొమ్మ అయితే నేను బొరుసులా బతికాను... కానీ..కలలో కూడా ఊహించని విధంగా డాడ్ నానుంచి విడిపోయారు... ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పలేను డాడ్...చెప్పే అవకాశం కూడారాదేమో... మీరు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు మీరు నా ప్రపంచం...మీరే నాకు అన్నీ... మీరు నవ్వితే నేను నవ్వినట్టే..మీరు భోజనం చేస్తే నాకు కడుపునిండినట్టే...మీరు కష్టపడితే నేను కష్టపడినట్టే... డాడ్ మీరిక్కడే ఉండాలి. మీరిక్కడ ఉండాలంటే మీకు ఏం కావాలో నాకు తెలుసు... మీరు అనుకున్న మీ మనసు కోరుకున్న విధంగానే మీరిక్కడం ఉండండి... మీ భార్యతోనే ఇక్కడ ఉండండి...
అందరూ షాక్ అవుతారు...  ఎపిసోడ్ ముగిసింది....

Published at : 13 Apr 2022 09:07 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 13th April Episode 423

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu మే 26 (ఈరోజు) ఎపిసోడ్: జానకీ,రామా వైజాగ్‌ వెళ్లొద్దన జ్ఞానాంభ- విష్ణు ప్లాన్‌తో బుక్కైన మల్లిక

Janaki Kalaganaledu మే 26 (ఈరోజు) ఎపిసోడ్: జానకీ,రామా వైజాగ్‌ వెళ్లొద్దన జ్ఞానాంభ- విష్ణు ప్లాన్‌తో బుక్కైన మల్లిక

Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న

Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న

Guppedantha Manasu మే 26(ఈరోజు) ఎపిసోడ్: మనసులో మాట బయటపెట్టిన రిషి- ఐ లవ్‌ యు చెప్పిన వసుధారకు సర్‌ప్రైజ్‌

Guppedantha Manasu మే 26(ఈరోజు) ఎపిసోడ్: మనసులో మాట బయటపెట్టిన రిషి- ఐ లవ్‌ యు చెప్పిన వసుధారకు సర్‌ప్రైజ్‌

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!