అన్వేషించండి

Guppedanta Manasu Serial Today May 16th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ : రాజీవ్​కు వసుధారను అప్పగిస్తానన్న శైలేంద్ర – నిజం తెలుసకుని ఫైర్ అయిన మహేంద్ర

Guppedanta Manasu Today Episode : వసుధారను రాజీవ్ కు అప్పగిస్తానని శైలేంద్ర చెప్పడంతో మహేంద్ర సీరియస్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode : వసుధార, మహేంద్ర కలిసి పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన విషయాలు అనుపమకు చెప్తారు. కాలేజీ అప్పగిస్తే శైలేంద్ర మనును బయటకు తీసుకొస్తానని చెప్పాడు. మేము వేసిన ఉచ్చులో పడిపోయాడు. ఆ రాజీవ్‌ గాడు  బతికే ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడో శైలేంద్ర గానికి తెలుసు అని చెప్తారు. దీంతో అనుపమ భయపడుతుంది. ఆ దుర్మార్గుడికి కాలేజీ అప్పగిస్తారా? ఆ కాలేజీ కోసమే కదా జగతి ప్రాణాలు  పోగొట్టుకుంది. అని అనుపమ బాధపడుతుంటే ముందే నీకు చెప్పాము కదా ఇదంతా నాటకం అని మహేంద్ర చెప్పగానే ఆ శైలేంద్రకు కాలేజీ అంటే పిచ్చి.. మిరిలా చేస్తే వాడు ఊరుకుంటాడా? అని అనుపమ భయపడుతుంది. దీంతో ఈ విషయంలో తగ్గేదే లేదని మనును క్షేమంగా బయటకు తీసుకొస్తాం అంటూ అనుపమకు ధైర్యం చెప్తాడు మహేంద్ర.

అనుపమ: మహేంద్ర మీరు చాలా పెద్ద రిస్క్‌ చేస్తున్నారు. వాళ్లు పెద్ద రాక్షసులు అని తెలిసి కూడా ఎదురెళ్తున్నారు.

మహేంద్ర: ఇప్పుడు వాళ్లకు ఎదురెళ్లడం తప్పా.. మరో దారి లేదు కదా? ఎందుకు అర్థం చేసుకోవు అనుపమ.    

అనుపమ: సరే అది నీ ఇష్టం.  మీరు చేస్తున్న ఈ రిస్క్‌ వల్ల వసుధారకు ఏం జరగకూడదు.

అనగానే మహేంద్ర ఎందుకు అంత భయపడుతున్నావు. పాజిటివ్‌గా ఉండు అని మహేంద్ర చెప్తాడు. మరోవైపు శైలేంద్ర, రాజీవ్‌ను కలిసి మాట్లాడుతుంటాడు. వసుధార నాకు ప్రతి విషయంలో అడ్డొస్తుందని తనని తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని నువ్వు తీసుకెళ్తావా? అని రాజీవ్‌ను అడుగుతాడు. దీంతో రాజీవ్‌  అనుమానిస్తే.. ఎండీ సీటు కోసం నేను ఎంతో చేస్తుంటే.. నీ మరదలు  నాకు అడ్డుపడుతుంది. అందుకే నీకు అప్పగించాలనుకున్నా అని శైలేంద్ర చెప్పగానే రాజీవ్‌ ఓకే అంటాడు. వసుధారను ఎక్కడికి తీసుకొచ్చేది రాజీవ్‌కు చెప్పి శైలేంద్ర వెళ్లిపోతాడు. మరోవైపు మను కానిస్టేబుల్‌ ఫోన్‌ నుంచి వసుధారకు ఫోన్‌ చేసి అనుపమతో మాట్లాడతాడు.

మను: మేడం మీరు బాగున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. వసుధార మేడం, మహేంద్ర సార్‌ ఉన్నంత వరకు నాకేం కాదు.

మహేంద్ర: నువ్వు ఎలాగైతే నీ జీవితంలో ఒడిదుడుకులు ఎదురుకున్నావో.. నేను కానీ వసుధార, మీ అమ్మ అందరం అలాంటి ఒడిదుడుకులు ఎదురుకున్నాం. నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత.

వసు: అవును మను గారు మీరు వేరే ఆలోచన పెట్టుకోకండి. మీరు మాకు ఏదైనా జరుగుతుందేమోనని అనవసరంగా టెన్షన్‌ పడకండి.

మహేంద్ర: నిన్ను ఈ విధంగా బయటకు తీసుకురావడం రాకపోతే.. ఇంకో విధంగా ప్రయత్నిస్తాం. ఓపిక ఉన్నంత వరకు నీ కోసం పోరాడతాం.

మను: ఎందుకు సార్‌  నా మీద ఇంత అభిమానం.. ఇంత ప్రేమ..

మహేంద్ర: నేను నిన్ను నా కొడుకులా ఫీలయ్యాను. ఫీలయ్యేదేముంది నిన్ను నా కొడుకులానే చూస్తున్నాను.  

అంటూ మహేంద్ర మాట్లాడుతాడు. మనుకు ధైర్యం చెప్తాడు. దీంతో మను ఫీలవుతాడు. తర్వాత శైలేంద్ర, మహేంద్ర ఇంటికి వస్తాడు. వసుధారను నాతో పంపించండి అని మహేంద్రను అడుగుతాడు. మహేంద్ర పంపించనని చెప్పడంతో శైలేంద్ర షాక్‌ అవుతాడు. ఇంతవరకు అందరం కలిసే ప్లాన్‌ చేశాం ఇప్పుడు ఇలా అంటే ఎలా అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో మహేంద్ర కోపంగా వసుధారను తీసుకెళ్లి ఆ రాజీవ్‌ గాడికి అప్పజెప్పాలనే కదా నీ ప్లాన్‌ అని అడగ్గానే శైలేంద్ర అవునని వసుధార కోసం ఆ రాజీవ్‌ గాడు వస్తాడు. నేను ఆల్‌ రెడీ పోలీసులకు సమాచారం ఇచ్చాను. పోలీసులు  ఆ రాజీవ్‌ గాన్ని అరెస్ట్‌ చేస్తారు. అని శైలేంద్ర చెప్పగానే అయితే నేను వస్తాను అని మహేంద్ర అంటాడు. నువ్వు వస్తే ప్లాన్‌ మొత్తం పాడవుతుందని..వద్దని వసుధారను వెళ్దామా అని శైలేంద్ర అడగ్గానే వసుధార మామయ్య మీ కొడుకుని కాపాడే బాధ్యత నాది అని అంటుంది. దీంతో కొడుకా అంటూ శైలేంద్ర షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: అనసూయ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ - వెకేషన్‌లో నది తీరాన భర్త, పిల్లలతో సరదాగా..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Personal Loan: కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Embed widget