Guppedanta Manasu Serial Today March 11th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: రాజీవ్, శైలేంద్రకు మను వార్నింగ్ - మనుకు ఫుల్ సపోర్టుగా ఉంటానన్న మహేంద్ర
Guppedanta Manasu Today Episode: రాజీవ్, శైలైంద్రకు మను వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Telugu Serial Today Episode: రాజీవ్ కాలేజీలో వసుధార, మను పోస్టర్స్ అతికించడం మను చూస్తాడు. వెంటనే రాజీవ్ ను వీడియో తీస్తాడు. అదే వీడియోను శైలేంద్ర, రాజీవ్‌కు చూపిస్తాడు మను. దీంతో శైలేంద్ర, రాజీవ్ షాక్ అవుతారు. రేయ్ నువ్వు మరీ ఇంత శాడిస్ట్ లా ఉన్నావేంట్రా. దాన్ని వీడియో తీసి చూపిస్తున్నావా? ముందే తెలిస్తే ఆపి ఉండొచ్చు కదరా.. కనీసం ప్రింటింగ్ డబ్బులైనా మిగిలేవి అంటాడు శైలేంద్ర.
శైలేంద్ర: అసలు నీ పాలసీ ఎంట్రా?
మను: నాకు పాలసీలు, భీమాలు ఏవి లేవు
శైలేంద్ర: అనవసరంగా మా గురించి తెలియక ఇదంతా చేస్తున్నావ్
మను: ఎందుకు తెలియదు. నువ్వో పెద్ద దుర్మార్గుడివి. వాడో పెద్ద వెధవ. మీరు ఇద్దరు తోడు దొంగలు అని ఇప్పుడే తెలిసింది.
రాజీవ్: భయ్యా.. నీకు మా గురించి తెలిసింది చాలా తక్కువ. తెలియాల్సింది ఎంతో ఉంది. నువ్వు అసలు ఇందులోకి ఎంటర్ కావొద్దు.
మను: నా పోస్టర్స్ వేసి నన్నేందుకు వస్తున్నావ్ అడుగుతున్నావా. మైండ్ ఉండే మాట్లాడుతున్నావా?
అంటూ మను.. శైలేంద్ర, రాజీవ్‌కు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు మను. చూశావా భయ్యా వాడు మనకే వార్నింగ్ ఇస్తున్నాడు. ముందు వీన్ని వేసేయ్యాలి. వీడే మన టార్గెట్ అని రాజీవ్ అంటాడు. శైలేంద్ర ఆలోచిస్తుంటాడు. మరోవైపు మను చేసింది కరెక్టే కదమ్మా ఎందుకు ఫీల్ అవుతున్నావ్ అంటూ మహేంద్ర, అనుపమ అడిగితే అది కరెక్టా కాదా అని కాదు కానీ నాకు అవన్నీ నచ్చలేదు అంటుంది వసుధార.
మహేంద్ర: సరే నచ్చకపోతే సాఫ్ట్ గా చెబితే సరిపోతుంది కదమ్మా?
వసుధార: సాఫ్ట్ గా చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. బెత్తం పట్టి చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి మామయ్య.
మహేంద్ర: ఇలా సీరియస్‌గా చెప్పడం ఎందుకు? తను ఎంత హర్ట్ అయ్యుంటాడు.
వసు: నేను కూడా చాలా హర్ట్ అయ్యాను మామయ్య.
మహేంద్ర: మను మనకు ఎంత సాయం చేశాడమ్మా. కాలేజీ చేజారిపోతున్న సమయంలో వచ్చి కాలేజీని కాపాడాడు.
అంటూ మను గురించి మహేంద్ర పొగుడుతాడు. దీంతో వసుధార ఈ టాఫిక్ ఇక్కడితో వదిలేయండి అని చెప్తుంది. దీంతో నీ ప్రాబ్లమ్ ఎంటి అని అడగ్గానే రిషి సార్ లేకుండా నేను ఏ సెలబ్రేషన్ చేసుకోను మామయ్య అనగానే అయితే రిషి లేడని నువ్వు నమ్ముతున్నావా అంటూ అడుగుతాడు మహేంద్ర. దీంతో షాక్ అయిన వసుధార రిషి సార్ వచ్చేవరకు ఇలాంటి సెలబ్రేషన్స్ నాకు వద్దని చెప్పి వెళ్ళిపోతుంది వసుధార. మరోవైపు శైలేంద్రను చూస్తూ నవ్వుతుంది ధరణి. ఏంటీ అలా చూస్తున్నావ్ అని శైలేంద్ర అంటే.. మీరు మారిపోయారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవయాని వచ్చి విషయం ఎంటో చెప్పు ధరణి అని అడుగుతే కాలేజీలో వసుధారకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పోస్టర్స్ పెట్టి విషెస్ చెప్పారు. అని మీరు మారిపోయారండి అంటూ సంతోషంగా లోపలికి వెళ్తుంది ధరణి.
దేవయాని: ఏంట్రా నిజంగానే మారిపోయావా?
శైలేంద్ర: నేను ఎందుకు మారతాను మామ్. నేను అనుకుంది ఒకటి. అక్కడ జరిగింది మరొకటి
అని కాలేజీలో పోస్టర్స్ గురించి జరిగింది మొత్తం చెబుతాడు శైలేంద్ర.
దేవయాని: మధ్యలో అతనెందుకు వస్తున్నాడు
శైలేంద్ర: తెలీదు మామ్. నేను ఎండీ సీటు కోసం ట్రై చేస్తుంటే వాడు అడ్డు పడుతున్నాడు.
అని కోపంతో వెళ్లిపోతాడు శైలేంద్ర. మరోవైపు మహేంద్ర, మనుకు కాల్ చేస్తాడు.
మహేంద్ర: నువ్ చెప్పింది చాలా బాగుంది మను. వసుధార బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా అరెంజ్ చేయ్. నా ఫుల్ సపోర్ట్ నీకే
అనుపమ: నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు మహేంద్ర. వసుధారకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు.
మహేంద్ర: తన సంతోషం కోసం. తను చాలా రోజులుగా ఆందోళనగా, దిగులుగా ఉంది. రేపు తన మొహంలో ప్రశాంతత చూడాలనుకుంటున్నాను. అందుకే ఇలా చేస్తున్నాను.
అనుపమ: నువ్వు ఇలా చేస్తే తను ప్రళయం సృష్టిస్తుంది. అది నీకు అర్థం కావడం లేదు మహేంద్ర. అవన్నీ అరెంజ్ చేసినా మనునే తిడుతుంది.
అనగానే మహేంద్ర అవేం జరగవు అని అంటాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి నాకు సపోర్ట్ గా మాట్లాడాలి అంటాడు మహేంద్ర. అన్నింటికి సిద్దపడే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు రిషి ఫొటో పట్టుకుని నన్నే అంతా తప్పు పడుతున్నారు. నా బాధ ఎవరికీ అర్థం కావట్లేదు. మావయ్య కూడా నన్నే అంటున్నారు. అని వసుధార ఫీల్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: 'కార్తీకదీపం' సీరియల్ : కొత్త ప్రోమో వచ్చేసింది - అసలు కథ ఇదే