అన్వేషించండి

Karthika Deepam : 'కార్తీకదీపం' సీరియల్‌ : కొత్త ప్రోమో వచ్చేసింది - అసలు కథ ఇదే

Karthika Deepam: కార్తీకదీపం కొత్త ప్రోమోలో సీరియల్ కథ మొత్తం చేప్పేశారు.

Karthika Deepam Serial: కార్తీకదీపం సీరియల్‌ రెండో ప్రోమో రిలీజ్‌ అయ్యింది. ఇప్పటికే ఈ సీరియల్‌కు స్వీక్వెల్‌ వస్తుందని నెల రోజుల కిందటే మొదటి ప్రోమో విడుదల చేసిన సీరియల్‌ టీం నుంచి తాజాగా రెండో ప్రోమో కూడా వచ్చేసింది. మొదటి ప్రోమో కన్నా రెండో ప్రోమో మరింత ఆసక్తికరంగా ఉండటతో సీరియల్‌పై ఎక్స్‌ఫెక్స్టేషన్స్‌ కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తుంది.  

   ఈ జనరేషన్ లో బుల్లితెర ప్రేక్షకుల‌ను క‌ట్టిప‌డేసిన సీరియ‌ల్స్‌ లో కార్తీక దీపం మొదటి వరుసలో ఉంటుంది. ఐపీఎల్ ని మించి టీఆర్పీ రేటింగ్ తెచ్చుకొని, దేశంలోనే ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌తో అందరినీ అబ్బురపరిచింది ఈ సీరియల్‌.  అయితే ఇందులో నటించిన నిరుపమ్‌, ప్రేమీ విశ్వనాథ్ తమ ఒరిజినల్‌ పేర్లను కూడా మర్చిపోయి ప్రేక్షకుల మదిలో డాక్టర్‌బాబు, వంటలక్కలుగా స్థిరపడిపోయారంటే ఈ సీరియల్‌ సక్సెస్‌ రేషియో ఎంతుండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి ఈ సీరియల్‌ అయిపోయి  రెండేళ్లు అవుతున్నా కూడా ప్రేక్షకుల మనసులోంచి ఈ సీరియల్‌ చెరిగిపోలేదనడానికి దీనికి సంబంధించిన ప్రోమో సక్సెస్‌ కావడాన్ని  బట్టి తెలుస్తుంది.   

అయితే  2022 జనవరిలో ఈ సీరియల్ అయిపోయినప్పుడు ఎంతోమంది బాధపడ్డారు. కానీ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ కి కూడా సీక్వెల్ వస్తుందని తెలియడంతో ఎంతో మంది అభిమానులుల ఈ సీరియల్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సోషల్‌ మీడియాలోనూ ఈ సీరియల్‌పై మీమ్స్‌ మొదలయ్యాయి.  నెల కిందట రిలీజ్‌ అయిన  ప్రోమోలో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను మాత్రమే పరిచయం చేశారు. ఇక తాజాగా విడుదలైన  ప్రోమోలో అసలు  స్టోరీ చెప్పే ప్రయత్నం చేశారు.

 ఇక  లేటెస్ట్ ప్రోమోలో శౌర్య పాపను తీసుకుని డాక్టర్‌ బాబు వాళ్ల  ఇంట్లోకి వస్తుంది దీప అలియాస్‌ వంటలక్క. అక్కడ ఒక వ్యక్తి తన కొడుకుని ఎత్తుకుని పని చేస్తుంటాడు. శౌర్య వాళ్లను గమనిస్తూ బాధతో దీపతో కలిసి ఇంట్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్లిన దీప, శౌర్యను చదువుకోమని చెప్పి పనులు చేస్తుంది. ఇంట్లో వాళ్లకు కావాల్సిన అన్నింటినీ వంటలక్క సమకూరుస్తుంది. అమ్మాయికి బెడ్ కాఫీ, పెద్దాయనకు ట్యాబ్లెట్స్‌, ఇలా ఎవరికి  ఏం కావాలో అవి తీసుకెల్లి ఇస్తుంది వంటలక్క. అయితే హాల్‌లో దిగాలుగా కూర్చున్న శౌర్య దగ్గరకు డాక్టర్‌ బాబు వస్తాడు. ఏంటే రౌడీ ఇవాళ స్కూలు లేదా? ఇక్కడికి వచ్చావు అని అడగుతాడు. దీంతో శౌర్య స్కూలు ఉంది కానీ తానే  వెళ్లలేదని.. ఈరోజు స్కూల్లో ఫాదర్స్ డే.. పిల్లలు అందరూ వాళ్ల నాన్నలతో వెళ్తున్నారట.. మా నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు అంటూ శౌర్య పాప బాధపడుతుంది. అయితే గడ్డాలు, మీసాలు పెట్టుకొని నన్ను వచ్చేయమంటావా అంటూ డాక్టర్ బాబు అడగ్గానే శౌర్య పాప సంతోషపడిపోతుంది. ఇంతలో ఏమనుకోకండి బాబు గారూ అంటూ వంటలక్క అక్కడికి వస్తుంది. దీంతో దీపను కోపంగా చూసిన డాక్టర్‌ బాబు నీకు అర్థమవుతుందా.. ఆ పసి హృదయం తండ్రి ప్రేమ కోసం తపిస్తుంది.. పంతాలు, పట్టింపులకి పోకుండా ఒకసారి ఆలోచించు అంటూ డాక్టర్ బాబు సలహా ఇస్తాడు. అయితే బంధానికి, బాధ్యతలకి విలువ ఇవ్వని వ్యక్తి గురించి ఆలోచించను అంటూ  అక్కడి నుంచి వంటలక్క వెళ్లిపోతుంది.

దీంతో ప్రోమో అయిపోతుంది. అయితే ఇప్పటికే రెండు ప్రోమోలు రిలీజ్‌ చేసినీ సీరియల్‌ టీం అసలు సీరియల్‌ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా కన్‌ఫమ్‌ చేయలేదు.

Also Read:  ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయిన 'ఆపరేషన్ వాలెంటైన్', మరీ ఇంత త్వరగానా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget