Guppedanta Manasu Serial Today June 7th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: రిషికి కర్మకాండలు జరిపిస్తానన్న దేవయాని – స్టూడెంట్స్ ను రెచ్చగొట్టిన శైలేంద్ర
Guppedanta Manasu Today Episode: మహేంద్ర ఇంటికి వెళ్లిన దేవయాని గడువులోగా రిషిని తీసుకురాకపోతే కాలేజీలోనే రిషికి కర్మకాండలు జరిపిస్తానని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: మను, వసుధార కలసి పుల్లయ్య చెప్పిన అడ్రస్ కు వెళ్తే అక్కడ శైలేంద్ర టీ తాగుతూ కనిపిస్తాడు. వెంటనే కోపంగా వసు, మను శైలేంద్ర దగ్గరకు వెళ్లి తిడతారు. ఎందుకు ఫోన్ చేశావని అడుగుతే.. నేనెందుకు చేశానని అంటాడు శైలేంద్ర. దీంతో వసు, మను కోపంగా ఎమోషన్స్ తో ఆడుకోవద్దని వార్నింగ్ ఇస్తారు. శైలేంద్ర వెళ్లిపోతాడు. ఇంతలో టీ కొట్టు వ్యక్తిని అడగ్గానే ఇంతదాకా ఇక్కడ ఉన్న వ్యక్తే నా ఫోన్ తీసుకుని ఫోన్ చేశారు. అని చెప్పడంతో శైలేంద్రను తిట్టుకుని మను, వసు అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు దేవయాని, మహేంద్ర ఇంటికి యాడ్ ఇచ్చిన పేపర్ తీసుకుని వెళ్తుంది.
దేవయాని: నాకు తెలుసు అనుపమ నువ్వు ఉంటావని.. సరేలే మహేంద్ర ఏడి?
అనుపమ: గదిలో ఉన్నాడు.
దేవయాని: అవునా మరి వసుధార..?
అనుపమ: కాలేజీకి వెళ్లింది.
దేవయాని: అంటే ఇప్పుడు మీరు ఇద్దరే ఈ ఇంట్లో ఉన్నారన్న మాట..
మహేంద్ర: ( కోపంగా) వదిన గారు
అని కేకలు వేయడంతో దేవయాని.. నేను నీకోసమే వచ్చానని పేపర్ లో ఇచ్చిన యాడ్ చూపించి ఇదేంటని అడుగుతుంది. కుటుంబం పరువు బజారుకు తీసుకొచ్చారు. అనడంతో అవును నాకు తెలుసు ఎవరు కుటుంబం పరువు తీస్తున్నారో అంటాడు మహేంద్ర. దీంతో గడువు పూర్తి అయ్యేలోపు రిషిని తీసుకురావాలి. ఒకవేశ రిషిని తీసుకురాకపోతే రిషికి కర్మకాండ జరిపిస్తాను అని దేవయాని చెప్పడంతో మహేంద్ర, అనుపమ షాక్ అవుతారు. ఆ కర్మకాండ కూడా కాలేజీలోనే జరిపిస్తానని దేవయాని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు కాలేజీలో స్టూడెంట్స్ పేపర్ లో యాడ్ చూసి వసుధార దగ్గరకు వెళ్లి యాడ్ గురించి అడుగుతారు.
స్టూడెంట్స్: మీ మీద నమ్మకంతో సార్ బతికే ఉన్నారు.. బతికే ఉండాలని మేమందరం కోరుకున్నాము. కానీ ఇప్పుడు మీరే పేపర్‌లో సార్ కోసం యాడ్ ఇస్తే మేము ఏది నిజమని నమ్మాలి మేడం.
శైలేంద్ర: రచ్చ మొదలైంది మనం అక్కడికి వెళ్లి ఇంకా రచ్చ రచ్చ చేయాలి.
స్టూడెంట్స్: రిషి సార్ బతికే ఉన్నారనుకోవాలా? లేదంటే చనిపోయారనుకోవాలా?
వసు: సర్ బతికే ఉన్నారు నేను చెప్తున్నాను కదా?
స్టూడెంట్స్: ఎలా చెప్తున్నారు మేడం రిషి సార్ ఎక్కడున్నారో మీకు తెలియదు. అలాంటప్పుడు సార్ ఉన్నారని మీరెలా చెప్తున్నారు మేడం.
అనగానే వసుధార సర్ బతికే ఉన్నారని చెప్తుంది. ఇంతలో శైలేంద్ర వచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన మీరే కన్వీన్స్ చేస్తే ఎలా అని చెప్తాడు. ఇన్ డైరెక్టుగా విద్యార్థులను రెచ్చగొడతాడు శైలేంద్ర. దీంతో స్టూడెంట్స్ రిషి సార్ ఉన్నాడా? లేక చనిపోయాడా అని గట్టిగా నిలదీస్తే మను విద్యార్థులను క్లాస్‌కు వెళ్లమని చెప్తాడు. వాళ్లందరూ వెళ్లిపోతారు. తర్వాత వసుధార, మహేంద్ర, అనుపమ ఇంట్లో కూర్చుని ఆలోచిస్తుంటారు.
మహేంద్ర: అవునమ్మా గడువులోపు రిషిని తీసుకురాకపోతే మన కాలేజీలోనే కర్మకాండలు చేస్తానంటుంది. రిషి గురించి పేపర్‌లో ప్రకటన ఇచ్చాం కదా ఎవరూ ఫోన్ చేయలేదా?
వసు: ఎవరూ చేయలేదు మామయ్య.
మహేంద్ర: ఎవరూ చేయలేదా?
వసు: చేశారు మామయ్యా కానీ అక్కడికి వెళ్లి చూడగానే శైలేంద్ర ఉన్నాడు. ( అంటూ జరిగింది మొత్తం చెప్తుంది వసుధార)
దీంతో మహేంద్ర కోపంగా ఆ శైలేంద్ర గాణ్ని నిలువునా చీల్చినా తప్పు లేదు. అయినా ఇప్పుడు మనం ఏం చేద్దాం అని మహేంద్ర అడుగుతాడు. వసు మౌనంగా ఉండిపోతుంది. మరోవైపు శైలేంద్ర తన జాతకం తీసుకుని చాలా హ్యపీగా ఫీలవుతుంటాడు. దేవయాని వచ్చి ఏంటని అడుగుతుంది. తన జాతకం ఈ మధ్య చాలా బాగా కలిసి వస్తుందని చెప్పగానే ఫణీంద్ర వచ్చి ఏం కలిసొస్తుందని నువ్వు ఇవాళ వెలగపెట్టిన ఘనకార్యం నాకు తెలిసింది. అంటూ బండబూతులు తిడతాడు ఫణీంద్ర దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.