అన్వేషించండి

Pawan Kalyan: పవన్‌ విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌లో కనిపించని అల్లు అర్జున్‌ - అనుకున్నదే నిజమైందా? ఆ ఒక్క ట్వీట్‌ దూరం పెంచిందా..

Mega-Allu Family: మెగా ఇంట జరిగిన పవన్‌ కళ్యాణ్‌ విక్టరీ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్‌, అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. దానికి కారణం ఏంటని ఆరా తీయగా అసలు విషయం ఇదేనంటూ నెట్టింట చర్చ మొదలైంది.

Why Allu Arjun Not Attend Pawan Kalyan Winning Celebration: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల తర్వాత మెగా-అల్లు కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయా అని అభిమానులంతా భయపడ్డారు. దానికి తోడు నాగబాబు ట్విట్‌‌ అల్లు ఫ్యాన్స్‌ని బాగా హర్ట్‌ చేసింది. దీంతో ఆ ట్వీట్‌ మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య అభిప్రాయ బేధాలు తలత్తెలా చేస్తుందేమో అని అనుకున్నారు. అయితే, ఇప్పుడు అదే నిజమైందా అంటున్నారు. దానికి కారణం తాజాగా జరిగిన పవన్‌ కళ్యాణ్‌ విక్టరి సెలబ్రేషన్స్‌.

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన గెలుపుతో మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యారు. గెలుపు తర్వాత తొలిసారి నేడు తన అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి,  మెగా ఫ్యామిలీని కలుసుకున్నాడు జనసేనాని. విక్టరితో వచ్చిన పవన్‌కు మెగా ఫ్యామిలీలో ఘన స్వాగతం పలికింది. తల్లి అంజన్మ దిష్టి తియగా.. వదిన సురేఖ హారతి పట్టారు. ఇక అన్నయ్య చిరు భారీ పూల మాలతో సత్కారించాడు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌తో కేక్‌ కట్‌ చేయించారు. ఈ విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరు ఉన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ అక్కచెల్లెలలతో పాటు మెగా బ్రదర్‌ నాగబాబు ఫ్యామిలీ, చరణ్‌ ఫ్యామిలీ, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ ప్రతి ఒక్కరు ఈ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. అయితే అల్లు ఫ్యామిలీ మాత్రం ఈ వేడుకలో మిస్‌ అయ్యింది. అయితే ఇప్పుడిది ఫ్యాన్స్‌లో ఆలోచనలో పడేసింది. అల్లు ఫ్యామిలీ ఈ సెలబ్రేషన్స్‌లో మిస్‌ అయ్యారా? మిస్‌ చేశారా? అనేది చర్చనీయాంశమైంది. నిజానికి మెగా కుటుంబంలోని ఎలాంటి సెలబ్రేషన్స్‌ అయినా అల్లు ఫ్యామిలీ తప్పకుండ ఉండాల్సిందే. కానీ ఈ వేడుకలో మాత్రం అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో అంతా అల్లు ఫ్యామిలీ ఎందుకు రాలేదా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. దీంతో ఇప్పుడిదే అందరిని సందేహాల్లో పడేసింది.

అల్లు అర్జున్‌ అలా - నాగబాబు ఇలా

కాగా కొంతకాలంగా మెగా కాంపౌండ్‌ నుంచి అల్లు బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నాడంటూ ఇండస్ట్రీలో గుసగుసల నడుస్తున్నాయి. మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్‌ వార్ నడుస్తుందంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదంటూ తరచూ మెగా-అల్లు ఫ్యామిలీ ప్రూవ్‌ చేస్తూనే వస్తుంది. అయినా కూడా ఏదోక సందర్భంగా వీరి మధ్య ఉన్న కోల్డ్‌ వార్‌ బయటకు కనిపించే సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దీనికి బెస్ట్‌ ఎక్సాంపుల్‌ ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలే. ఈ ఎన్నికల్లో ఫ్యామిలీ మెంబర్‌గా పవన్‌కే తన మద్దతు అంటూ బన్నీ ఒక ట్వీట్‌ వేశాడు. కానీ ఆ మరుసటి రోజే నంద్యాల వెళ్లి మరి తన స్నేహితుడైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి తరపున ప్రచారం చేశాడు.

ట్వీట్‌ పెట్టిన చిచ్చు.. 

ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ అయ్యింది. తన ఫ్యామిలీ అయినా పవన్‌ తరపున ప్రచారం చేయకుండ, వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే దీనిక వెనక ఉన్న అసలు కారణం ఇదేనంటూ బన్నీ వివరణ ఇచ్చిన అది కన్‌విన్సింగ్‌గా అనిపించలేదన్నారు మెగా ఫ్యాన్స్‌. అల్లు అర్జున్‌ చేసిన పనికి మెగా ఫ్యామిలీ కూడా నొచ్చుకున్నట్టు కనిపించింది. ఎందుకంటే ఎక్కడ కూడా అంశంపై మెగా హీరోలు స్పందించలేదు. కానీ ఎన్నికల తర్వాత మెగా బ్రదర్‌ నాగబాబు చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపింది."మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే" అంటూ ట్వీట్‌ వదిలి మెగా-అల్లు ఫ్యామిలీలో మనస్పర్థలపై మరోసారి చర్చకు తెరలేపాడు. ఎవరనేది చెప్పకపోయినా ఆయన ఆ ట్వీట్‌ బన్నీనే ఉద్దేశించి చేశాడనేది స్పష్టంగా తెలుస్తోంది. 

అల్లు ఫ్యామిలీ హర్ట్ అయ్యిందా?

బన్నీని పరాయివాడు అనడంతో అతడి ఫ్యాన్స బాగా హర్ట్‌ అయ్యారు.దీంతో నాగబాబు అల్లు ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఈ దెబ్బకు ఏకంగా ఆయన తన ఎక్స్‌ ఖాతానే డియాక్టివేట్‌ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ యాక్టివేట్‌ చేశారు. కానీ, ఆ తర్వాత మెగా-అల్లు ఫ్యామిలీ కలిసి ఎక్కడ కనిపించలేదు. కానీ పవన్‌ కళ్యాణ్‌ గెలుపు అనంతరం బన్నీ విషెస్‌ తెలిపుతూ పోస్ట్‌ చేయడంతో అంతా ఒకే అనుకున్నారు. కానీ, నేడు మెగా ఇంట జరిగిన పవన్ విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌కి అల్లు ఫ్యామిలీ దూరంగా ఉండటంతో నెట్టింట సందేహాలు మొదలయ్యాయి. మెగా ఇంట ఎలాంటి వేడుకైన అల్లు అరవింద్‌ సతీసమేతంగా అక్కడ ఉంటారు. కానీ, ఈ వేడుకలో ఆయన కూడా కనిపించలేదు. దీంతో అల్లు ఫ్యామిలీ నాగబాబు ట్వీట్‌కి బాగా హర్ట్‌ అయ్యారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఆ ఒక్క ట్వీట్‌ మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెంచిందా? అని ఇప్పుడంతా దీనిపై చర్చికుంటున్నారు. మరి దీనికి మెగా-అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. 

Also Read: చిరంజీవి కాళ్లపై పడ్డ పవన్‌.. మెగా ఫ్యామిలీలో భావోద్వేగ క్షణాలు, ఇది చూసేందుకు ఎన్ని కళ్లైనా సరిపోవు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget