Pawna Kalyan: చిరంజీవి కాళ్లపై పడ్డ పవన్.. మెగా ఫ్యామిలీలో భావోద్వేగ క్షణాలు, ఇది చూసేందుకు ఎన్ని కళ్లైనా సరిపోవు!
Pawan Kalyan Visit Chiranjeevi Home: ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ పవన్‌కి హారతి పట్టి ఘన స్వాగతం పలికింది.
జనసేనాని పవన్ కళ్యాణ్ విక్టరితో మెగా కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ నేత వంగా గీతాపై ఆయన 69 వేల ఓట్ల తేడాది ఘన విజయం సాధించారు. గెలుపు అనంతరం తొలిసారి పవన్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. తన కుమారుడు అకిరా నందన్, భార్య అన్నా లెజ్నెవాతో సహా చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్‌కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది.
గెలుపుతో వచ్చిన కుమారుడికి అంజనమ్మ గుమ్మడికాయతో దిష్టి తిసింది. వదిన సురేఖ హారతి ఇచ్చి మరిదిని ఆహ్వానించింది. అనంతరం భావోద్వేగంతో తల్లిని అప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు పవర్ స్టార్. ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి కాళ్లపై పడి పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అన్నయ్య కాళ్లకు నమస్కారించి.. ఆ తర్వాత తల్లి అంజనమ్మ, వదిన సురేఖ కాళ్లకు కూడా నమస్కరించిన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం భావోద్వేగ వీడియో మెగా ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక అన్నదమ్ముల అప్యాయతను చూసి మెగా అభిమానుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.
ఈ వీడియోలో అన్నయ్య చిరంజీవిని చూడగానే పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆయనకు చూడగానే వెంటనే కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తమ్ముడి హత్తుకుని చిరంజీవి ముద్దు పెట్టిన దృశ్యం బాగా ఆకట్టుకుంది. అనంతరం తమ్ముడిని భారీ పూల మాలతో సత్కిరించాడు చిరంజీవి. మొత్తం ఎమోషనల్‌గా సాగిన ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గెలుపు కోసేం మెగా ఫ్యామిలీ ఎంతగానో కోరుకుంది. ఎన్నికల ప్రచారంలో పవన్‌కు మద్దతుగా ఫ్యామిలీ అంతా ఒక్కటై ప్రచారంలో పాల్గొంది. ఇక మెగా బ్రదర్ నాగాబాబు పవన్ పొలిటికల్ జర్నీలో తమ్ముడి వెన్నంటే ఉన్నారు. ఇక తమ్ముడి గెలుపును ఆకాంక్షిస్తూ మెగాస్టార్ జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు.
ఎన్నికల్లో తన తమ్ముడు పవన్‌ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు. పవన్ తరపున ప్రచారం చేస్తూ.. అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలని కోరుకోవడంలో ముందుంటాడు. తన గురించి కంటే కూడా జనం గురించి ఎక్కువ ఆలోచించే మనస్తత్వం కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాకా.. ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటారు. కానీ కల్యాణ్ మాత్రం తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టాడు"అంటూ వీడియో షేర్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ అనంరతం ఆనందం వ్యక్తం చేశారు. గెలిచిన అంనతరం చిరు ట్వీట్ చేస్తూ.. "డియర్ కళ్యాణ్ బాబు... ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే అన్నగా నాకు గర్వంగా ఉంది" అంటూ ఎమోషనల్ అయ్యారు.