అన్వేషించండి

GST Rate Cuts: అధిక ధరలకు విక్రయిస్తున్నారా? జీఎస్టీ తగ్గింపు బెనిఫిట్స్ రాకపోతే ఇలా ఫిర్యాదు చేయండి

GST New Slabs | కేంద్రం జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చినా తమకు ప్రయోజనం అందడం లేదని వినియోగదారులు అంటున్నారు. అయితే జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం అందకపోతే ఫిర్యాదు చేయవచ్చు.

GST 2 Rate Cuts: ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల GST రేట్లను తగ్గించింది. దీనివల్ల చాలా ముఖ్యమైన, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గాయి. 12 శాతం, 28 శాతంగా ఉన్న జీఎస్టీ స్లాబ్స్ రద్దు చేస్తూ సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ చాలా నివేదికలు ఏం చెబుతున్నాయంటే.. దుకాణదారులు, ఈ-కామర్స్ స్టోర్లు ఇప్పటికీ ఎన్నో వస్తువుల ధరలను తగ్గించలేదు. పన్ను తగ్గింపు, దుకాణదారులు వసూలు చేస్తున్న ధరల మధ్య వ్యత్యాసం ఉంటే వినియోగదారులకు GST తగ్గింపు ప్రయోజనం అందదు. పైగా కేంద్రం చెబుతున్న మాటలకు, ప్రజలకు ప్రయోజనంపై ఎక్కడా పొంతన ఉండదు. 

హెల్ప్‌లైన్ నంబర్‌లు విడుదల చేసిన ప్రభుత్వం

జీఎస్టీ సంస్కరణల తరువాత దుకాణాలు, ఆన్‌లైన్ స్టోర్‌లపై ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. GST రేట్లను తగ్గించడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టింది. తద్వారా కొనుగోలుదారులకు అధిక ధరల నుంచి ఉపశమనం కలగనుంది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని భావిస్తే,  సులభంగా ఫిర్యాదు చేయవచ్చని వినియోగదారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 

ఎలా ఫిర్యాదు చేయాలి?

టోల్-ఫ్రీ నంబర్: 1915

WhatsApp నంబర్: 8800001915

ఆన్‌లైన్ పోర్టల్: INGRAM (ఇంటిగ్రేటెడ్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ)

వినియోగదారులు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)కి కాల్ చేయడం ద్వారా లేదా WhatsApp సందేశం పంపడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సెంట్రల్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ బోర్డ్ (CBIC) స్పష్టం చేసింది.

GSTలో భారీ సంస్కరణలు

GST స్లాబ్‌లను సరళీకరించడానికి, ప్రభుత్వం 4 స్లాబ్‌లకు బదులుగా ఇప్పుడు కేవలం 2 స్లాబ్‌లను (5 శాతం, 18 శాతం) ఉంచాలని నిర్ణయించింది. ఈ సంస్కరణల కారణంగా రోజువారీ ఉపయోగించే 99 శాతం మేర వస్తువుల ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ధరల తగ్గింపుతో ప్రజలకు ప్రయోజనంపై నిరంతరం నిఘా ఉంచుతోందని, చాలా కంపెనీలు స్వయంగా ముందుకు వచ్చి ధరలను తగ్గిస్తున్నాయని పేర్కొంది. తద్వారా వినియోగదారులకు దీని ప్రయోజనం అందుతుంది. ఒకవేళ GST తగ్గింపు ప్రయోజనం అందకపోతే, దానిపై ఫిర్యాదు చేయడం మీ హక్కు అని వినియోగదారులకు ప్రభుత్వం సూచించింది. 

రోజువారీ వినియోగించే వస్తువులు, ఉత్పత్తులపై 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. 5 శాతం ఉన్న జీఎస్టీని కొన్ని ఉత్పత్తులపై పూర్తిగా తొలగించడం సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని రకాల కార్లు, బైకులపై సైతం 28 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో విక్రయాలు పెరుగుతున్నాయి. అందులోనూ నవరాత్రి సీజన్, ఫెస్టివల్ సేల్స్ సీజన్ కావడంతో మార్కెట్లకు కొత్త ఊపు రావడం ఖాయమని ఆర్థికశాఖ భావిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget