Renu Desai: జూ. పవన్ కళ్యాణ్ అంటూ అకిరాపై కామెంట్స్ - PK2 అనిపించుకోవడం తనకి ఇష్టం లేదు, ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఫైర్
Renu Desai Latest Post:అకిరాను జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ పిలిచిన నెటిజన్లపై రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. పీకే 2 అనిపించుకోవడం అకిరాతో పాటు పవన్‌కి కూడా ఇష్టం ఉండదంటూ ఆమె వివరణ ఇచ్చారు.
Fans Called Akira as PK2 Renu Desai React on Comments: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అకిరా నందన్ హాట్ టాపిక్ అయ్యాడు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ అనంతరం తన వారసుడిగా తనయుడు అకిరాను అందరికి పరిచయం చేస్తున్నాడు. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పరిచయం చేశాడు. ఇక నేడు ఏకంగా ప్రధాని మోదీని ఫ్యామిలీతో సహా కలిసి భేటీ అయ్యారు. ఇక్కడ కూడా అకిరా పవన్ వెంటే ఉన్నాడు. దీంతో అంతా ఇప్పుడు అకిరాను PSPK2 అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ విక్టరి.. రేణు దేశాయ్ వరుస పోస్ట్స్
కాగా పిఠాపురం ఎమ్మెల్మేగా పవన్ కళ్యాణ్ గెలిచన అనంతరం రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. పవన్‌ని ఉద్దేశిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె వరుస పోస్ట్స్ షేర్ చేస్తున్నారు. తన తండ్రి కోసం అకిరా ఎడిట్ చేసిన వీడియోని ఇన్‌స్టా వేదికగా రిలీజ్ చేశారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. సూపర్ ఎడింగ్, వావ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు. అలాగే అకిరాను పవన్ కళ్యాణ్ 2 (PK 2) అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు. అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు, మరకొరు ఎడిటర్ అవ్వండి అంటూ అకిరా కెరీర్‌పై చర్చ లేపారు. ఇక అభిమానుల కామెంట్స్‌పై రేణు దేశాయ్ స్పందించారు. అకిరాను జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ పిలిచిన నెటిజన్లపై ఈ సందర్భంగా ఆమో ఫైర్ అయ్యారు. అకిరా పీకే2గా ఉండటం ఇష్టం లేదంటూ పేర్కొన్నారు.
"అకిరాకు, తన తండ్రికి (పవన్ కళ్యాణ్‌కి) గాని తను జూనియర్ పవన్ కళ్యాణ్ అనిపించుకోవడం ఇష్టం లేదు. కాట్టి తన ఫీలింగ్‌ని అర్థం చేసుకోని అకిరా నందన్ అని పిలవండి" అంటూ రిప్లై ఇచ్చారామె. అలాగే మరో పోస్ట్‌లో అకిరా యాక్టింగ్ డెబ్యూపై స్పందించారు. "అకిరా పుట్టిన క్షణం నుంచి నేను తన అభిమానిగా ఉన్నాను. అతడు ఎప్పుడెప్పుడు నటిస్తాడా నేను కూడా చాలా ఆసక్తికిగా ఎదురుచూస్తున్నాను. కానీ అంతకంటే ముందు తల్లిగా అతడి నిర్ణయాన్ని, ఫీలింగ్స్‌ని గౌరవించాలి. కాబట్టి తరచూ అకిరా సినీరంగ ప్రవేశంపై తరచూ చర్చ లేపుతూ నాకు చిరాకు తెప్పించకండి. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ చర్చనీయాంశమైంది.