Guppedanta Manasu Serial Today August 31st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మంచి మనుషులుగా మారిన శైలేంద్ర, దేవయాని – గుప్పెడంత మనసుకు హ్యపీ ఎండింగ్
Guppedanta Manasu Today Episode: దేవయాని, శైలేంద్ర మంచిగా మారడంతో కాలేజీలో ఎండీకి బదులుగా శైలేంద్ర ప్యూన్ గా జాయిన్ అవుతాడు. దీంతో సీరయల్ ఎండింగ్ కార్డు పడుతుంది.
Guppedanta Manasu Serial Today Episode: ఫణీంద్ర, శైలేంద్రను కొట్టబోతుంటే ఇంతలో మహేంద్ర, రిషి వస్తారు. వాళ్లను చూసిన శైలేంద్ర షాక్ అవుతాడు. అంతకు ముందు మహేంద్ర దగ్గర శైలేంద్ర మాట్లాడిన వీడియో చూపిస్తాడు రిషి. మా డాడ్ ని ఎవరు కాపాడారో చెప్పమంటావా?అని జరిగిన విషయం చెప్తాడు రిషి.
రిషి, వసుధారలను మహేంద్ర రూమ్‌లో లాక్ చేసి వెళ్లిపోగానే వాళ్లకు మను కాల్ చేస్తాడు.
మను: మహేంద్ర సార్‌ను శైలేంద్ర కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. నేను వాడిని ఫాలో అవుతున్నాను. లొకేషన్ పంపిస్తాను. మీరు అక్కడికి వచ్చేయండి.
వసుధార: మేము ఇప్పుడు వచ్చే పొజిషన్‌లో లేము. శైలేంద్ర గురించి మేము నిజాలు చెప్పేసరికి మమ్మల్ని డోర్ లాక్ చేసి మావయ్య ఒక్కరే వెళ్లిపోయారు.
మను: సరే ఓకే
అని మను అనుపమకు కాల్ చేస్తాడు. ఇంతలో అనుమప వసుధార వాళ్ల ఇంటికి వస్తుంది. మను ఫోన్ చేసి అంతా చెప్పాడని డోర్ లాక్ పగులగొడుతుంది. మరోవైపు మహేంద్రను కిడ్నాప్ చేసిన తర్వాత ఆయనతో శైలేంద్ర మాట్టాడింది మొత్తం మను ఫోన్ లో రికార్డు చేస్తాడు. ఇంతలో రౌడీలు మహేద్రను ఎలా చంపాలా అని ఆలోచిస్తుంటే మను వెళ్లి రౌడీలను కొడుతుంటాడు. ఇంతలో రిషి కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరూ కలిసి రౌడీలను చితక్కొటి మహేంద్రను సేవ్ చేస్తారు. అదంతా విని శైలేంద్ర షాక్ అవుతాడు.
రిషి: పెద్దమ్మ నీ చేతితోనే చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపించావు. అమ్మ వదిలేసిపోయాక అమ్మవై పెంచావు. తల్లిలా ప్రేమను పంచావు. నువ్ చెప్పింది చేసేవాన్ని. నీకు ఏరోజు ఎదురుతిరగలేదు. అసలు నేను ఏ తప్పు చేశాను. నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు. మీరు పెంచిన చేతులతోనే నా పీక పిసికి చంపేస్తే అయిపోయేది కదా. సరే పెద్దమ్మ మీకు కావాల్సింది మీకు ఇస్తాను. మరి నాకు కావాల్సింది నాకు ఇస్తారా. ఎండీ పదవి మీకిస్తాను. మా అమ్మను నాకిస్తారా..?
దేవయాని: నాన్నా రిషి.. ( అంటూ ఎమోషనల్ అవుతుంది.) చేయకూడని తప్పు చేశాం. పదవి దక్కించుకోవాలన్న ఆశతో తీరని నష్టం చేశాం. నన్ను క్షమించు రిషి..
అని రిషి కాళ్లపై పడుతుంది. దీంతో ఆస్తి పత్రాలు దేవయానికి ఇచ్చి మాకు ఏ ఆస్తి వద్దని, అన్ని మీరే తీసుకోండని అంటాడు రిషి. కానీ కాలేజీ మాత్రం మీకివ్వలేను అంటాడు. దీంతో శైలేంద్ర ఇన్నాళ్లు దానికోసం చేసిన దుర్మార్గాలు వృధా అవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా..? నాకు కాలేజీని అప్పజెబుతావా లేదా అంటూ గన్ తీసి రిషికి ఏయిమ్ చేస్తాడు. అంతా షాక్ అవుతారు. వసుధార, దేవయాని అడ్డుపడతారు.
శైలేంద్ర: అడ్డు తప్పుకో మమ్మీ లేదంటే నిన్ను కూడా షూట్ చేయాల్సి వస్తుంది.
దేవయాని: అయితే షూట్ చేయ్యరా.. ముందు నన్ను చంపి ఆ తర్వాత రిషి జోలికి వెళ్లు.
అనగానే శైలేంద్ర గన్ కిందకు తీస్తాడు. ఇన్నాళ్లు తప్పులు చేశాం. ఇక మారదాంరా. ఎండీ పదవిలో నిన్ను గొప్పగా చూడాలని అనుకున్నాను. కానీ, రిషి, మీ నాన్న, బాబాయ్ ఉండగా అది చాలా చిన్నదిరా. వదిలేయ్ అని దేవయాని అంటుంది. దీంతో కన్వీన్స్ అయిన శైలేంద్ర తాను తప్పు చేశానని తనను తాను షూట్ చేసుకోబోతుంటే రిషి ఆపుతాడు. కట్ చేస్తే డీబీఎస్టీ కాలేజీలో శైలేంద్ర ప్యూన్ గా పనులు చేస్తుంటాడు. ఫణీంద్ర, మహేంద్ర, వసుధార, శైలేంద్రతో ఓ ఆట ఆడుకుంటుంటారు. దీంతో గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ అయిపోతుంది.