Guppedanta Manasu Serial Today August 19th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మను తండ్రి తానేనన్న నిజం తెలుసుకున్న మహేంద్ర - మహేంద్రను చంపేందుకు దేవయాని ప్లాన్
Guppedanta Manasu Today Episode: నిజం తెలిసిన మను, మహేంద్రను చంపాలనుకుంటాడు. అదే సమయంలో దేవయాని కూడా మను చేత మహేంద్రను చంపించాలనుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Guppedanta Manasu Serial Today August 19th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మను తండ్రి తానేనన్న నిజం తెలుసుకున్న మహేంద్ర - మహేంద్రను చంపేందుకు దేవయాని ప్లాన్ Guppedanta Manasu serial today episode August 19th written update Guppedanta Manasu Serial Today August 19th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: మను తండ్రి తానేనన్న నిజం తెలుసుకున్న మహేంద్ర - మహేంద్రను చంపేందుకు దేవయాని ప్లాన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/19/67f3e9d4571b871fe07eaf5d4e07208b1724042075136879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guppedanta Manasu Serial Today Episode: నిద్రపోకుండా ఆలోచినస్తున్న రిషి ని ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది వసుధార. ఏం లేదని రిషి చెప్పగానే సరోజ గురించి ఆలోచిస్తున్నారు కదూ అంటుంది. నాకన్నా ఎక్కువ సరోజ గురించి నువ్వే అలోచిస్తున్నావని నేను శైలేంద్ర గురించి ఆలోచిస్తున్నాని బదులిస్తాడు రిషి. ఎప్పుడు ఎండీ సీటు గురించి ఆలోచించే అన్నయ్య బోర్డు మీటింగ్ కు ఎందుకు లేట్ గా వచ్చాడని అలా రావడానికి నువ్వేమైనా చేశావా అని వసుధారను అడుగుతాడు రిషి. దీంతో వసుధార చిలిపిగా రిషి మీద అలుగుతుంది. నేనేం చేయలేదని ఉదయం నుంచి నీ వెంటే ఉన్నానుగా అంటుంది. మరోవైపు మను, మహేంద్ర తనతో చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు.
నిజం తెలిసినా తనను మభ్య పెట్టడానికే ఇన్నాళ్లు మంచిగా ఉన్నట్లు మహేంద్ర నటించాడని మను అపార్థం చేసుకుంటాడు. మహేంద్రను షూట్ చేయాలని ఆవేశంగా గన్ తీస్తాడు మను. ఎదురుగా మహేంద్ర ఫొటో కనిపించడంతో ఫొటోను షూట్ చేయబోతాడు. కానీ మహేంద్ర తో తనకు ఉన్న రిలేషన్ గుర్తు చేసుకుని ఆగిపోతాడు మను. మరోవైపు రిషి, వసుధారలను దెబ్బతీయడానికి మరో స్కెచ్ వేస్తారు దేవయాని శైలేంద్ర.
దేవయాని: నాన్నా శైలేంద్ర మనం ఆ మను గాడికి తండ్రిపై ఉన్న ద్వేషాన్ని పావుగా వాడుకోవాలి.
శైలేంద్ర: నిజమే మామ్ కానీ నిజం అందరికి తెలిసిన తర్వాత మను, మహేంద్ర ఒక్కటైతే మనకే ప్రమాదం.. రిషిగా నాటకం ఆడుతుంది రంగానే అని తెలిస్తే ...అప్పుడు ఆ మనుగాడే ఇంటికి, కాలేజీకి వారసుడు అవుతాడు.
దేవయాని: అలా జరగడానికి వీలులేదు శైలేంద్ర. ఇన్నాళ్లు తండ్రికి దూరంగా ఉన్న ఆ మనుగాడిని శాశ్వతంగా దూరం చేయాలి. మను మనసులో తండ్రి మీద ఉన్న ద్వేషాన్ని ఇంకా రెచ్చగొట్టాలి.
శైలేంద్ర: అవును మామ్ అలా చేస్తే ఆ మహేంద్రను మనుగాడే చంపేస్తాడు. మను జైలుకు వెళితే...రంగా సాయంతో కాలేజీని దక్కించుకోవచ్చు.
అనుకుంటూ ఇద్దరూ ప్లాన్ చేస్తారు. మరోవైపు బోర్డ్ మీటింగ్‌కు శైలేంద్ర ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి ధరణికి ఫోన్ చేస్తుంది వసుధార. బోర్డ్ మీటింగ్ రోజు దేవయాని చాలా టెన్షన్ పడ్డారని, ఏదో ఒక లెటర్ ఫొటో తీసి ఎవరికో పంపించిందని వసుధారకు ధరణి చెబుతుంది. మను వల్లే ఎండీ సీట్ చేజారిందని శైలేంద్ర ఏదో చెప్పబోతుండగా అత్తయ్య అడ్డుకుందని ధరణి అంటుంది. దీంతో మనుకు తన తండ్రి ఎవరో తెలిసిపోయిందని వసుధార ఊహిస్తుంది. రిషికి వెంటనే ఈ నిజం చెప్పాలకనుకుంటుంది వసుధార.
రిషి: ఏమైంది వసుధార చాలా టెన్షన్‌గా ఉన్నావు. నువ్వు ఇలా ఆందోళన పడుతుంటే నేను చూడలేకపోతున్నాను.
రిషి: ఏం లేదు సర్. కానీ అనుపమ మేడంను కలిసిన తర్వాత మీకు అన్ని విషయాలు చెబుతాను.
తర్వాత అనుపమ దగ్గరకు రిషి, వసుధార బయలుదేరుతారు.. వారితో పాటు మహేంద్ర కూడా వస్తానని అంటాడు.. కానీ వసుధార వద్దని వెళ్లిపోతుంది. అనుపమను రిషి, వసుధార కలుస్తారు. మనుకు తన తండ్రి ఎవరో తెలియదని, అనుపమను ఎన్నిసార్లు అడిగినా ఆమెకు కొడుకుకు నిజం చెప్పలేకపోతుందని రిషితో అంటుంది వసుధార. మను తండ్రి మంచివాడు కాదా...దుర్మార్గుడా...అందుకే అతడి పేరు చెప్ప లేకపోతున్నారా అని అనుపమను అడుగుతాడు రిషి. ఇంతలో మను తండ్రి మహేంద్రనే అనే నిజం రిషికి చెబుతుంది వసుధార. రిషి వసుధారను ఫాలో అవుతూ వచ్చిన మహేంద్ర...వసుధార మాటలు విని షాకవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)